ధోని ఖతాలో మరో రికార్డు! | Mahendra Singh Dhoni becomes first Indian keeper to cross 300 dismissals | Sakshi
Sakshi News home page

ధోని ఖతాలో మరో రికార్డు!

Published Sun, Jan 19 2014 1:09 PM | Last Updated on Mon, Jul 29 2019 5:53 PM

ధోని ఖతాలో మరో రికార్డు! - Sakshi

ధోని ఖతాలో మరో రికార్డు!

భారత క్రికెట్‌కి కొత్త ‘దేవుడు’గా నీరాజనాలందుకుంటున్న మహేంద్ర సింగ్ ధోని మరో ఘనత సాధించాడు. టీమిండియాకు విజయవంతమైన నాయకుడిగా కొనసాగుతున్న ఈ జార్కండ్ ప్లేయర్ సమకాలిన క్రికెట్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. విక్టరీల్లోనే కాదు ఆటలోనూ అద్భుతాలు చేస్తున్నాడు. తాజాగా ధోని మరో రికార్డు కైవసం చేసుకున్నాడు. వికెట్ల వెనకుండి ఈ రికార్డు సాధించడం విశేషం.

వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత వికెట్ కీపర్గా 'కూల్ కెప్టెన్' రికార్డు సాధించాడు. 300 వికెట్లు(220 క్యాచ్లు, 79 స్టంపింగ్లు) తీసి అతడీ ఘనత అందుకున్నాడు. న్యూజిలాండ్తో నేపియర్లో జరిగిన తొలి వన్డేలో 37వ ఓవర్లో ఈ రికార్డు నెలకొల్పాడు. మహ్మద్ షమీ బౌలింగ్లో రాస్ టేలర్ క్యాచ్ అందుకుని ఈ రికార్డు తన ఖతాలో వేసుకున్నాడు. 32 ఏళ్ల ధోని 239 మ్యాచ్ల్లో మొత్తం 301 వికెట్లు కూల్చాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో బ్రెండన్ మెక్కల్లమ్ క్యాచ్ పట్టి 301వ వికెట్ దక్కించుకున్నాడు.

తాజా రికార్డుతో దిగ్గజ వికెట్ కీపర్ల సరసన ధోని చేరాడు. అతడు నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్క్రిస్ట్ అందరికంటే ముందున్నాడు. గిల్క్రిస్ట్ 287 మ్యాచ్ల్లో 472 వికెట్లు పడగొట్టాడు. మార్క్ బౌచర్(దక్షిణాఫ్రికా), కుమార సంగక్కర(శ్రీలంక) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బౌచర్ 295 వన్డేల్లో 424 డిస్మిసల్స్ చేశాడు. సంగక్కర 362 మ్యాచ్ల్లో  424 వికెట్లు తీశాడు.

ధోని ఖాతాలో మరో రికార్డు కూడా చేరింది. న్యూజిలాండ్ జట్టు నుంచి అత్యధిక క్యాచ్లు అందుకున్న భారత కెప్టెన్గా నిలిచాడు. పది క్యాచ్లు అందుకుని అతడీ ఘనత సాధించాడు. టేలర్ క్యాచ్ అతడిని కివీస్ టీమ్పై 10వది. అంతకుముందు ఈ రికార్డు మహ్మద్ అజహరుద్దీన్ పేరిట ఉంది. టీమిండియాకు అత్యంత విజయమైంతన సారథిగా ధోని ఇప్పటికే ఖ్యాతికెక్కాడు. ఈ కూల్ కెప్టెన్ మరిన్ని రికార్డులు సాధించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement