ముగ్గురు రేషన్‌ డీలర్ల లైసెన్స్‌లు రద్దు | three ration dealers lisence dismiss | Sakshi
Sakshi News home page

ముగ్గురు రేషన్‌ డీలర్ల లైసెన్స్‌లు రద్దు

Published Wed, Sep 7 2016 8:49 PM | Last Updated on Mon, Jul 29 2019 5:53 PM

three ration dealers lisence dismiss

సిరిసిల్ల : సిరిసిల్ల రెవెన్యూ డివిజన్‌లోని ముగ్గురు రేషన్‌ డీలర్ల లైసెన్స్‌లను రద్దు చేసినట్లు సిరిసిల్ల ఆర్డీవో జి.వి.శ్యామ్‌ప్రసాద్‌లాల్‌ బుధవారం తెలిపారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌కు చెందిన రేషన్‌ డీలర్లు బి.లక్ష్మి, ఎస్‌.స్వామి, వేములవాడకు చెందిన ఎస్‌.నాగభూషణం డీలర్‌ షిప్‌లను రద్దు చేశామని ఆర్డీవో వివరించారు. పౌరసరఫరాల సరుకులను సక్రమంగా ప్రజలకు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం చేసినందుకు వారి లైసెన్స్‌లు రద్దు చేసినట్లు ఆర్డీవో తెలిపారు. సరుకుల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన వారి లైసెన్స్‌లు రద్దు చేస్తూ జాయింట్‌ కలెక్టర్‌కు నివేదిక పంపించామని ఆర్డీవో తెలిపారు. డీలర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement