సమ్మె విరమణ విషయంలో ప్రభుత్వం మాటను లెక్కచేయలేదన్న కారణంతో విధుల నుంచి డిస్మిస్ అయిన జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు న్యాయపోరాటానిక దిగారు.
హైదరాబాద్: సమ్మె విరమణ విషయంలో ప్రభుత్వం మాటను లెక్కచేయలేదన్న కారణంతో విధుల నుంచి డిస్మిస్ అయిన జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు న్యాయపోరాటానిక దిగారు. తమను తిరిగి విధుల్లోకి చేర్చునేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో తొలిగింపునకు గురైన కార్మికులు శుక్రవారం మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు.
న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేపట్టిన తమపై కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కక్షగట్టిందని, కొందరిని మాత్రమే విధుల నుంచి తొలిగించడం అన్యాయమని కార్మికులు ఆరోపించారు. తమను వెంటనే విధుల్లోకి చేర్చుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హెచ్చార్సీని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేత సుధాభాస్కర్ కూడా పాల్గొన్నారు.