Sushil Modi
-
సుశీల్ మోదీ మృతి: కాంగ్రెస్ నేతల సంతాపం
పాట్నా: బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. వీరితో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా సంతాపం తెలిపారు.''బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు సుశీల్ మోదీ జీ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మన సిద్ధాంతాలు వేరు, కానీ ప్రజాస్వామ్యంలో దేశ ప్రయోజనాలే ప్రధానం. జీఎస్టీ కౌన్సిల్లో ఆయన గణనీయమైన కృషి చేశారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను'' అంటూ మల్లికార్జున్ ఖర్గే తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.बिहार के पूर्व उपमुख्यमंत्री व वरिष्ठ नेता, श्री सुशील मोदी जी के निधन पर उनके परिवारजनों व समर्थकों के प्रति गहरी संवेदनाएँ। हमारी विचारधारा अलग थी, पर लोकतंत्र में देश हित सर्वोपरि होता है। उन्होंने GST कॉउंसिल में अपना महत्वपूर्ण योगदान दिया था। ईश्वर दिवंगत आत्मा को शांति…— Mallikarjun Kharge (@kharge) May 14, 2024కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేస్తూ.. ఈ రోజు తెల్లవారుజామున బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, మాజీ రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ మరణం గురించి చదివాను. అతను, నేను పూర్తిగా వ్యతిరేఖ రాజకీయాలకు చెందినవారము. ఐడియాలజీలు మాత్రం ఒకేలా దేఅభివృద్దే ప్రధానంగా ఉండేది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొంతకాలం బీహార్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆ తరువాత రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన నాతో కొద్ది రోజులు గడిపారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ఆయనకు చాలా అవగాహన ఉందని పేర్కొన్నారు.Early this morning, I read about the sad demise of Sushil Modi, the former Deputy CM of Bihar, a former Rajya Sabha MP, and a distinguished product of the JP Movement in Bihar during the mid-70s He and I belonged to diametrically opposed political ideologies, but that had not…— Jairam Ramesh (@Jairam_Ramesh) May 14, 2024 -
సుశీల్ మోదీ లవ్ స్టోరీ.. రైలులో మొదలై..
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన సుశీల్ మోదీ జీవితంలో అనేక మరపురాని ఘట్టాలు ఉన్నాయి. వాటిలో ఒకటే ఆయన లవ్ స్టోరీ. తొలి చూపులోనే జెస్సీతో ప్రేమలో పడిన ఆయన దానిని పెళ్లి వరకూ ఎలా తీసుకువెళ్లారంటే..సుశీల్ మోదీ, జెస్సీ జార్జ్ల ప్రేమ కథ సినిమాను తలపిస్తుంది. రైలు ప్రయాణంలో తొలిసారిగా సుశీల్ మోదీ, జెస్సీ జార్జ్ ఒకరినొకరు చూసుకున్నారు. తరువాత మాట్లాడుకున్నారు. తరువాతి కాలంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది. కలిసి జీవించాలనుకుని ప్రమాణం చేసుకున్నారు. అయితే వారుంటున్న పరిస్థితుల్లో వారికి సంప్రదాయాల అడ్డుగోడ దాటడం చాలా కష్టంగా మారింది.ఆ సమయంలో సుశీల్ మోదీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో సభ్యునిగా ఉండేవారు. అయితే జెస్సీ జార్జ్ రాజకీయాలకు దూరంగా మెలిగేవారు. ఆమె కేరళలోని ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగారు. దీంతో విరిద్దరి మధ్య భాషతో పాటు మతపరమైన అడ్డంకి కూడా ఉంది. అయినా సుశీల్ మోదీ జెస్సీ జార్జ్ల ప్రేమ కథ విజయవంతంగా ముందుకు సాగింది.40 ఏళ్ల క్రితం నాటి వీరి ప్రేమ కథ గురించి సుశీల్ మోదీ స్నేహితుడు సరయూ రాయ్ ఒకప్పుడు మీడియాకు తెలిపారు. విద్యార్థి పరిషత్ పనుల మీద సుశీల్ తరచూ రైలు ప్రయాణాలు చేసేవారు. ఆ సమయంలో ఆయన జెస్సీని రైలులో కలుసుకున్నారు. తరువాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి ప్రేమ గురించి ఇరు కుటుంబాల సభ్యులకు తెలియగానే వారు కోపంతో రగిలిపోయారు. అయితే ఆ జంట తమ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు శతవిధాలా ప్రయత్నించారు.చివరికి పెద్దలు ఒప్పుకోవడంతో సుశీల్ మోదీ, జెస్సీలు 1987లో వివాహం చేసుకున్నారు. నాడు బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి వారి వివాహానికి హాజరయ్యారు. ఇది జరిగిన మూడేళ్ల తర్వాత 1990లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నాటి ఎన్నికల్లో సుశీల్ మోదీ గెలుపొందారు. సుశీల్ మోదీ రాజకీయాల్లో కొనసాగగా, జెస్సీ జార్జ్ మోదీ లెక్చరర్‌గా పనిచేశారు. -
ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం: తేజస్వీ యాదవ్‌ని క్యాబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్..
పట్నా: ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కాంలో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు చుక్కెదురయ్యేలా ఉంది. ఇప్పటికే ఈ కేసులో తేజస్వీతో పాటు ఆయన తల్లిదండ్రులపై కూడా సీబీఐ ఛార్జ్‌షీటు నమోదు చేసింది. దీంతో తేజస్వీ యాదవ్‌ను క్యాబినెట్ నుంచి తప్పించాలని బీజేపీ సీనియర్ నాయకుడు సుషీల్ మోదీ డిమాండ్ చేశారు. 'బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పాలనలో అవినీతికి స్థానం లేదని చెబుతాడు. మరి ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌పై అవినీతి కేసు నమోదైంది. ఎలాంటి ఆలస్యం చేయకుండా తేజస్విని క్యాబినెట్ నుంచి తప్పించాలి' అని సుశీల్ మోదీ డిమాండ్ చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ 2004-2009 మధ్య కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో వెస్టర్న్ సెంట్రల్ జోన్లో గ్రూప్ డీ పోస్టుల భర్తీలో అవనీతికి పాల్పడ్డారని లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన భార్య రబ్రీ దేవీ కుమారుడు తేజస్వీ యాదవ్‌లపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సీబీఐ కేసు నమోదు చేసింది. వీరితో పాటు మరో 14 మందిపై ఛార్జ్‌షీటు కూడా నమోదు చేసింది. ఇదీ చదవండి: ఇక బిహార్ వంతు...? మహారాష్ట్ర తరహాలో ఆపరేషన్ కమలం! -
వెనకబడ్డ తరగతుల జడ్జిలు... హైకోర్టుల్లో 15 శాతమే
న్యూఢిల్లీ: దేశంలో గత ఐదేళ్లలో హైకోర్టుల్లో నియమితులైన న్యాయమూర్తుల్లో వెనుకబడిన తరగతులకు చెందినవారు కేవలం 15 శాతం మందే ఉన్నారని డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ వెల్లడించింది. బీజేపీ సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీని నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఈ విషయాన్ని నివేదించింది. జడ్జిలను నియమించే అధికారాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని కొలీజియంకు కట్టబెట్టి 3 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ హైకోర్టుల్లో బీసీ జడ్జిల సంఖ్య పెరగడం లేదని స్పష్టంచేసింది. జడ్జిలుగా ఎవరిని నియమించాలన్నది కొలీజియమే తేలుస్తుందని గుర్తుచేసింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను మాత్రమే ప్రభుత్వం ఆమోదించగలదని వెల్లడించింది. న్యాయస్థానాల్లో సామాజిక వైవిధ్యాన్ని ఇంకా సాధించలేకపోయామని డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్‌అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయమూర్తుల నియామకం విషయంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలతోపాటు మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తరచుగా కొలీజియంను కోరుతూనే ఉందని వివరించింది. 2018 నుంచి 2022 డిసెంబర్ 19 వరకూ హైకోర్టుల్లో 537 మందిని జడ్జిలుగా నియమించగా, వీరిలో 1.3 శాతం మంది ఎస్టీలు, 2.8 శాతం మంది ఎస్సీలు, 11 శాతం మంది ఓబీసీలు, 2.6 శాతం మైనారిటీలు ఉన్నారని తెలియజేసింది. -
నితీశ్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకీ ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు
ఇంఫాల్: మణిపూర్‌లో మొత్తం ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేల్లో ఐదుగురు బీజేపీలో విలీనమయ్యారు. స్పీకర్ ఆమోదంతో శుక్రవారం అధికారికంగా ఈ ప్రక్రియ పూర్తయింది. ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న వారాల వ్యవధిలోనే ఈ పరిణామం జరగడం బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు షాకే అని చెప్పాలి. ఎమ్మెల్యేల చేరిక అనంతరం బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ.. నితీశ్‌పై విమర్శలు గుప్పించారు. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లు జేడీయూ ముక్త్ రాష్ట్రాలుగా అవతరించాయని పేర్కొన్నారు. బిహార్ రాజధాని పాట్నాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందే ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరడం గమనార్హం. నితీశ్ కుమార్‌కు బీజేపీకి షాక్ ఇవ్వడం తొమ్మిదో రోజుల్లో ఇది రెండోసారి. ఆగస్టు 25న అరుణాచల్ ప్రదేశ్‌లోని ఏకైక జేడీయూ ఎమ్మెల్యే ఆ పార్టీని వీడి కమలం గూటికి వెళ్లారు. జేపీ నడ్డా సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. రెండు రాష్ట్రాల్లో జేడీయూకు ఉనికి కోల్పేయే పరిస్థితి రావడం నిజంగా నితీశ్‌కు దెబ్బెే అని విశ్లేషకులు అంటున్నారు. 2019 ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో జేడీయూ 7 స్థానాల్లో గెలిచింది. అయితే ఆ తర్వాత ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లారు. మిగిలిన ఏకైక ఎమ్మెల్యే కూడా ఆగస్టు 25న బీజేపీ గూటికి చేరారు. దీంతో రాష్ట్రంలో జేడీయూ ఖాళీ అయింది. చదవండి: ఆప్‌కు అధికారమిస్తే.. గుజరాతీలకు బంపరాఫర్ -
కేసీఆర్‌కు ఘోర అవమానం.. ఇందుకేనా బిహార్ వెళ్లింది?: బీజేపీ
పట్నా: బిహార్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ లేచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. కేసీఆర్ పలుమార్లు కూర్చొమని చెప్పినా ఆయన అసలు పట్టించుకోలేదు. చివరకు కేసీఆర్ నితీశ్ కుమార్ చేయి పట్టుకుని కూర్చోమని విజ్ఞప్తి చేసిన తర్వాత ఆయన బలవంతంగా కుర్చీలో కూర్చున్నారు. బుధవారం పాట్నాలో కేసీఆర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నప్పుడు జాతీయ రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. విపక్షాల ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్ పేరును మీరు ప్రతిపాదిస్తారా? అని ఓ విలేకరి కేసీఆర్‌ను అడిగారు. ఇందుకు ఆయన బదులిస్తూ.. నితీశ్ కుమార్ పేరు ప్రతిపాదించడానికి నేను ఎవర్ని? నేను చెప్తే ఎవరూ వ్యతిరేకించరా? అందరం కలిసి దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అప్పుడే తొందర ఎందుకు? అని బదులిచ్చారు. ఈ సమయంలోనే నితీశ్ వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. ఇలా అవమానానికి గురయ్యేందుకేనా తెలంగాణ నుంచి బిహార్ వెళ్లింది అని? సెటైర్లు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతుంటే కనీస మర్యాద లేకుండా నితీశ్ కుమార్ వెళ్లిపోయారు అని పేర్కొన్నారు. Did KCR travel to Patna to get insulted like this? Nitish Kumar didn’t even accord him the basic courtesy of completing his point in a press interaction. Nitish was dismissive of KCR’s pleas to let him finish. But then that is Nitish Kumar. Self conceited. KCR asked for it… pic.twitter.com/k9BQPo6FCI— Amit Malviya (@amitmalviya) August 31, 2022 మరో బీజేపీ నేత సుశీల్ మోదీ కూడా ఈ ఘటనపై స్పందించారు. విపక్షాల అభ్యర్థిగా తన పేరును ప్రకటిస్తారనే ఆశతోనే కేసీఆర్‌ను నితీశ్ బిహార్‌కు ఆహ్వానించారని, కానీ అలా జరగకపోయేసరికి మీడియా సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయారని విమర్శలు గుప్పించారు. చదవండి: కొన్ని పార్టీల తీరు దారుణం.. ఇదో కొత్త రకం రాజకీయ ఏకీకరణ -
భారత్‌లో గూగుల్, ఫేస్బుక్ ఆదాయం ఎంతో తెలుసా?
Google Facebook Income In India: సంప్రదాయ మీడియా సంస్థల్లో వచ్చే వార్తలను హోస్ట్ చేయడం ద్వారా ఫేస్బుక్, గూగుల్ వంటి దిగ్గజ టెక్ సంస్థలకు వస్తున్న ఆదాయం ఎంతో తెలుసా? ఈ మేరకు పార్లమెంట్ సాక్షిగా సమాధానం దొరికింది. ‘భారత్‌లో డిజిటల్ ప్రకటనల విపణిలో 75 శాతం వాటాను గూగుల్, ఫేస్బుక్ హస్తగతం చేసుకున్నాయి. ఏడాదికి గూగుల్ ఏకంగా రూ.13,887 కోట్లు, ఫేస్బుక్ రూ.9,326 కోట్లు పొందుతున్నాయి. అంటే మొత్తంగా రూ.23,313 కోట్లు. ఇది దేశంలోని టాప్–10 సంప్రదాయక మీడియా సంస్థల మొత్తం ఆదాయం(కేవలం రూ.8,396 కోట్లు) కంటే చాలా ఎక్కువ’ అని బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోదీ వివరించారు. ఈ మేరకు పలు కీలక అంశాలను మంగళవారం రాజ్యసభలో జీరో అవర్‌లో సుశీల్ మోదీ ప్రస్తావించారు. ఇక్కడ మూటకట్టిన ఆదాయంలో 90శాతం మొత్తాలను తన అంతర్జాతీయ అనుబంధ సంస్థకు ఫేస్బుక్ పంపుతోందని, గూగుల్ ఇండియా తన 87 శాతం రాబడిని మాతృసంస్థకు బదలాయిస్తోందని సుశీల్ వెల్లడించారు. కొంత భాగం.. సంప్రదాయక మీడియాకూ దక్కాలని బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోదీ అభిప్రాయపడ్డారు. సంప్రదాయ మీడియా కంటెంట్ మూలంగా ప్రకటనల ద్వారా వేలకోట్ల ఆదాయం పొందుతున్న టెక్ సంస్థలపై, ఈ వ్యవస్థపై పర్యవేక్షణకు కొత్తగా స్వతంత్య్ర నియంత్రణ మండలిని నెలకొల్పాలని ఆయన సూచించారు. చదవండి: దిగ్గజ టెక్ కంపెనీలను వణికిస్తున్న "లాగ్4జే" లోపం -
రాజ్యసభ ఉప ఎన్నికకు సుశీల్ మోదీ నామినేషన్
పాట్నా: పాట్నాలో రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. లోక్ జనశక్తి పార్టీ నేత, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తరువాత ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రిని బీజేపీ ఎంపిక చేసింది. కాగా ‘సుశీల్ మోదీకి మా పూర్తి మద్దతు’ ఉంటుందని బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ స్పష్టం చేశారు. డిసెంబర్ 14న ఉప ఎన్నిక జరుగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరోవైపు ఆర్జేడీ సారథ్యంలోని మహాఘట్ బంధన్ కూడా పోటీ చేయనుంది. చదవండి(చిరాగ్‌కు మద్దతు ప్రకటించిన తేజస్వీ). -
లాలూ ఆడియో క్లిప్ కలకలం
పట్నా: ఎన్డీఏకు చెందిన ఎంఎల్ఏలను ఆకర్షించేందుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ యత్నిస్తున్నారని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ చేసిన ఆరోపణలు బిహార్‌లో సంచలనం సృష్టించాయి. నితీశ్ కుమార్ నూతన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా లాలూ ఎంఎల్ఏలను ప్రలోభపరుస్తున్నారని చెబుతూ సుశీల్ ఒక ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ ఆడియోలో లాలూ ప్రసాద్ యాదవ్ పిర్పైంటి ఎంఎల్ఏ లలన్ కుమార్‌తో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ‘‘నిన్ను బాగా చూసుకుంటాం. స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోయేందుకు సాయం చెయ్యి’’ అని లాలూ అంటున్నట్లు ఆడియోలో ఉంది. ఇందుకు ఎంఎల్ఏ బదులిస్తూ ఇందుకు చాలా ఇబ్బందులుంటాయని చెప్పగా, భయపడవద్దని, ఆర్జేడీ స్పీకర్ వస్తారని, ఇందుకుగాను తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రి పదవి ఇస్తామని లాలూ చెబుతున్నట్లుంది. సుశీల్‌తో తాను ఉన్నప్పుడే లాలూ కాల్ చేశారని సదరు ఎంఎల్ఏ చెప్పారు. ప్రస్తుతం లాలూ పశుగ్రాసం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని బిహార్ డిప్యుటీ సీఎం తార్ కిశోర్ ప్రసాద్ చెప్పారు. ఈ ఆడియోక్లిప్‌పై ఆర్జేడీ ఏమీ వ్యాఖ్యానించలేదు. కానీ ఆ పార్టీ ఎంఎల్ఏ ముకేశ్ రోషన్ మాత్రం మార్చికల్లా నితీశ్ ప్రభుత్వం పడిపోయి, తేజస్వీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. మరోవైపు బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్డీఏకి చెందిన విజయ్ సిన్హా ఎన్నికయ్యారు. -
బిహార్‌లో లాలూ ఆడియో టేపుల కలకలం
పట్నా : బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ ఆడియో టేపులు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలకు ఆర్జేడీ చీఫ్ లాలూ చేసిన ఫోన్ కాల్స్‌ను బీజేపీ బయటపెట్టింది. రాంచీ జైలు నుంచే బీజేపీ ఎమ్మెల్యేలకు 8051216302 నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ చేస్తున్నారంటూ బీజేపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ ఆరోపించారు. జైలులో ఉంటూ ఇలాంటి మురికి రాజకీయాలు చేయవద్దని సుశీల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో స్పీకర్ ఎన్నికల నేపథ్యంలో లాలూ ఫోన్ కాల్స్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. ఇందులో ఆర్జేడీకి మద్దతు ఇవ్వాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలతో లాలూ సంప్రదింపులు జరిపారు. ఓటింగ్‌కు దూరంగా ఉంటే మంత్రి పదవి ఇస్తానంటూ లాలూ ఆఫర్ చేసిన ఆడియో క్లిప్‌లు బయటకువచ్చాయి. (నితీష్ కుమార్‌కు ఆర్జేడీ ఆఫర్ ) బీజేపీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ..'స్పీకర్ ఎన్నికలకు హాజరు కావద్దు. కరోనా వచ్చిందని చెప్పండి. మీరు మాకు మద్దతు ఇస్తే మా నాయకుడు స్పీకర్ అవుతారు. అప్పుడు మీకు కావల్సిన పనులు జరిగిపోతాయి' అంటూ లాలూ ఆఫర్ చేశారు. పశుగ్రాసం అవినీతి కేసుల్లో అరెస్టు అయిన లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ జైలులో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యలతో శిక్షాకాలంలో ఎక్కువ సమయం ఆసుపత్రిలోనే గడిపారు. ఈనెల ప్రారంభంలో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 75 స్థానాలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. బీజేపీ 74, జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే కూటమిలో బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చినప్పటికీ సీఎం పీఠం మాత్రం జేడీయూకి అప్పగించింది. (బాధ్యతలు చేపట్టిన కాసేపటికే రాజీనామా) Lalu Yadav making telephone call (8051216302) from Ranchi to NDA MLAs & promising ministerial berths. When I telephoned, Lalu directly picked up.I said don’t do these dirty tricks from jail, you will not succeed. @News18Bihar @ABPNews @ANI @ZeeBiharNews — Sushil Kumar Modi (@SushilModi) November 24, 202 -
సుశాంత్ సూసైడ్: సీఎం వ్యాఖ్యలు కలకలం
పట్నా : బాలీవుడ్ యంగ్‌హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఉదంతం రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. ఈ కేసు విషయంపై మహారాష్ట్ర, బిహార్ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సుశాంత్ ఆత్మహత్యపై ఇటు మహారాష్ట్రలోను, అటు బిహార్‌లోనూ కేసులు నమోదుకావడంతో ఇరు రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విచారణ నిమిత్తం బిహార్ పోలీసులు ముంబైకి రావడం, అక్కడ ముంబై పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కిపంపించడం వివాదానికి దారితీసింది. మరోవైపు సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ప్రతిపక్ష బీజేపీ విమర్శించడంతో రాజ్‌పుత్ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ నేపథ్యంలో బిహార్ ఉపముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశిల్ మోదీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. (సుశాంత్ సూసైడ్ మిస్టరీలో మనీలాండరింగ్ కేసు) సుశాంత్ ఆత్మహత్య కేసులో నిజాలు బయటపడకుండా బాలీవుడ్ మాఫీయా అడ్డుపడుతోందని, చిత్రపరిశ్రమలోని కొందరి ఒత్తడికి ఉద్ధవ్ ఠాక్రే తలొంచారని ఆరోపించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్ దోషులను కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాజా కేసును విచారించే శక్తీ, సామర్థ్యాలు బిహార్ పోలీసులకు ఉన్నాయని, వారి విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని, కానీ ముంబై పోలీసుల నుంచి సరైన సహకారం లేదని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం రాత్రి ఓ మీడియాతో మాట్లాడిన సుశిల్ మోదీ.. మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సుశాంత్ కేసును సీబీఐకి చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. (సుశాంత్ ఆత్మహత్య కేసులో తాజా ట్విస్ట్) ఇదిలావుండగా.. బిహార్, బీజేపీ నేతల తీరుపై సీఎం ఠాక్రే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తును నిర్వహించడంలో ముంబై పోలీసుల సామర్థ్యాన్ని ప్రశ్నించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. ముంబై పోలీసుల విశ్వసనీయత దెబ్బతీస్తున్న బీజేపీ నేతల తీరు సరైనది కాదని మండిపడ్డారు. కేసును విచారించి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని ఠాక్రే స్పష్టం చేశారు. ఈ కేసును మహారాష్ట్ర వర్సెస్ బిహార్ సమస్యగా చూడద్దొని అన్నారు. జూన్ 14న సబర్బన్ బాంద్రాలోని తన అపార్ట్మెంట్లో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు రాజ్‌పుత్ కుటుంబం, అతని కుక్‌తో సహా సుమారు 40 మంది వాంగ్మూలాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
'రేపిస్టులను రక్షించండి, అత్యాచారాలను పెంచండి'
పాట్నా: ఐదేళ్ల మైనర్ బాలికను దర్భాంగాలో ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటనపై బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ మీడియా ముందు మాట్లాడకుండా దాటవేయడాన్ని ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవీ విమర్శించారు. దర్భాంగా అత్యాచార ఘటనపై బిహార్ ఉప ముఖ్యమంత్రి స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం మహిళల భద్రతపై నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వానికి ఆమె చురకలంటించారు. ట్విటర్ వేదికగా రబ్రీ దేవీ.. 'రేపిస్టులను రక్షించండి, అత్యాచారాలను పెంచండి' అనే రీతిలో నితీష్ కుమార్ ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. సిగ్గు లేని, పనికి మాలిన ప్రభుత్వం బిహార్‌లో రాజ్యమేలుతోందని విమర్శించారు. అనవసరపు విషయాల్లో తలదూర్చి.. ఏదైనా సమస్య తలెత్తగానే పారిపోయే బలహీన, పిరికి ఉప ముఖ్యమంత్రికి.. దర్భాంగా ఘటనతో మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలీట్లేదని ఎద్దేవా చేశారు. “ये रेपिस्ट बचाओ, रेप बढ़ाओ “वाली नीतीश सरकार है। बेशर्म, नाकारा और धिक्कार। हर मोर्चे पर मैदान छोड़ कर भागने वाला कमजोर असहाय डरपोक उप(चुप)मुख्यमंत्री.. हर वक़्त बात-बेबात बड़बड़ाने वाले के मुँह में शर्म घुस गया। https://t.co/AsDQjO0Loj — Rabri Devi (@RabriDeviRJD) December 7, 2019 వివరాల్లోకి వెళితే.. 5 సంవత్సరాల మైనర్ బాలిక ఆరుబయట ఆడుకుంటుండగా.. ఆమెను అపహరించి అత్యాచారం చేసిన ఘటన సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. దుండగుబు ఆమెను తోటలో తీసుకెళ్లి.. లైంగిక దాడి చేసి అక్కడే వదిలేశాడు. అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు ఆటో డ్రైవర్‌గా గుర్తించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పోలీసులు విచారణ చేపడుతున్నారు. #WATCH Patna: Bihar Deputy Chief Minister Sushil Modi evades question on Darbhanga minor rape case. pic.twitter.com/Yvjlgxbn6K — ANI (@ANI) December 7, 2019 కాగా దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ను స్వాగతిస్తున్నామని రబ్రీ దేవీ పేర్కొన్నారు. దిశ కేసులో హైదరాబాద్‌లో జరిగిన ఎన్కౌంటర్ నేరస్థులను కొంతమేర కట్టడి చేస్తుందని అన్నారు. బిహార్‌లో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. -
డిప్యూటీ సీఎం కుటుంబాన్ని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్
పట్నా : బిహార్‌ను భారీ వర్షాలు అతలకుతలం చేస్తున్నాయి. రాజధాని పట్నాలో వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లోకి నీరు చేరడంతో రోడ్లన్నీ చెరవులను తలపిస్తున్నాయి. అయితే ఈ వరదల్లో సామాన్య ప్రజలే కాదు... రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ కూడా చిక్కుకున్నారు. పట్నాలోని ఆయన నివాసం ఉన్న రాజేంద్ర నగర్ ప్రాంతంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మూడు రోజులుగా మోదీతో పాటు ఆయన కుటుంబసభ్యులు అక్కడే ఉండిపోయారు. దీంతో సోమవారం రోజున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోదీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతానికి చేర్చారు. దీంతో మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. అయితే మోదీ మాత్రం మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. మరోవైపు పట్నాలో జనజీవనం స్తంభించింది. బిహార్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు కేంద్రం రెండు హెలికాప్టర్లను బిహార్‌కు పంపించింది. బిహార్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు అక్టోబర్ 1 వరకు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. -
బిహార్‌లో ఎన్డీఏ కెప్టెన్ నితీష్..?!
పాట్న: బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌పై డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌కుమార్ ఎన్డీఏ కూటమికి కెప్టెన్‌గా మారి నాయకత్వం వహిస్తారని, అందులో భాగంగా ఫోర్, సిక్స్‌లు బాదుతూ.. ప్రత్యర్థుల ఇన్నింగ్స్‌ను ఓడిస్తారని’ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా బిహార్ రాజకీయాలు వేడెక్కాయి. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ స్పందించి.. ‘రాష్ట్ర అభివృద్ధి కోసం నితీష్ కుమార్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయంపై ఎటువంటి వివాదం లేదన్నారు. ప్రజల, వ్యక్తిగత అభిప్రాయాలను ప్రచారం చేయడం పార్టీ వైఖరికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుందని’ అన్నారు. ఇటీవల బిహార్ శాసన మండలి సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి సంజయ్ పాస్వాన్ ‘ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాలకు రాష్ట్ర ప్రజలు మద్దతు ఇస్తున్నందున నితీష్ కుమార్ కేంద్ర రాజకీయాలపై దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశీల్ మోదీ నితీష్‌పై చేసిన వ్యాఖ్యలను ట్విటర్లో తొలగించనట్లు సమాచారం. -
‘గతాన్ని మర్చిపోండి.. సహకరించండి’
పట్నా : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అయోధ్య రామమందిర నిర్మాణం మరోసారి చర్చనీయాంశమైంది. అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదాస్పద ప్రాంతంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదంటూ, ఈ కేసును వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై స్పందించిన బిహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్ మోదీ మాట్లాడుతూ...‘ కర్ణాటక ఎన్నికల అంశం, అర్బన్ నక్సల్స్ కేసులను రాత్రికి రాత్రి తేల్చేసేందుకు సుప్రీం ధర్మాసనానికి సమయం ఉంటుంది కానీ అయోధ్య అంశాన్ని విచారించేందుకు సమయం ఉండదు. ప్రాథమ్యాల ప్రకారమే కేసుల విచారణ ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. అంటే ఈ కేసును వారు ఎలా పరిగణిస్తున్నారో అర్థం కావడం లేదు’ అంటూ వ్యాఖ్యానించారు. పట్నాలో జరిగిన పార్టీ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సుశీల్ మోదీ.. అయోధ్య రామమందిర నిర్మాణం త్వరగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ‘మసీదు ఎక్కడైనా కట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ రామ మందిరం రామ జన్మస్థానమైన అయోధ్యలోనే నిర్మించాలి కదా. అందుకే గతాన్ని మర్చిపోయి. మాతో సహకరించండి’ అంటూ ఆయన ముస్లింలకు విఙ్ఞప్తి చేశారు. -
భారీ కుంభకోణంలో నితీశ్ కుమార్ హస్తం
పాట్నా : శ్రీజన్ కుంభకోణంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీల హస్తం ఉందంటూ ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. తన ఆరోపణలకు రుజువులుగా ఆయన శ్రీజన్ బ్యాంక్ స్టేట్మెంట్లను ఆయన ట్వీట్‌కు జత చేశారు. సుశీల్ మోదీ సోదరి రేఖ, మేనకోడలు ఊర్వశి శ్రీజన్ కుంభకోణంలో కోట్ల రూపాయలను లబ్దిపొందినట్లు వెల్లడించారు. దాదాపు 2,500 కోట్ల రూపాయల కుంభకోణంలో సీబీఐ నితీశ్, సుశీల్‌లను ఎందుకు విచారించదని ప్రశ్నించారు. ఇటీవల ఓ మీడియా సమావేశంలో సుశీల్ మోదీ, తేజస్వీ యాదవ్‌పై అవినీతి ఆరోపణలు గుప్పించారు. దేశంలోనే ప్రముఖ స్టీల్ కంపెనీ స్టోరేజీ ఏజెంట్‌గా ఉంటూ.. ఈ విషయాన్ని 2015లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో తేజస్వీ పేర్కొనలేదన్నారు. ఆదాయాన్ని చూపకుండా పన్నులు ఎగవేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన తేజస్వీ అసత్యాలను ప్రచారం చేయడంలో డిప్యూటీ సీఎం మాస్టర్ అని అన్నారు. సుశీల్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించి, నిరూపించాలని సవాలు విసిరారు. ఏంటీ శ్రీజన్ కుంభకోణం..? ‘శ్రీజన్’ మహిళలకు ట్రైనింగ్ ఇచ్చే ఓకేషనల్ సంస్థ. 2004 నుంచి 2013 మధ్య కాలంలో మహిళా నైపుణ్యాభివృద్ధి కోసం కేటాయింపబడిన ప్రభుత్వ నిధులను వివిధ అకౌంట్లలోకి తరలించారు. ఇందుకు పలు బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సహకరించారు. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో సీబీఐ బీహార్‌కు చెందిన శ్రీజన్ మహిళా వికాస్ సహయోగ్ సమితి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. -
ఇక ఆ ఉత్పత్తులు జీఎస్టీలోకి..
న్యూఢిల్లీ : దేశమంతా ఏక పన్ను విధానం విజయవంతంగా అమల్లోకి వచ్చింది. ఈ పన్ను విధానంలోకి మరికొన్ని ఉత్పత్తులను తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్ చూస్తోంది. ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం, రియాల్టీని తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తోందని బిహార్ ఆర్థిక మంత్రి సుశిల్ మోదీ చెప్పారు. ఎలక్ట్రిసిటీ, రియల్ ఎస్టేట్, స్టాంప్ డ్యూటీ, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీలోకి తీసుకురావాలనుకుంటున్నామని ఇండస్ట్రి ఛాంబర్ ఫిక్కీ వార్షిక సమావేశంలో ఆయన తెలిపారు. అయితే ఏ సమయం వరకు వీటిని జీఎస్టీలోకి తీసుకొస్తామో చెప్పడం కష్టమన్నారు. చట్టాన్ని సవరణ చేయకుండానే వీటిని కలుపబోతున్నట్టు పేర్కొన్నారు. ఒకవేళ పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పాలనలోకి తీసుకొస్తే, ఇవి అత్యధిక మొత్తంలో పన్ను శ్లాబులోకి వచ్చే అవకాశముంటుంది. అదేవిధంగా రాష్ట్రాలు తమ రెవెన్యూలను కాపాడుకోవడానికి సెస్‌ను విధించబోతున్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం రెవెన్యూలను పెట్రోలియం ఉత్పత్తుల నుంచి ఆర్జిస్తున్నాయి. జీఎస్టీ పన్ను విధానంలో ఐదు పన్ను శ్లాబులు 0 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం ఉన్నాయి. కొన్ని ఉత్పత్తులపై అదనంగా జీఎస్టీ సెస్ విధిస్తున్నారు. వీటిలో అత్యధిక పన్ను శ్లాబుగా ఉన్న 28 శాతాన్ని 25 శాతానికి తగ్గించబోతున్నారు. లేదా 12 శాతం, 18 శాతం పన్ను శ్లాబులను ఒకటిగా కలుపబోతున్నారు. -
భయం లేకుండా పెళ్లి చేసుకోండి..
పాట్న : ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ నుంచి వచ్చిన బెదిరింపులతో బీజేపీ నేత సుశిల్ మోదీ తన కొడుకు పెళ్లి వేదికను మార్చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు పెళ్లి వేదికను మారుస్తున్నట్టు తెలిపారు. సుశిల్ మోదీ తనను పెళ్లికి ఆహ్వానించారని, ఒకవేళ తాను అక్కడకు వెళ్తే తనను బహిర్గతం చేస్తానంటూ తేజ్ ప్రతాప్ యాదవ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఓ వీడియో వైరల్‌గా మారింది. తేజ్ ప్రతాప్ యాదవ్ కేవలం నిరాశతో ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారని సుశిల్ మోదీ అన్నారు. తేజ్ ప్రతాప్ ఎలాంటి అతనో తనకు తెలసునని, దీంతో వేదిక మార్చాలని నిర్ణయించినట్టు మోదీ తెలిపారు. పెళ్లి కూతురి కుటుంబాన్ని రాజకీయాల ముప్పు, అనవసరపు హింస, బెదిరింపుల నుంచి కాపాడే బాధ్యత తమదని చెప్పారు. ప్రస్తుతం మోదీ పెళ్లి వేదికలను రాజేంద్ర నగర్ శఖా మైదాన్ నుంచి వెటర్నరీ కాలేజీ గ్రౌండ్స్‌కు మార్చారు. లాలూ ప్రసాద్ ఈ వ్యాఖ్యలను ఖండించకపోవడం గమనార్హంగా ఉంది. పెళ్లి మండపాన్ని మారుస్తూ మోదీ తీసుకున్న నిర్ణయంపై తేజ్ ప్రతాప్ కూడా స్పందించారు. సుశిల్ మోదీ తన కొడుకు పెళ్లిని ఎలాంటి భయం బెరుకు లేకుండా చేసుకోవచ్చన్నారు. తాను క్రిమినల్ని లేదా టెర్రరిస్టును కాదని పేర్కొన్నారు. మోదీ చాలా భయగ్రస్తులైన డిప్యూటీ సీఎం అని, డిప్యూటీ సీఎం భయపడితే ఇక ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందంటూ లాలూ కామెంట్లు చేశారు. కాగ, పలువురు కేంద్ర మంత్రులు, నాలుగు రాష్ట్రాల గవర్నర్లు ఈ వేడకకు హాజరు కానున్నట్టు ధృవీకరణ అయింది. -
చెట్లకు రాఖీలు కట్టిన సీఎం, డిప్యూటీ సీఎం
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ రక్షా బంధన్‌ను వినూత్నంగా, కొంత సందేశాత్మకంగా జరుపుకున్నారు. వారిద్దరు పట్నాలో మొక్కలకు రాఖీలు కడుతూ సందడిగా కనిపించారు. తాము చెట్లకు రాఖీ కట్టిన ఉద్దేశం ప్రజలు వాటిని సంరక్షించాలని పిలుపునివ్వడమేనని ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా అభివృద్ది చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నట్లు తెలిపారు. ఎప్పటిలా మాదిరిగా తెల్లటి కుర్తా పైజామాలో వచ్చిన నితీష్ కుమార్ 'మొక్కలను సంరక్షించాలని చెప్పేందుకు ఇది (మొక్కలకు రాఖీ కట్టడం) ఒక సంకేతం. హరితవనం పెంచాలని చెప్పడం దీని ఉద్దేశం. ఇది పర్యావరణానికి అత్యంతముఖ్యమైనది' అని ఆయన చెప్పారు. 2001 నుంచి తాను రాఖీలు చెట్లకు కడుతున్నానని తెలిపారు. తన సందేశాన్ని చాలామంది స్ఫూర్తిగా తీసుకున్నారని, తమ రాష్ట్రంలో గ్రీనరీ కూడా బాగా పెరిగిందని తెలిపారు. ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని తెలిపారు. -
కలకలం రేపిన బీజేపీ నేత కామెంట్స్
పట్నా: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ తనయుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్‌పై బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తేజశ్వి యాదవ్‌ను నిర్భయ కేసులో బాలనేరస్తుడిగా పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్లో పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘మూతి మీద మీసాలు రాకముందే నిర్భయ రేప్ లాంటి దారుణానికి ఒకడు పాల్పడ్డాడు. ఇలాంటి వ్యక్తి అక్రమంగా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టడంలో వింతేముంద’ని ట్వీట్ చేశారు. మీసాలు రాకముందే తనపై అవినీతి కేసులు తేజశ్వి యాదవ్ ఇంతకుముందు పేర్కొన్న సంగతి తెలిసిందే. 2004-2009 సమయంలో తన తండ్రి లాలు ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు హోటల్ టెండర్లను దౌర్జన్యంగా సొంతం చేసుకున్నట్టు బీజేపీ ఆరోపించడంతో ఆయనీవిధంగా స్పందించారు. సుశీల్ కుమార్ మోదీవ వివాదస్పద ట్వీట్‌పై ఆర్జేడీ ట్విటర్లో స్పందించింది. సుశీల్‌కుమార్ వ్యాఖ్యలతపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా పరిణస్తారా? సుశీల్‌కుమార్ చేసిన కామెంట్లను బీజేపీగా భావించాలా? అని ఆర్జేడీ ప్రశ్నించింది. అనవసరంగా నిర్భయ పేరును ఈ వివాదంలోకి లాగుతున్నారని మండిపడింది. -
ఆ మాజీ సీఎం.. అవినీతిమయం: మోదీ
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ భార్య రబ్రీదేవి అవినీతి పురాణాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ బయటపెట్టారు. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నాటి మంత్రి అబ్దుల్ బారీ సిద్దిఖీ, మాజీ మంత్రి సుధా శ్రీవాస్తవలకు కేటాయించిన విలువైన భూమిని కారు చవగ్గా లాగేసుకున్నారని ఆయన ఆరోపించారు. సిద్ధిఖీ, సుధా శ్రీవాస్తవలకు ఎమ్మెల్యే కోఆపరేటివ్ సొసైటీ కేటాయించిన భూమిని ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి లాక్కున్నారని ఓ ప్రకటనలో చెప్పారు. 1992-93లో ఎమ్మెల్యేల సహకార సంఘం 5.59 డెసిమల్ భూమిని వారిద్దరికీ రూ. 37వేల వంతున కేటాయించగా, పదేళ్ల తర్వాత కూడా రబ్రీదేవి వారి నుంచి అదే ధరకు భూమి తీసుకున్నారని అన్నారు. ఇప్పుడు ఆ భూమి విలువ కోట్లలో ఉంటుందని తెలిఆపరు. రబ్రీదేవి 1997 నుంచి 2005 వరకు బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆర్జేడీ నేతలు రఘునాథ్ ఝా, కాంతి సింగ్ లాంటి వాళ్లు తేజస్వి, తేజ్‌ప్రతాప్ యాదవ్‌లకు తమ విలువైన భూములను చవగ్గా ఇచ్చినట్లే.. అప్పట్లో రబ్రీదేవికి కూడా వాళ్లిద్దరూ నామమాత్రపు ధరలకు ఎందుకు ఇచ్చారని సుశీల్ మోదీ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల సహకార సంఘం చైర్మన్ జయప్రకాష్ నారాయణ్, కార్యదర్శి భోలా యాదవ్ ఇద్దరూ లాలు ప్రసాద్ సన్నిహిత సహచరులేనని, వాళ్లు తాము భూములు కేటాయించిన వారి జాబితాలను ఎందుకు బహిర్గతం చేయడం లేదని నిలదీశారు. -
మోదీ బంపర్ ఆఫర్
- లాలూను వదిలెయ్.. బీజేపీ మద్దతు తీస్కో.. - సీఎం నితీశ్‌కు బిహార్ బీజేపీ చీఫ్ సుశీల్ ఓపెన్ ఆఫర్ పట్నా: పశువుల దాణా కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో శరాఘాతం తిన్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌పై రాజకీయదాడి మొదలైంది. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ఆర్జేడీ, జేడీయూల మధ్య విబేధాలకు ఆజ్యం పోసేలా బిహార్ బీజేపీ చీఫ్ సుశీల్ కుమార్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరుడైన లాలూతో తక్షణమే తెగదెంపులు చేసుకోవాలని సీఎం నితీశ్‌కుమార్‌ను సుశీల్ మోదీ కోరారు. ప్రభుత్వం నిలబడేందుకు అవసరమైతే బీజేపీ మద్దతు తీసుకోండని ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. దాణా కేసులో సోమవారం సుప్రీం తీర్పు అనంతరం మోదీ పట్నాలో విలేకరులతో మాట్లాడారు. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీఎం నితీశ్‌కు ఓపెన్‌గా చెబుతున్న.. తక్షణమే లాలూ స్నేహాన్ని వదిలెయ్యండి, ప్రభుత్వం పడిపోకుండా బీజేపీ మద్దతు తీస్కోండి’అని సుశీల్ మోదీ వ్యాఖ్యానించారు. గత సార్వత్రిక ఎన్నికల కంటే ముందు 17 సంవత్సరాలపాటు జేడీయూ- బీజేపీలు మిత్రులుగా ఉన్నారని గుర్తుచేశారు. కాగా, లాలూకు వ్యతిరేకంగా చక్రం తిప్పడంలోనూ నితీశ్ కీలక భూమిక పోషించారని సుశీల్ మోదీ ట్విస్ట్ ఇచ్చారు. సీఎం నితీశ్ కుమార్ ఆదేశాల మేరకే లాలూ ప్రసాద్ యాదవ్‌తోపాటు ఆర్జేడీకి చెందిన మంత్రుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని మోదీ చెప్పారు. ‘లాలూ ఎవరెవరితో ఫోన్లో ఏమేం మాట్లాడుతున్నారో నితీశ్‌కు తెలుసు. లాలూను బలహీనపర్చడం ద్వారా 2019లో ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని సులువుగా పొందొచ్చన్నది నితీశ్ ఎత్తుగడ’ అని మోదీ ఆరోపించారు. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో ప్రస్తుతం ఆర్జేడీకి 80, జేడీయూకు 71, బీజేపీకి 58, కాంగ్రెస్ పార్టీకి 27 సభ్యుల మద్దతు ఉంది. గత ఎన్నికల్లో ఆర్జేడీ-జేడీయూలు కలిసి పోటీచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. కాగా, సుశీల్ మోదీ ఆఫర్ పై సీఎం నితీశ్ స్పందించాల్సిఉంది. దాణా కేసులో లాలూకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు బిహార్ రాజకీయాలను ఎన్ని మలుపులు తిప్పుతుందో వేచిచూడాలి. (దాణా కుంభకోణం: సుప్రీం కోర్టులో లాలూకు ఎదురుదెబ్బ) -
నితీశ్ ఆహ్వానం.. బీజేపీలో చీలిక!
పట్నా: బిహార్ సీఎం నితీశ్‌కుమార్ తాజాగా ఇచ్చిన అధికారిక విందు.. బీజేపీలో పెద్ద చీలికనే తెచ్చింది. ఈ విందుకు కొందరు సీనియర్ నేతలు కొందరు హాజరుకాగా.. మరికొందరు డుమ్మా కొట్టారు. బీజేపీతో రెండు దశాబ్దాలకుపైగా ఉన్న అనుబంధాన్ని నితీశ్ తెగదెంపులు చేసుకున్న తర్వాత బీజేపీ నేతలు ఆయన ఇచ్చిన విందుకు హాజరుకావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బిహార్ బీజేపీ ముఖ్యనేత అయిన సుశీల్‌కుమార్ మోదీతోపాటు పలువురు ఈ విందులో దర్శనమిచ్చారు. అయితే, బీజేపీ రాష్ట్ర అగ్రనేతలైన ప్రేమ్‌కుమార్, నందకిషోర్ యాదవ్ తదితరులు ఈ విందుకు దూరంగా ఉన్నారు. నితీశ్ ఆహ్వానం బీజేపీలో చీలిక తెచ్చిందన్న అంశం రాజకీయంగా చర్ఛనీయాంశం కాగా.. 'ఒక విందు కోసం పార్టీ విప్‌ను జారీచేయలేదు కదా. ఒక ఆహ్వాన్నాన్ని మన్నించాలా? వద్దా? అన్నది వ్యక్తిగత అభీష్టం' అని ఈ విషయాన్ని సుశీల్ మోదీ తోసిపుచ్చారు. అయితే, సోమవారం రాత్రి నితీశ్ ఇచ్చిన ఈ డిన్నర్ పార్టీకి ఆయన ప్రస్తుత మిత్రపక్షం లాలూప్రసాద్ యాదవ్ కూడా రాలేదు. అయినా, ప్రజాప్రతినిధి కాకపోవడంతో ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఆయన తనయులు తేజస్వి, తేజ్ ప్రతాప్ సింగ్ మాత్రం హాజరయ్యారు. ఇటీవల బిహార్ రాజకీయ పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. నితీశ్ తీరుపై లాలూ అసంతృప్తితో ఉన్నారని వినిపిస్తోంది. నితీశ్ సంకీర్ణ ప్రభుత్వంలో లాలూ కీలక భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. తన అసంతృప్తినే చాటేందుకే నితీశ్ అధికారిక కార్యక్రమాలకు మంత్రులైన తన తనయులను దూరంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల నితీశ్ పాల్గొన్న పలు కార్యక్రమాలకు లాలూ తనయులు డుమ్మా కొట్టారు. మరోవైపు నితీశ్ మళ్లీ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్ రాజకీయ పరిణామాలు ఆసక్తికర మలుపులు తిరుగుతాయా? అని పరిశీలకులు వేచిచూస్తున్నారు. -
మా ఆయన వద్ద నల్లధనం లేదు!
నల్లధనంపై పోరాటంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దుచేయడంపై బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని మోదీ నల్లధనాన్ని దాచి ఉంచారేమో కానీ మా ఆయన లాలూప్రసాద్ వద్ద ఏమాత్రం నల్లధనం లేదు. ఆయనకు వ్యతిరేకంగా 25 ఏళ్లు (దాణా స్కాం) కేసు నడిచింది. కానీ ఆయన వద్ద ఒక్క నయాపైసాను కూడా ఎవరూ కనుగొనలేదు’ అని రబ్రీదేవీ అన్నారు. అదేవిధంగా పెద్దనోట్ల రద్దును బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సమర్థిస్తున్న నేపథ్యంలో బీజేపీ-నితీశ్ పొత్తు పెట్టుకోవచ్చునని వస్తున్న వార్తలపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కావాలంటే బిహార్ బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ.. నితీశ్‌ను తన ఒడిలో కూచోబెట్టుకోవచ్చునని అన్నారు. అయితే, తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఇవి సరదాకు చేసిన వ్యాఖ్యలు మాత్రమేనని, ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దని మీడియాకు తెలిపారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి అయిన రబ్రీదేవి బిహార్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం బిహార్ శాసనమండలి సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బిహార్‌లో నితీశ్‌కుమార్ జేడీయూ, ఆర్జేడీ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేడీయూ మళ్లీ బీజేపీ వైపునకు అడుగులు వేస్తున్నదన్న కథనాలు రాష్ట్రంలో రాజకీయ కలకలం రేపుతున్నాయి. -
'మోదీని చూస్తే చైనా, పాక్‌లకు భయం'
పట్నా: బిహార్ ఎన్నికల్లో మరో బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని చూసి చైనా, పాకిస్థాన్‌లు భయపడుతున్నాయని, బిహార్ ప్రజలు తప్పనిసరిగా బీజేపీకి ఓటు వేసి మోదీని బలపరచాలని, ఆ రాష్ట్ర బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ అన్నారు. బిహార్‌లో బీజేపీ ఓడితే పాకిస్థాన్‌లో టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకుంటారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సుశీల్ కుమార్ మోదీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. 'ప్రధాని మోదీని బలహీనపరచవద్దని బిహార్ ప్రజలకు విన్నవిస్తున్నా. చైనా, పాకిస్థాన్‌లు మోదీని చూసి భయపడుతున్నాయి. బిహార్‌లో బీజేపీ గెలిస్తే భారత్‌లో దీపావళి చేసుకుంటారు. యూపీఏ గెలిస్తే పాకిస్థాన్‌లో సంబరాలు చేసుకుంటారు' అని సుశీల్ కుమార్ మోదీ ట్వీట్ చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై జేడీయూ, ఆర్జేడీ నాయకులు మండిపడ్డారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. బిహార్‌లో ప్రధాని మోదీ, సీఎం నితీష్ కుమార్ విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు.