'మోదీని చూస్తే చైనా, పాక్లకు భయం' | 'Vote for PM Modi. China, Pakistan Afraid of Him,' Says Bihar BJP Leader | Sakshi
Sakshi News home page

'మోదీని చూస్తే చైనా, పాక్లకు భయం'

Published Fri, Oct 30 2015 12:55 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

'మోదీని చూస్తే చైనా, పాక్లకు భయం' - Sakshi

'మోదీని చూస్తే చైనా, పాక్లకు భయం'

పట్నా: బిహార్ ఎన్నికల్లో మరో బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ప్రధాని నరేంద్ర మోదీని చూసి చైనా, పాకిస్థాన్లు భయపడుతున్నాయని, బిహార్ ప్రజలు తప్పనిసరిగా బీజేపీకి ఓటు వేసి మోదీని బలపరచాలని, ఆ రాష్ట్ర బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ అన్నారు. బిహార్లో బీజేపీ ఓడితే పాకిస్థాన్లో టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకుంటారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సుశీల్ కుమార్ మోదీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

'ప్రధాని మోదీని బలహీనపరచవద్దని బిహార్ ప్రజలకు విన్నవిస్తున్నా. చైనా, పాకిస్థాన్లు మోదీని చూసి భయపడుతున్నాయి. బిహార్లో బీజేపీ గెలిస్తే భారత్లో దీపావళి చేసుకుంటారు. యూపీఏ గెలిస్తే పాకిస్థాన్లో సంబరాలు చేసుకుంటారు' అని సుశీల్ కుమార్ మోదీ ట్వీట్ చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై జేడీయూ, ఆర్జేడీ నాయకులు మండిపడ్డారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. బిహార్లో ప్రధాని మోదీ, సీఎం నితీష్ కుమార్ విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement