
ఎంఎస్ ధోని
కేప్‌టౌన్ : టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 400 ఔట్లలో భాగస్వామి అయిన వికెట్ కీపర్‌గా గుర్తింపు పొందాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 16 ఓవర్ రెండో బంతికి దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్‌రమ్‌ను స్టంప్ అవుట్ చేసి ఈ ఘనతను అందుకున్నాడు. ఈ వికెట్లలో 294 క్యాచ్‌లుండగా 106 స్టంప్ అవుట్‌లున్నాయి. గత సెంచూరియన్ వన్డేలో భువనేశ్వర్ బౌలింగ్‌లో హషీమ్ ఆమ్లాను క్యాచ్ అవుట్ చేసి కీపర్‌గా 399వ వికెట్ సాధించాడు. తాజా స్టంపౌట్‌తో 400పైగా ఔట్లలో భాగస్వామి అయిన నాలుగో వికెట్ కీపర్‌గా ధోని రికార్డుకెక్కాడు.
ఇప్పటికే వికెట్ కీపర్‌గా అత్యధిక వికెట్ల తీసిన జాబితాలో ధోని నాలుగు స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో సంగక్కర (482) ఉండగా.. గిల్‌క్రిస్ట్(472), బౌచర్(424)లు ధోని కన్నా ముందు స్థానంలో ఉన్నారు. ఇక అత్యధిక స్టంపౌట్ల రికార్టు ధోని పేరిటనే ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment