13 మంది డిస్మిస్, 45 మందికి ఫైన్ | narendra modi government dismissed 13 officers, penalized 45 for inefficiency | Sakshi
Sakshi News home page

13 మంది డిస్మిస్, 45 మందికి ఫైన్

Published Thu, Dec 17 2015 10:32 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

13 మంది డిస్మిస్, 45 మందికి ఫైన్ - Sakshi

13 మంది డిస్మిస్, 45 మందికి ఫైన్

న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 13 మంది అధికారులను డిస్మిస్ చేసింది. 45 మంది అధికారుల పింఛన్ కట్ చేసింది. విధుల నిర్వహణ, ప్రజాసేవలో వాళ్ల పనితీరు అసంతృప్తికరంగా ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో తెలిపారు. కొందరు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా గడిచిన ఏడాదిన్నర కాలంలో ఈ చర్యలు తీసుకున్నామన్నారు.
 

అసమర్థులైన అధికారులను తప్పించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని, అధికార యంత్రాంగాన్ని సమర్థంగా, బాధ్యతాయుతంగా చేసేందుకు ప్రభుత్వం ఇటీవలే అన్ని శాఖలకు ఉద్యోగుల పనితీరుపై సమీక్షలు జరపాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చిందని మంత్రి తెలిపారు. 50/55 ఏళ్ల వయసు లేదా 30 ఏళ్ల సర్వీసు పూర్తవడానికి ముందు కనీసం ఆరుసార్లు ప్రతి ఉద్యోగికి ఈ సమీక్ష జరగాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. దాన్నిబట్టి వాళ్లను ఉద్యోగంలో ఉంచాలా లేదా రిటైర్మెంట్ ఇప్పించాలా అన్నది నిర్ణయిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement