పట్నా: ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కాంలో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు చుక్కెదురయ్యేలా ఉంది. ఇప్పటికే ఈ కేసులో తేజస్వీతో పాటు ఆయన తల్లిదండ్రులపై కూడా సీబీఐ ఛార్జ్‌షీటు నమోదు చేసింది. దీంతో తేజస్వీ యాదవ్‌ను క్యాబినెట్ నుంచి తప్పించాలని బీజేపీ సీనియర్ నాయకుడు సుషీల్ మోదీ డిమాండ్ చేశారు.
'బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పాలనలో అవినీతికి స్థానం లేదని చెబుతాడు. మరి ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌పై అవినీతి కేసు నమోదైంది. ఎలాంటి ఆలస్యం చేయకుండా తేజస్విని క్యాబినెట్ నుంచి తప్పించాలి' అని సుశీల్ మోదీ డిమాండ్ చేశారు.
లాలూ ప్రసాద్ యాదవ్ 2004-2009 మధ్య కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో వెస్టర్న్ సెంట్రల్ జోన్‌లో గ్రూప్ డీ పోస్టుల భర్తీలో అవనీతికి పాల్పడ్డారని లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన భార్య రబ్రీ దేవీ కుమారుడు తేజస్వీ యాదవ్‌లపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సీబీఐ కేసు నమోదు చేసింది. వీరితో పాటు మరో 14 మందిపై ఛార్జ్‌షీటు కూడా నమోదు చేసింది.
ఇదీ చదవండి: ఇక బిహార్ వంతు...? మహారాష్ట్ర తరహాలో ఆపరేషన్ కమలం!
Comments
Please login to add a commentAdd a comment