False certification documents
-
Ministry of Telecom: తప్పుడు సిమ్‌లు 21 లక్షలు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తప్పుడు ధృవీకరణ పత్రాలతో 21 లక్షల సిమ్ కార్డులు జారీ అయినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ) అనుమానం వ్యక్తంచేసింది. రీ–వెరిఫికేషన్ చేసి బోగస్ సిమ్‌లుగా తేలిన వాటిని వెంటనే రద్దుచేయాలని భారతీ ఎయిర్టెల్, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ టెలికం సంస్థలకు డీఓటీ హెచ్చరికలు జారీచేసింది. సంచార్ సాతీ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 114 కోట్ల మొబైల్ కనెక్షన్లను డీవోటీకి చెందిన ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఏఐ, డీఐయూ) విశ్లేíÙంచింది. దీంతో దేశవ్యాప్తంగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో 21 లక్షల సిమ్ కార్డులు యాక్టివేట్ అయి ఉన్నట్లు డీఓటీ విశ్లేషణలో తేలింది. మనుగడలో లేని, తప్పుడు, ఫోర్జరీ, నకిలీ ధృవీకరణ పత్రాలతో ఈ సిమ్‌కార్డులను సంపాదించి యాక్టివేట్ చేసి ఉంటారని ఏఐ, డీఐయూ విశ్లేషణలో వెల్లడైంది. దేశంలో తొమ్మిది సిమ్ కార్డుల కంటే ఎక్కువ తీసుకున్న వారు ఏకంగా 1.92 కోట్ల మంది ఉన్నట్లు ఈ విశ్లేషణలో వెల్లడైంది. 21 లక్షల సిమ్ కార్డుల్లో కొన్ని అనుమానాస్పద ఫోన్ నంబర్ల జాబితాను విడుదల ఆయా టెలికం కంపెనీలకు డీఓటీ పంపించింది. వాటి ధృవీకరణ పత్రాలను సరిచూసి రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రీవెరిఫికేషన్లో ఆ సిమ్‌లు తప్పుడు పత్రాల ద్వారా తీసుకున్నట్లు గుర్తిస్తే ఆ నంబర్లను తక్షణం రద్దు చేయాలని సూచించింది. ఇప్పటి వరకు 1.8 లక్షల మొబైల్ హ్యాండ్సెట్లను పనిచేయకుండా చేశామని డీఓటీ అధికారులు చెప్పారు. అనుమానాస్పద నంబర్లపై దర్యాప్తును సరీ్వసు ప్రొవైడర్లు వేగవంతం చేయాలని డీవోటీ తుది గడువు విధించింది. సైబర్ నేరాలకు దుర్వినియోగం! తప్పుడు పత్రాలతో పొందిన సిమ్‌లను ఆయా వ్యక్తులు సైబర్ నేరాలకు వాడుతున్నట్లు డీఓటీ అనుమానం వ్యక్తంచేసింది. ఒక ప్రాంతంలో తీసుకున్న బోగస్ సిమ్‌ను సుదూర ప్రాంతాల్లో వాడున్నట్లు గుర్తించారు. తప్పుడు పత్రాలతో సేకరించిన సిమ్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొట్టే ప్రమాదముంది. సిమ్‌లను సైబర్ నేరాలకు వాడుతున్నట్లు తేలితే వాటిని రద్దు చేయడంతో పాటు ఫోన్‌నూ పనికిరాకుండా చేస్తామని హెచ్చరించింది. -
తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఊడిన ఉద్యోగం
సుదీర్ఘ విచారణ అనంతరం నిర్ణయం సీనియర్ అసిస్టెంట్‌ను తొలగిస్తూ ఉత్తర్వులు హన్మకొండ : జిల్లా ప్రజాపరిషత్ సీనియర్ అసిస్టెంట్ బి.లక్ష్మి అన్నపూర్ణను తొలగిస్తూ జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్.విజయ్‌గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. చిట్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న లక్ష్మి అన్నపూర్ణ తప్పు డు ఎస్సీ ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం పొం దినట్లు నిర్ధారణ కావడంతో సీఈఓ ఆమెను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ–డీకి చెందిన బి.లక్ష్మి అన్నపూర్ణ దళితుడైన బి.బాబును వివాహం చేసుకుంది. ఉపాద్యాయుడైన బాబు మృతి చెందడంతో భర్త ఎస్సీ కావడంతో ఎస్సీ ధ్రువీకరణ పత్రం సమర్పించి 1997లో జూనియర్ అసిస్టెంట్‌గా కారుణ్య నియామకం పొందింది. అనంతరం ఎస్సీ సర్టిఫికెట్‌పై సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందింది. ఆ తర్వాత ఆమె బీసీ డి కేటగిరికీ చెందినదని తెలుసుకున్న జెడ్పీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘం నేతలు 2013లో అప్పటి జెడ్పీ సీఈఓకు ఫిర్యాదు చేయగా, 2015లో ములుగు ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించా రు. విచారణ జరిపిన ఆర్డీఓ లక్ష్మిఅన్నపూర్ణ ఎస్సీ కాద ని నివేదిక అందజేశారు. దీన్ని కలెక్టర్‌కు అందించగా ఎస్సీ ధ్రువీకరణ పత్రం రద్దుకై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా స్క్రూటిని కమిటీకి అప్పగించారు. ఈ కమిటీ మరోసారి విచారించి లక్ష్మి అన్నపూర్ణ దళితురాలు కాదని, బీసీ డీ అని తేల్చి ఎస్సీ ధ్రువీకరణ పత్రం రద్దు చేస్తూ కలెక్టర్‌కు నివేదిక అందించారు. దీంతో గత నెలలో ఆ పత్రం రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ గెజిట్ పబ్లికేషన్ ఇస్తూ, ఎందుకు ఉద్యోగం నుంచి తొలగించకూడదో చెప్పాలని లక్ష్మిఅన్నపూర్ణకు జెడ్పీ అధికారులు నోటీసు జారీ చేశారు. నెలరోజులసమయంతీసుకున్నా, మరికొంత సమయం కావాలని కోరినట్లు సమాచారం. దీంతో సంతృప్తి పడని సీఈఓ బి.లక్ష్మిఅన్నపూర్ణను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. ఎస్సీ, ఎస్టీ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఉద్యోగం పొందితే డిస్మిస్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు లక్ష్మి అన్నపూర్ణను డిస్మిస్ చేశారు.