
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో రియల్ ఎస్టేట్ సంస్థ ఐఆర్‌ఈవోకు చెందిన రూ.1,317 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర్టెరేట్(ఈడీ) తెలిపింది. ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ లలిత్ గోయెల్ సంబంధీకులకు చెందిన ఆస్తులు ఇందులో ఉన్నాయని వివరించింది.
ఇందులో వాణిజ్య స్థలాలు, ప్లాట్లు, నివాస భవనాలు, బ్యాంకు అకౌంట్లు ఉన్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. వాణిజ్య స్థలాలు, ప్లాట్లు, నివాస భవనాలు ఇస్తామంటూ కొనుగోలుదారులను మోసగించి వసూలు చేసిన మొత్తాన్ని పక్కదారి పట్టించినట్లు ఆరోపించింది. ఈ మేరకు గురుగ్రామ్, పంచ్‌కుల, లూథియానా, ఢిల్లీలోని పోలీస్‌స్టేషన్ల పరిధిలో 30 కేసులు నమోదై ఉన్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment