cool captain
-
అందుకే.. ఫీల్డ్‌లో నాకు ఎప్పుడూ కోపం రాదు: ధోని
మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు దోని అందించాడు. ఫీల్డ్‌లో ఎటువంటి పరిస్థితులోనైనా ప్రశంతంగా కన్పించి ధోని.. మిస్టర్ కూల్‌గా పేరుగాంచాడు. తన ప్రశాంతత వెనుక ఉన్న కారణాన్ని ధోని తాజాగా బయటపెట్టాడు. ప్రముఖ ఇన్వర్టర్ బ్యాటరీల సంస్థ లివ్‌ఫాస్ట్ కార్యక్రమంలో శుక్రవారం ధోనీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. కోపంతో మనం చేసదేమి లేదని, వీలైనంత వరకు నా భావోద్వేగాలను నియంత్రించుకునేందుకు ప్రయత్నిస్తానని ఎంఎస్ తెలిపాడు. "నిజాయితీగా చెప్పాలంటే.. ఫీల్డ్‌లో మేము ఎటువంటి తప్పులు చేయకూడదనుకుంటాము. ఒక ఆటగాడు క్యాచ్ డ్రాప్ చేసినా, మిస్ ఫీల్డ్ చేసినా అలా ఎందుకు అయింది నేను ఆలోచిస్తాను. కోపం తెచ్చు కోవడం వల్ల పెద్దగా సాధించినది ఏమి ఉండదు. అప్పటికే స్టేడియంలో 40వేల మంది ప్రేక్షకులతో పాటు, కోట్లాది బంది అభిమానులు టీవీల్లో మ్యాచ్‌ను వీక్షిస్తుంటారు. అందుకే ఎందుకు ఆలా జరిగిందని ఆలోచిస్తాను. ఆటగాడు ఎవరైనా గ్రౌండ్లో వంద శాతం శ్రద్ధగా ఉండి ఆ తర్వాత కూడా క్యాచ్ డ్రాప్ అయితే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే అతడు ప్రాక్టీస్‌లో ఎన్ని క్యాచ్ లు పట్టుకున్నాడో, అదే విధంగా ముందు మ్యాచ్‌ల్లో ఎన్ని క్యాచ్‌లు పట్టాడు అన్నది నేను గుర్తు పెట్టుకుంటాను. కాగా క్యాచ్ వల్ల మ్యాచ్ ఓడిపోవచ్చు గానీ.. ఆ సమయంలో సదరు ఫీల్డర్ దృష్టిలో కూడా ఆలోచించడం ముఖ్యం" అని ధోని పేర్కొన్నాడు. చదవండి: Duleep Trophy 2022 Final: డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైశ్వాల్.. -
ధోని ఖతాలో మరో రికార్డు!
భారత క్రికెట్‌కి కొత్త ‘దేవుడు’గా నీరాజనాలందుకుంటున్న మహేంద్ర సింగ్ ధోని మరో ఘనత సాధించాడు. టీమిండియాకు విజయవంతమైన నాయకుడిగా కొనసాగుతున్న ఈ జార్కండ్ ప్లేయర్ సమకాలిన క్రికెట్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. విక్టరీల్లోనే కాదు ఆటలోనూ అద్భుతాలు చేస్తున్నాడు. తాజాగా ధోని మరో రికార్డు కైవసం చేసుకున్నాడు. వికెట్ల వెనకుండి ఈ రికార్డు సాధించడం విశేషం. వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత వికెట్ కీపర్‌గా 'కూల్ కెప్టెన్' రికార్డు సాధించాడు. 300 వికెట్లు(220 క్యాచ్‌లు, 79 స్టంపింగ్‌లు) తీసి అతడీ ఘనత అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో నేపియర్‌లో జరిగిన తొలి వన్డేలో 37వ ఓవర్లో ఈ రికార్డు నెలకొల్పాడు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో రాస్ టేలర్ క్యాచ్ అందుకుని ఈ రికార్డు తన ఖతాలో వేసుకున్నాడు. 32 ఏళ్ల ధోని 239 మ్యాచ్‌ల్లో మొత్తం 301 వికెట్లు కూల్చాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో బ్రెండన్ మెక్కల్లమ్ క్యాచ్ పట్టి 301వ వికెట్ దక్కించుకున్నాడు. తాజా రికార్డుతో దిగ్గజ వికెట్ కీపర్ల సరసన ధోని చేరాడు. అతడు నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్‌క్రిస్ట్ అందరికంటే ముందున్నాడు. గిల్‌క్రిస్ట్ 287 మ్యాచ్‌ల్లో 472 వికెట్లు పడగొట్టాడు. మార్క్ బౌచర్(దక్షిణాఫ్రికా), కుమార సంగక్కర(శ్రీలంక) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బౌచర్ 295 వన్డేల్లో 424 డిస్మిసల్స్ చేశాడు. సంగక్కర 362 మ్యాచ్‌ల్లో 424 వికెట్లు తీశాడు. ధోని ఖాతాలో మరో రికార్డు కూడా చేరింది. న్యూజిలాండ్ జట్టు నుంచి అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత కెప్టెన్‌గా నిలిచాడు. పది క్యాచ్‌లు అందుకుని అతడీ ఘనత సాధించాడు. టేలర్ క్యాచ్ అతడిని కివీస్ టీమ్‌పై 10వది. అంతకుముందు ఈ రికార్డు మహ్మద్ అజహరుద్దీన్ పేరిట ఉంది. టీమిండియాకు అత్యంత విజయమైంతన సారథిగా ధోని ఇప్పటికే ఖ్యాతికెక్కాడు. ఈ కూల్ కెప్టెన్ మరిన్ని రికార్డులు సాధించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. -
కూల్ కెప్టెన్ ధోనీ
విశ్లేషణం పని విషయంలో ధోనీ ప్రొయాక్టివ్‌గా ఉంటాడు. సమస్యలనుంచి తప్పించుకునే ధోరణి చూపకుండా... సానుకూల దక్పథంతో లక్ష్యంవైపు అడుగులు వేస్తాడు. మైదానంలో ఆడేటప్పుడైనా, మైక్ ముందు మాట్లాడేటప్పుడైనా ధోనీ నింపాదిగా ఉంటాడు. ఏం మాట్లాడాలన్నా ఓసారి ఎడమవైపు కిందికి చూసి, ఆ తర్వాత తల పెకైత్తి... ‘యూ నో...’ అంటూ మాట్లాడటం మొదలుపెడతాడు. ఆ మాటల్లోనూ యాక్టివిటీ, ఫీలింగ్స్‌కు సంబంధించిన పదాలే ఎక్కువగా ఉంటాయి. మాట్లాడేప్పుడు కుర్చీలో కుదురుగా కూర్చోకుండా కదులుతూ ఉంటాడు. వీటన్నింటిని బట్టి ధోనీది ప్రాథమికంగా అనుభూతి ప్రధాన (కైనస్థటిక్) వ్యక్తిత్వమని చెప్పవచ్చు. ఆటగాళ్లలో ఈ వ్యక్తిత్వం ఎక్కువగా కనిపిస్తుంది. వారికి తమ శరీరం, కదలికలపై ఎక్కువ అవగాహన, పట్టు ఉంటాయి. అందుకే బంతిని ఎలా కొట్టాలో, ఎంత బలంగా కొడితే ఎక్కడ పడుతుందో ధోనీకి బాగా తెలుసు. ‘ఈ క్షణమే’ విజయ రహస్యం గతంలో జీవించేవారు చేసిన తప్పుల గురించి బాధపడుతూ ఉంటారు. భవిష్యత్తులో జీవించేవారు ఏం చేయాలా, ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వర్తమానంలో జీవించేవారు చేసేపని చక్కగా చేయడంపైనే దష్టి పెడతారు. ధోనీ వర్తమానంలోనే జీవిస్తాడు. చేసిన తప్పుల విశ్లేషణలో కాలం గడపకుండా... అత్యున్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించేక్రమంలో ఆందోళన చెందకుండా... ఆ రోజు తాను ఆడాల్సిన ఆటపైనే, ఇంకా చెప్పాలంటే ఆ క్షణంలో తాను ఎదుర్కొనబోయే బంతిపైనే దృష్టి పెడతాడు. ‘ఈ క్షణంలో జీవించడమే నాకిష్టం’, ‘నేనే పని చేస్తున్నా, బెస్ట్‌గా చేసేందుకు ప్రయత్నిస్తాను’ అని చెప్తాడు... జీవిస్తాడు... అలాగే ఆడతాడు కూడా. అదే అతని విజయరహస్యం. పరిమితుల నుంచి అపరిమితంగా... అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకోవడమే జీవన గమనాన్ని, విజయాలను నిర్దేశిస్తుందన్న ధోనీ ఫిలాసఫీ కూడా అతడి మాటల్లో కనిపిస్తుంది. తనకు మాత్రమే స్వంతమైన హెలికాప్టర్షాట్ అలా పుట్టిందే. తాను క్రికెట్ నేర్చుకునే రోజుల్లో టెన్నిస్బాల్ను బౌండరీలైన్‌ను దాటించడం కోసం బలంగా బాదడంలో భాగంగా ఆ షాట్ నేర్చుకున్నానని ధోనీ చెప్తాడు. పరిమిత వనరులను బలంగా మార్చుకునే లక్షణం అతనికి చిన్నప్పుడే అలవడిందనడానికి ఈ షాటే నిదర్శనం. ధోనీ తన జీవితాన్ని ఆనందిస్తాడు. తాను సాధించిన విజయాలపట్ల గర్విస్తాడు. మరింత మెరుగైన విజయాలకోసం తనవైన రూల్స్ నిర్దేశించుకుంటాడు. ఈ లక్షణాలే అతన్ని విజయవంతమైన ఆటగాడిగా, కెప్టెన్‌గా నిలిపాయి. జస్ట్ కెప్టెన్... 20-20, వన్డే, టెస్ట్‌లలో భారత జట్టును నెంబర్‌వన్‌గా నిలిపిన ధోనీ సక్సెస్ఫుల్ కెప్టెన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఏ ఆటగాడిలో ఏ నైపుణ్యం ఉంటుందో అతను ఇట్టే పసిగట్టేస్తాడు. సరైన సమయంలో బరిలోకి దించుతాడు. పూర్తి సామర్థ్యంతో ఆడేలా వారిని ఉత్తేజపరుస్తాడు. విజయం సాధిస్తాడు. అయితే జట్టు సభ్యులతో అతనికి వ్యక్తిగత సంబంధాలు తక్కువ, స్నేహం అంతంత మాత్రమే. ధోనీ వారిని జట్టు సభ్యులుగానే చూస్తాడు తప్ప, తనవారిగా చూడడు. కావాలంటే అతని మాటలను గమనించండి. ది ప్లేయర్, ది టీమ్ అంటాడే తప్ప.. మై ప్లేయర్, మై టీమ్ అనడు. అందుకేనేమో అతనికి క్రికెటర్లలో స్నేహితులు తక్కువ. ‘పత్రికలు, టీవీలు మేం గెలిస్తే ఆకాశానికెత్తుతాయి, ఓడిపోతే విరుచుకుపడతాయి. అందుకే నేను పత్రికలు, టీవీలు పెద్దగా చదవను, చూడను. కానీ నేను గెలిచినా, ఓడినా నా పెంపుడు కుక్కలు నన్ను అంతే ప్రేమతో పలకరిస్తాయి, అంతే ఆనందంగా ఆడుకుంటాయి. అందుకే వాటితోనే రిలాక్స్ అవుతాను’ అని చెప్పడం ధోనీకి మాత్రమే ప్రత్యేకం! - విశేష్, సైకాలజిస్ట్