assets attaches
-
జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
కీలక పరిణామం.. భారీగా ‘మార్గదర్శి’ చరాస్తుల జప్తు!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదా రులు, డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసేందుకు సీఐడీని అనుమతించింది. వీటిలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ నగదు, బ్యాంకు ఖాతాల్లో సొమ్ము, నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడులున్నాయి. చిట్టీలు వేసిన చందాదారుల సొమ్మును మార్గదర్శి చిట్‌ఫండ్స్ చెల్లించే స్థితిలో లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం 1999 ప్రకారం హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం అనుమతితో చరాస్తుల జప్తునకు సీఐడీ అధికారులు చర్యలు చేపట్టనున్నా రు. ఇదే విషయాన్ని వివరిస్తూ 50 బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు కూడా సమాచారం అందించారు. బ్యాంకులు, ఇతర సంస్థల్లోని నిధుల ను మార్గదర్శి మళ్లించకుండా, డిపాజిట్‌దారుల ప్ర యోజనాలను కాపాడేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. చట్టాన్ని పాటించేందుకు నిరాకరణ కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ దశాబ్దాలుగా ఆర్థిక అక్రమాలను పాల్పడుతున్నట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీల్లో వెల్లడైంది. చందాదారుల సొమ్మును నిబంధనలకు మార్గదర్శి తమ అనుబంధ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులుగా మళ్లించినట్లు కీలక ఆధారాలు సేకరించింది. చిట్‌ఫండ్స్ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజ కిరణ్‌లతోపాటు బ్రాంచి మేనేజర్లపై (ఫోర్‌మెన్) సీఐడీ కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్న విషయం విదితమే. కేంద్ర చిట్‌ఫండ్ చట్టాన్ని అనుసరిస్తున్నట్లు ఆధారాలు చూపితే కొత్త చిట్టీలకు అనుమతిస్తామని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సూచించినా మార్గదర్శి అందుకు నిరాకరించింది. దీంతో గతేడాది డిసెంబర్ నుంచి రాష్ట్రంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ కొత్త చిట్టీలు నిలిపివేసింది. ఆరు నెలల్లో దాదాపు రూ.400 కోట్ల విలువైన టర్నోవర్ నిలిచిపోయింది. మరోవైపు పాత చందాదారులకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ సకాలంలో చిట్టీల మొత్తాన్ని చెల్లించకపోవడంతో చందాదారులు పెద్ద సంఖ్యలో చిట్స్ రిజిస్ట్రార్, సీఐడీకి ఫిర్యాదు చేస్తున్నారు. వీటిని పరిశీలించిన సీఐడీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరింది. చదవండి: ఆర్డినెన్స్ వివాదం.. ఆప్‌కు షాక్ ఇవ్వనున్న కాంగ్రెస్.. -
రూ.1,300 కోట్ల ఐఆర్‌ఈవో ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో రియల్ ఎస్టేట్ సంస్థ ఐఆర్‌ఈవోకు చెందిన రూ.1,317 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైర్టెరేట్(ఈడీ) తెలిపింది. ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ లలిత్ గోయెల్ సంబంధీకులకు చెందిన ఆస్తులు ఇందులో ఉన్నాయని వివరించింది. ఇందులో వాణిజ్య స్థలాలు, ప్లాట్లు, నివాస భవనాలు, బ్యాంకు అకౌంట్లు ఉన్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. వాణిజ్య స్థలాలు, ప్లాట్లు, నివాస భవనాలు ఇస్తామంటూ కొనుగోలుదారులను మోసగించి వసూలు చేసిన మొత్తాన్ని పక్కదారి పట్టించినట్లు ఆరోపించింది. ఈ మేరకు గురుగ్రామ్, పంచ్‌కుల, లూథియానా, ఢిల్లీలోని పోలీస్స్టేషన్ల పరిధిలో 30 కేసులు నమోదై ఉన్నట్లు తెలిపింది. -
‘విల్లు’ ఎక్కుపెట్టారా..?
‘విల్లు’ (వీలునామా) ప్రాధాన్యం తెలిసిన వారు చాలా తక్కువ మందే ఉంటారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి ఎంతో మందిని బలితీసుకుంటున్న విపత్కర పరిస్థితుల్లో ‘వీలునామా’కు ప్రాధాన్యం ఎంతో ఉంది. తమ ఆస్తులను తదనంతరం తమ వారికి న్యాయబద్ధంగా పంచడమే విల్లులోని ముఖ్య లక్ష్యం. దీనివల్ల ఆస్తుల కోసం వారసులు గొడవపడాల్సిన అవసరం ఏర్పడదు. అవి వారసులకు సులభంగా బదిలీ అవుతాయి. ఇటీవలి కాలంలో వీలునామా పట్ల అవగాహన పెరుగుతోంది. దీనికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలుసుకుంటున్నారు. విల్లును డ్రాఫ్ట్ చేయించేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. అయినప్పటికీ వీలునామా గురించి సరైన అవగాహన ఉన్నది కొద్ది మందికే అన్నది వాస్తవం. మరణానంతరం ఆస్తుల పంపకం విషయమై ఎంతో సాయపడే విల్లు గురించి, అందులోని సౌకర్యాల గురించి, విల్లు రాసే విషయంలో తప్పులకు అవకాశం ఇవ్వకుండా ఎలా వ్యవహరించాలన్నది అవగాహన కల్పించే కథనమే ఇది.. వీలునామా అంటే..? ‘వీలునామా’ అంటే చట్టపరమైన డాక్యుమెంట్. ఒక వ్యక్తి తన మరణం తర్వాత తన వారికి ఆస్తులను ఏ విధంగా పంపిణీ చేయాలన్న ధ్రువీకరణ. ‘‘విల్లుకు ఓ నిర్దిష్ట రూపం అంటూ లేదు. ఓ సాధారణ తెల్లని పేపర్‌పై పెన్నుతో స్పష్టంగా రాసి సంతకం చేసినా అది విల్లుగా మారుతుంది. దీనికి స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవక్కర్లేదు’’అని ‘ఇండియా లా పార్ట్నర్స్’ మేనేజింగ్ పార్ట్నర్ గోపికా పంత్ తెలిపారు. అయితే అంత సులభమే అయినా కానీ అవగాహన లేకపోతే తప్పులకు ఆస్కారం ఏర్పడుతుంది. ‘‘ఏదైనా ఒక్క తప్పు చోటు చేసుకుంటే వీలునామా లక్ష్యమే నీరుగారిపోతుంది. మీ వారసుల గుర్తింపును స్పష్టంగా పేర్కొనాలి. ఏ ఆస్తులను ఇవ్వాలనుకున్నదీ వివరంగా రాయాలి’’ అని సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పార్ట్నర్ అయిన రిషబ్ ష్రాఫ్ తెలిపారు. ఏమేమి ఉండాలి? వీలునామాలో నిర్దేశించిన విధంగా ఆస్తుల పంపిణీని చూసే వ్యక్తి పేరును కూడా అందులోనే పేర్కొనాల్సి ఉంటుంది. తన ఆకాంక్షలకు అనుగుణంగా ఆస్తులను వారసుల మధ్య పరిష్కరించే బాధ్యతలను నిర్వహించే సామర్థ్యాలు ఉన్నవారిని ఇందుకోసం ఎంచుకోవాలి. ఆస్తుల వివరాలతోపాటు, వాటిని ఏ రీతిలో పంచాలన్న వివరాలనూ విల్లులో పేర్కొనాలని పంత్ సూచించారు. ఒకవేళ తగినంత అనుభవం లేని లేదా పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తిని నియమించుకుంటే అది సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. ‘‘విల్లు రాయడానికి ముందే ఆ విల్లు అమలు బాధ్యతలను చూసే వ్యక్తి విషయమై చర్చించడం మంచిది. జీవిత భాగస్వామి లేదా పెద్ద కుమారుడు లేదా కుమార్తె సాధారణ ఆప్షన్ అవుతుంది’’ అని రిషబ్ ష్రాఫ్ పేర్కొన్నారు. ప్రతీ కుటుంబానికి, పరిస్థితులనేవి భిన్నంగా ఉండొచ్చన్నారు. వీలునామా రాసే వ్యక్తి (టెస్టేటర్) పూర్తి ఆరోగ్యంతో, మానసిక ఆరోగ్యం కూడా సరిగ్గానే ఉండాలన్న నియమాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. స్వచ్ఛందంగా, ఎవరి బలవంతం లేకుండా విల్లును రాస్తున్నట్టు కూడా అందులో పేర్కొనాలి. రాసిన విల్లును ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది స్వతంత్ర వ్యక్తులు ధ్రువీకరించడం (అటెస్టేషన్) తప్పనిసరి. అప్పుడే దానికి విలువ చేకూరుతుంది. వీలునామాలో ఆస్తులకు లబ్ధిదారులుగా ఉన్నవారు విల్లు నిర్వాహకులుగానూ ఉండొచ్చని పంత్ తెలిపారు. కాకపోతే వారసుల సాక్ష్యాన్ని (విట్నెస్) తీసుకోవడం లోపంగా పంత్ పేర్కొన్నారు. వారసులను సాక్షులుగా పేర్కొంటే ఉద్దేశం నెరవేరదన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ‘‘వీలునామాలో ‘రెసిడ్యుయరీ క్లాజ్’ అన్నది తప్పకుండా ఉండాలి. విల్లును రాసే నాటికి తన ఆస్తుల్లో కొన్నింటికి వారసులుగా ప్రత్యేకంగా ఎవరినీ సూచించలేకుంటే ఆ వివరాలను ఇందులో పొందుపరుస్తారు. ఈ భాగంలోనే ఆయా ఆస్తులకు ఒక వారసుడిని పేర్కొనాల్సి ఉంటుంది. మిగిలిన వారసుల అభీష్టానికి అనుగుణంగా వీటి అమలుపై నిర్ణయం తీసుకోవాలి’’అని పంత్ వివరించారు. వివాదాలకు ఆస్కారం వీలునామా స్పష్టంగా లేకపోతే వివాదాలు మొదలవుతాయి. సంరక్షకుణ్ణి నియమించకుండా ఆస్తులను మైనర్‌కు ఇవ్వాలని రాయడం వల్ల సదరు వ్యక్తి మేజర్ అయ్యే వరకు అమలు ఆగిపోవడం తరచుగా కనిపించే అంశమని ‘ఇండియా లా పార్ట్నర్స్’ మేనేజింగ్ పార్ట్నర్ గోపికా పంత్ పేర్కొన్నారు. అలాగే, వీలునామా రాసిన తర్వాత కాలంలో.. కొత్తగా సమకూర్చుకునే ఆస్తుల వివరాలను అప్డేట్ చేయకపోవడమూ కనిపించే అంశమని తెలిపారు. ‘‘ఇటీవలే ఓ వ్యక్తి విల్లు రాస్తూ అప్పటికి తన పేరు మీదున్న అన్ని ఆస్తుల వివరాలను పేర్కొన్నారు. ఆ తర్వాత తాను సమకూర్చుకున్న షేర్లు, బాండ్లను ఎవరికి ఇవ్వాలనుకున్నదీ వారసులకు తెలియజేశారు కానీ.. ఆ విషయాన్ని విల్లులో అప్డేట్ చేయకుండా మరణించారు. దీనివల్ల విల్లులో పేర్కొనని ఆస్తులను వారసులు సమానంగా పంచుకోవాల్సి వచ్చింది. పైగా ఆ ఆస్తులను తమ మధ్య సమానంగా పంచుకునేందుకు కోర్టు ఫీజులు, న్యాయ చార్జీల రూపంలో అదనపు ఖర్చుతోపాటు, సమయం కూడా వెచ్చించాల్సి వచ్చింది’’ అని పంత్ వివరించారు. విల్లును సవరించడం విల్లును రాసిన తర్వాతి కాలంలో ఆస్తుల పరంగా మార్పులు చోటు చేసుకున్నప్పటికీ.. ఆ వివరాలను తిరిగి విల్లులో పొందుపరచడం అన్నది చాలా మంది చేయడం లేదు. ఎలా చేయాలన్న సందేహమే ఇందుకు కారణం. ‘‘వీలునామాకు స్వల్ప మార్పులు అవసరమనిపిస్తే దాన్ని కోడిసిల్ (అనుబంధం) రూపంలో సవరణ చేసుకోవచ్చు. దాంతో అది విల్లులో ఒక భాగంగా మారిపోతుంది. ఒకవేళ గతంలో రాసిన వీలునామాలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలనుకుంటే.. అప్పుడు సవరణలు కంటే కూడా తాజాగా విల్లును రూపొందించుకోవడం వల్ల గందరగోళానికి అవకాశం ఉండదు’’ అని పంత్ వివరించారు. ఆస్తుల విలువ తరిగిపోయే కేసుల్లో వీలునామా సవరణ ఎంతో కీలకమవుతుందన్నారు. ‘‘ఒకవేళ ఇద్దరు లబ్ధిదారుల మధ్య ఆస్తులు సమానంగా పంపకం చేయాలని వీలునామా రాసినట్టయితే.. అందులో ఒక వ్యక్తికి చెందాల్సిన ఆర్థిక ఆస్తుల విలువ గణనీయంగా తరిగిపోతే.. అటువంటి సందర్భాల్లో ఆ మేరకు పరిహారం లభించేలా పంపకాలను నిర్దేశించాలి’’ అని కార్వీ ప్రైవేటు వెల్త్ ప్రొడక్ట్స్ హెడ్ శాంతను అవస్తి సూచించారు. ముఖ్యంగా కరోనా వంటి అసాధారణ పరిస్థితులు తలెత్తితే ఎలా వ్యవహరించాలన్నది వీలునామాలో పేర్కొనడం అవసరమని అభిప్రాయపడ్డారు. -
ఎస్సార్ ఆస్తుల జప్తు కుదరదు
లండన్: ఒక ఆర్బ్రిట్రేషన్ కేసులో ఎస్సార్ స్టీల్ పేరెంట్ కంపెనీ, ఆ కంపెనీ ప్రమోటర్ కుటుంబ సభ్యులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తుల జప్తునకు ఆర్సెలర్‌మిట్టల్ చేస్తున్న యత్నాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో మార్చి 30న లండన్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు అనుమతించాలన్న ఆర్సెలర్‌మిట్టల్ పిటిషన్‌ను లండన్ అప్పీలేట్ కోర్ట్ కొట్టివేసింది. 2019లో మారిషస్‌లో దివాలా చట్రంలోకి వెళ్లిన ఎస్సార్ స్టీల్ లిమిటెడ్‌కు సంబంధించి 1.5 బిలియన్ డాలర్ల ఆర్బ్రిట్రేషన్ కేసులో ‘తమ ప్రయోజనాలకు కలిగిన నష్టాలను భర్తీ చేయాలని, ఈ విషయంలో ఎస్సార్, రవి రుయా, ప్రశాంత్ రుయాల ఆస్తులను జప్తు చేయాలని ’ కోరుతూ ఆర్సెలర్‌మిట్టల్ చేస్తున్న న్యాయపోరాటాలకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎస్సార్ చేసిన తాజా ప్రకటన ప్రకారం, ఆర్సెలర్‌మిట్టల్ యూఎస్ఏ (ఏఎంయూఎస్ఏ) అప్పీల్ గెలుపొందడానికి తగిన అంశాలను కలిగిలేదని ఆ సంస్థ (ఆర్సెలర్ మిట్టల్) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ న్యూయీ నేతృత్వంలోని లండన్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఏప్రిల్ 21న పేర్కొంది. -
శివసేనకు పూర్వవైభవం వస్తుందా?
చంద్రయాన్ విజయవంతం కాలేకపోవచ్చు. కానీ మా సూర్యయాన్ (ఆదిత్య అంటే సూర్యుడు) కచ్చితంగా మంత్రాలయ ఆరో అంతస్తులో (మహారాష్ట్ర సీఎం కార్యాలయం) స్మూత్‌గా ల్యాండింగ్ అవుతుంది. ఇప్పడు శివసేనలో ముక్తకంఠంగా వినిపిస్తున్న మాట ఇది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే మనవడు 29 ఏళ్ల వయసున్న ఆదిత్య ఠాక్రే ఈ సారి శివసేనకు కంచుకోటైన దక్షిణ ముంబైలోని వర్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగడంతో ఆయననే భవిష్య సీఎంగా కీర్తిస్తూ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఠాక్రే కుటుంబంలో ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. తమ కనుసన్నలతోనే ప్రభుత్వాలను శాసించారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటలేకపోయిన శివసేన ఈ సారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికే ఆదిత్యను బరిలోకి దింపుతోంది. ► సేన ట్రంప్ కార్డు ఉద్ధవ్ ఠాక్రే, రష్మి ఠాక్రే దంపతులకు ఆదిత్య 1990లో జన్మించారు. ముంబైలో బీఏ ఎల్ఎల్బీ చేశారు. స్వతహాగా కవి, రచయిత. ఆదిత్య రాసిన కవిత్వం మై థాట్స్ ఇన్ వైట్ అండ్ బ్లాక్ పేరుతో పుస్తకంగా వచ్చింది. తాను రాసిన ప్రైవేటు గీతాలతో . ఉమ్మీద్ అనే ఆల్బమ్‌ని తీసుకువచ్చారు. ఇవన్నీ ప్రజల్లోకి బాగా వెళ్లి ఆయన పేరు మారుమోగిపోయింది. 2010లో యువజన విభాగం చీఫ్‌గా రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆదిత్య శివసేనపై తన ముద్ర వేయడానికి మొదట్నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. సంప్రదాయ శివసేన భావాలను వదిలించుకొని ఆధునిక హంగుల్ని సమకూర్చడానికి వ్యూహాలు రచించారు. నగరాల్లో యువతను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా పావులు కదిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత ఏడాది ముంబైలో నైట్ లైఫ్‌ను తిరిగి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు లేఖ రాసి వార్తల్లోకెక్కారు. మాల్స్, రెస్టారెంట్లు రాత్రంతా తెరిచి ఉంచాల ని ప్రతిపాదనలు చేశారు. అవి సాకారం కానప్పటికీ మార్పు కోసం అంటూ నినదిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు నడిపారు. వొర్లి నియోజకవర్గంలో ఎంతో కాలంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ యువతరాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ► శివసేనకు పూర్వవైభవం వస్తుందా? కొన్నేళ్ల క్రితం వరకు బీజేపీ, శివసేన కూటమిలో సేనదే పై చేయిగా ఉండేది. బాల్ ఠాక్రే జీవించినంత కాలం ఒక పెద్దన్న పాత్రనే పోషించారు. ఎన్నోసార్లు ఆయన బీజేపీపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. కమలదళాన్ని కమ్లి అని స్త్రీలింగాన్ని గుర్తుకు తెచ్చే పేరుతో పిలుస్తూ ‘ఆమెను బయటకు పొమ్మని తలుపు చూపించినా కిటికీలోంచే నా వైపే చూస్తూ ఉంటుంది’అని వ్యాఖ్యానించేవారు. కానీ బీజేపీ లో మోదీ, అమిత్ షా హవా పెరిగాక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. మహారాష్ట్ర రాజకీయాలను కూడా మోదీ, షా ద్వయం తమ గుప్పిట్లో పెట్టుకోవడం మొదలు పెట్టారు. అం దుకే కూటమిలో పై చేయి సాధించడమే కాదు, పూర్వ వైభవాన్ని తీసుకురావడానికే శక్తివంచన లేకుండా శ్రమిస్తున్న ఈ యువసేనాని అసెంబ్లీకి ఎన్నిక కావడం కష్టమేమీ కాదు కానీ మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదిత్య ఉదయం ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో వేచి చూడాలి. ఆదిత్య ఠాక్రే ఆస్తులు 16 కోట్లు వర్లి నుంచి నామినేషన్ దాఖలు ముంబై: ఠాక్రే వంశం నుంచి మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న శివసేన అ«ధినేత కుమారుడు ఆదిత్య ఠాక్రే దక్షిణ ముంబైలోని వర్లి శాసనసభ నియోజకవర్గం నుంచి గురువారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. తండ్రి ఉద్ధవ్ ఠాక్రే, తల్లి రష్మి తన వెంట రాగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ వేయడానికి ముందు తాత శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆదిత్య ఠాక్రే దాఖలు చేసిన అఫడివిట్ ప్రకారం ఆయనకున్న ఆస్తుల విలువ రూ. 16.5 కోట్లు. అందులో చరాస్తులు రూ.11.38 కోట్లని, స్థిరాస్తులు రూ. 4.67 కోట్లుగా చూపించారు. అందులో రూ.10.36కోట్లు బ్యాంకు డిపాజిట్లు ఉంటే, ఒక బీఎండబ్ల్యూ కారు కూడా ఉంది. దీని ధరని రూ. 6.5 లక్షలుగా పేర్కొన్నారు. ఇక ఆదిత్యకు రూ. 64.65 లక్షల విలువైన బంగారం, ఆభరణాలు ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి. 29 ఏళ్ల వయసున్న ఆదిత్య బీఏ ఎల్ఎల్బీ చేశారు. ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. -
రూ.16 కోట్ల జకీర్ ఆస్తుల అటాచ్మెంట్
న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్‌కు సంబంధించిన రూ. 16.40 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఆస్తులను జప్తు చేసినట్లు శనివారం వెల్లడించింది. జకీర్ కుటుంబసభ్యుల పేరిట ముంబై, పుణేలో ఉన్న ఈ స్థిరాస్తులను ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎమ్ఎల్ఏ) కింద జప్తు చేసినట్లు పేర్కొంది. జకీర్ బ్యాంక్ ఖాతాకు వచ్చిన విరాళాలను తన భార్య, కొడుకు, మేనకోడలు అకౌంట్లకు పంపినట్లు ఆధారాలు సేకరించిన ఈడీ ఈ ఆస్తులను జప్తు చేసింది. జప్తు చేసిన వాటిలో ముంబైలోని ఫాతిమా హైట్స్, ఆఫియా హైట్స్ భవంతులతో పాటు బాందప్ ప్రాంతంలోని ఆస్తులు, పుణేలోని కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. -
బిట్ కాయిన్ స్కాం : కోట్ల ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ : బిట్ కాయిన్‌పై ఈ మధ్యన కాస్త మోజు తగ్గింది. బిట్‌కాయిన్ ట్రేడింగ్‌లో మోసాలు, కోట్ల రూపాయలు పోగొట్టుకోవడం, ఆర్బీఐ దీన్ని లీగల్ కరెన్సీగా గుర్తించకపోవడం దీనికి ప్రధాన కారణమైంది. తాజాగా బిట్ కాయిన్ లావాదేవీల కేసులో భాగంగా అమిత్ భరద్వాజ్ అనే వ్యక్తికి సంబంధించి భారీ మొత్తంలో ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. భరద్వాజ్‌కు చెందిన భారత్, దుబాయ్‌లో ఉన్న రూ.42.88 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ వెల్లడించింది. మనీ లాండరింగ్ నివారణ చట్టం(పీఎంఎల్ఏ) కింద ఆస్తులను అటాచ్ చేసుకునే ముందస్తు ఆర్డర్‌ను ఏజెన్సీ జారీ చేసింది. అటాచ్ చేసుకున్న ఆస్తుల్లో అమిత్ భరద్వాజ్‌కు దుబాయ్ ఉన్న ఆరు కార్యాలయాలు, భారత్‌లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్‌లు, ఫ్లాట్లు ఉన్నాయి. వీటి విలువ రూ.42.88 కోట్లగా ఉన్నట్టు ఈడీ పేర్కొంది. భరద్వాజ్ సింగపూర్‌లో 2015లో మిస్ వేరియబుల్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌ను సింగపూర్‌లో ప్రారంభించారు. బిట్ కాయిన్ ట్రేడింగ్ కోసం www.gainbitcoin.comను లాంచ్ చేశారు. బిట్ కాయిన్లు భారత్‌లో చట్టవిరుద్ధం. పెట్టుబడుల ద్వారా బిట్ కాయిన్లను కొనాలని, ఎక్కువ రిటర్నులు ఆర్జిస్తారని.. భరద్వాజ్, ఆయన టీమ్ ఇన్వెస్టర్లను ఆకర్షించారు. అలా 80వేల బిట్కాయిన్లతో పెట్టుబడులను సేకరించినట్టు ఈడీ పేర్కొంది. కానీ ఇన్వెస్టర్లకు ప్రమాణం చేసిన మాదిరిగా రిటర్నులను చెల్లించకుండా.. క్రిప్టో కరెన్సీ టోకెన్‌ను ఆఫర్ చేసినట్టు తెలిపింది. అయితే దానికి క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లో ఎలాంటి విలువ లేదన్నారు. ఇలా పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్లు మోసపోయారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈడీ, గెయిన్‌బిట్‌కాయిన్ వెబ్‌సైట్‌పై క్రిమినల్ కేసు ఫైల్ చేసింది. భరద్వాజ్‌తో మరో ఎనిమిది మందిపై కేసు పెట్టింది. దాదాపు 8000 మంది ఇన్వెస్టర్లు రూ.2000 కోట్ల ఫండ్స్‌ను కోల్పోయారు. మహారాష్ట్ర పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఈడీ ఈ కేసును దాఖలు చేసింది. పుణే పోలీసులు భరద్వాజ్‌ను, ఆయన సోదరుడు వివేక్‌ను అరెస్ట్ చేశారు. -
లాలూ కుటుంబానికి మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఆదాయపు పన్ను శాఖ మరో షాకిచ్చింది. ఢిల్లీ, పాట్నలోని కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తున్నట్టు పేర్కొంది. అంతేకాక లాలూ కూతురు మిసాభారతి, భర్త శైలేష్ కుమార్ ఆస్తులకు తుది అటాచ్మెంట్ ఆర్డర్‌ను జారీచేసింది. బినామి ఆస్తుల కేసు విచారణలో భాగంగా ఐటీ ఈ చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే లాలూ ప్రసాద్‌పై ఐటీ ఛార్జ్‌షీటు కూడా దాఖలు చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 5నే సౌత్ వెస్ట్ ఢిల్లీలోని బిజ్వాసాన్ ప్రాంతంలో మిసాభారతి ఫామ్‌హౌజ్‌ను ఈడీ అటాచ్ చేసింది. బినామి ఆస్తుల విచారణలో భాగంగా లాలూ భార్య రబ్రీదేవిని కూడా ఐటీ ఆగస్టులో విచారించింది.