- బీసీ సంఘాల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: బర్తరఫ్ అయిన డిప్యూటీ సీఎం రాజయ్యను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవాలని తెలంగాణ బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ విధంగా బర్తరఫ్ చేసుకుంటూ పోతే ఇదే చివరిపాలన అవుతుందని జాజుల శ్రీనివాస్‌గౌడ్ (బీసీ సంక్షేమ సంఘం), మల్లేష్ యాదవ్ (బీసీ ఫ్రంట్), గుజ్జ కృష్ణ (బీసీ ప్రజాసమితి), దుర్గమ్మ (బీసీ సమాఖ్య) సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు వారినే బలిపశువులను చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యల ద్వారా అణగారిన వర్గాలను ప్రభుత్వం అవమానిస్తోందని మండిపడ్డారు. బడుగులను బలి చేయడాన్ని బట్టి మళ్లీ నిజాం పాలన తీసుకు వస్తారేమోనని ఎద్దేవా చేశారు.