లండన్: ఒక ఆర్బ్రిట్రేషన్ కేసులో ఎస్సార్ స్టీల్ పేరెంట్ కంపెనీ, ఆ కంపెనీ ప్రమోటర్ కుటుంబ సభ్యులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తుల జప్తునకు ఆర్సెలర్‌మిట్టల్ చేస్తున్న యత్నాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో మార్చి 30న లండన్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు అనుమతించాలన్న ఆర్సెలర్‌మిట్టల్ పిటిషన్‌ను లండన్ అప్పీలేట్ కోర్ట్ కొట్టివేసింది. 2019లో మారిషస్‌లో దివాలా చట్రంలోకి వెళ్లిన ఎస్సార్ స్టీల్ లిమిటెడ్‌కు సంబంధించి 1.5 బిలియన్ డాలర్ల ఆర్బ్రిట్రేషన్ కేసులో ‘తమ ప్రయోజనాలకు కలిగిన నష్టాలను భర్తీ చేయాలని, ఈ విషయంలో ఎస్సార్, రవి రుయా, ప్రశాంత్ రుయాల ఆస్తులను జప్తు చేయాలని ’ కోరుతూ ఆర్సెలర్‌మిట్టల్ చేస్తున్న న్యాయపోరాటాలకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎస్సార్ చేసిన తాజా ప్రకటన ప్రకారం, ఆర్సెలర్‌మిట్టల్ యూఎస్‌ఏ (ఏఎంయూఎస్‌ఏ) అప్పీల్ గెలుపొందడానికి తగిన అంశాలను కలిగిలేదని ఆ సంస్థ (ఆర్సెలర్ మిట్టల్) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ న్యూయీ నేతృత్వంలోని లండన్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఏప్రిల్ 21న పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment