సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏపీ హైకోర్టు ఎత్తేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టుపై దాఖలైన అన్ని పిటిషన్లు కోర్టు కొట్టివేసింది.
ఎయిర్‌పోర్టు నోటిఫికేషన్ చెల్లదంటూ గతంలో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం పలువురు రైతులు కేసు ఉపసంహరించుకున్నారు. ఇప్పటికే రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది. మిగిలిన రైతుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ఇప్పటికే జీఎంఆర్‌తో ఒప్పందం కుదిరింది. హైకోర్టు తీర్పుతో పనుల ప్రారంభానికి అడ్డంకులు తొలగాయి. నిర్మాణంపై గతంలో వేసిన స్టేను కూడా హైకోర్టు ఎత్తేసేంది.
చదవండి: అసాగో బయోఇథనాల్ ప్లాంట్‌కు సీఎం జగన్ భూమి పూజ
Comments
Please login to add a commentAdd a comment