- సుదీర్ఘ విచారణ అనంతరం నిర్ణయం
- సీనియర్ అసిస్టెంట్‌ను తొలగిస్తూ ఉత్తర్వులు
తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఊడిన ఉద్యోగం
Published Fri, Aug 12 2016 11:22 PM | Last Updated on Mon, Jul 29 2019 5:53 PM
హన్మకొండ :
జిల్లా ప్రజాపరిషత్ సీనియర్ అసిస్టెంట్ బి.లక్ష్మి అన్నపూర్ణను తొలగిస్తూ జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్.విజయ్‌గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. చిట్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న లక్ష్మి అన్నపూర్ణ తప్పు డు ఎస్సీ ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం పొం దినట్లు నిర్ధారణ కావడంతో సీఈఓ ఆమెను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ–డీకి చెందిన బి.లక్ష్మి అన్నపూర్ణ దళితుడైన బి.బాబును వివాహం చేసుకుంది. ఉపాద్యాయుడైన బాబు మృతి చెందడంతో భర్త ఎస్సీ కావడంతో ఎస్సీ ధ్రువీకరణ పత్రం సమర్పించి 1997లో జూనియర్ అసిస్టెంట్‌గా కారుణ్య నియామకం పొందింది. అనంతరం ఎస్సీ సర్టిఫికెట్‌పై సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందింది. ఆ తర్వాత ఆమె బీసీ డి కేటగిరికీ చెందినదని తెలుసుకున్న జెడ్పీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘం నేతలు 2013లో అప్పటి జెడ్పీ సీఈఓకు ఫిర్యాదు చేయగా, 2015లో ములుగు ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించా రు. విచారణ జరిపిన ఆర్డీఓ లక్ష్మిఅన్నపూర్ణ ఎస్సీ కాద ని నివేదిక అందజేశారు. దీన్ని కలెక్టర్‌కు అందించగా ఎస్సీ ధ్రువీకరణ పత్రం రద్దుకై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా స్క్రూటిని కమిటీకి అప్పగించారు. ఈ కమిటీ మరోసారి విచారించి లక్ష్మి అన్నపూర్ణ దళితురాలు కాదని, బీసీ డీ అని తేల్చి ఎస్సీ ధ్రువీకరణ పత్రం రద్దు చేస్తూ కలెక్టర్‌కు నివేదిక అందించారు. దీంతో గత నెలలో ఆ పత్రం రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ గెజిట్ పబ్లికేషన్ ఇస్తూ, ఎందుకు ఉద్యోగం నుంచి తొలగించకూడదో చెప్పాలని లక్ష్మిఅన్నపూర్ణకు జెడ్పీ అధికారులు నోటీసు జారీ చేశారు. నెలరోజులసమయంతీసుకున్నా, మరికొంత సమయం కావాలని కోరినట్లు సమాచారం. దీంతో సంతృప్తి పడని సీఈఓ బి.లక్ష్మిఅన్నపూర్ణను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. ఎస్సీ, ఎస్టీ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఉద్యోగం పొందితే డిస్మిస్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు లక్ష్మి అన్నపూర్ణను డిస్మిస్ చేశారు.
Advertisement
Advertisement