న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు కేసు విచారిస్తున్న రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. సిసోడియాకు బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ,ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టులో వాదనలు వినిపించాయి.
దీంతో కోర్టు సిసోడియాకు బెయిల్ నిరాకరించింది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాను సీబీఐ గతేడాది ఫిబ్రవరి26న అరెస్టు చేసింది. అప్పటి నుంచి సిసోడియా జైలులోనే ఉంటున్నారు.
సీబీఐతో పాటు ఈడీ పెట్టిన కేసుల్లో సిసోడియా రెగ్యులర్ బెయిల్ కోర్టు డిస్మిస్ చేయడం ఇది రెండవసారి. గతేడాది సిసోడియా వేసిన బెయిల్ పిటిషన్లను ట్రయల్‌కోర్టుతో పాటు హైకోర్టు,సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment