ఢిల్లీ: భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు మంజూరైన బెయిల్‌ను సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై సోమవారం విచారణ జరిపిన సుప్రీకోర్టు ఈడీ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
ఈ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైందనేనని సుప్రీంకోర్టు సమర్థించింది. ఇక.. హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పులో తాము జోక్యం చేసుకోబోమని జస్టిస్‌లు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. జూన్ 28 హైకోర్టు సోరెన్‌కు బెయిల్ మంజూరు చేసింది. భూకుంభకోణంలో హేమంత్ సోరెన్ ప్రమేయం ఉన్నట్లు రికార్డులు సూచించటం లేదని జార్ఖండ్ హైకోర్టు పేర్కొంది. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమని ఈడీ తన పిటిషన్‌లో పేర్కొంది. సోరెన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment