ఆర్సెలర్‌మిట్టల్‌కు మళ్లీ బ్రేక్‌! | Essar Steel shareholder seeks rejection of ArcelorMittal bid | Sakshi
Sakshi News home page

ఆర్సెలర్‌మిట్టల్‌కు మళ్లీ బ్రేక్‌!

Published Wed, May 8 2019 1:38 AM | Last Updated on Wed, May 8 2019 1:38 AM

Essar Steel shareholder seeks rejection of ArcelorMittal bid - Sakshi

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంతో వేలానికొచ్చిన ఎస్సార్‌ స్టీల్‌ చేజారిపోకుండా ఆ సంస్థ ప్రమోటర్లు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. బిడ్డింగ్‌లో దీన్ని దక్కించుకున్న ఆర్సెలర్‌మిట్టల్‌ సంస్థను తిరస్కరించాల్సిందిగా ఎస్సార్‌ స్టీల్‌లో మెజారిటీ వాటాలు ఉన్న ఎస్సార్‌ స్టీల్‌ ఆసియా హోల్డింగ్స్‌ (ఈఎస్‌ఏహెచ్‌ఎల్‌) .. తాజాగా నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆశ్రయించింది. ఎస్సార్‌ స్టీల్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఆర్సెలర్‌ మిట్టల్‌ ప్రమోటరు లక్ష్మి నివాస్‌ మిట్టల్‌ .. దివాలా తీసిన తన సోదరుల కంపెనీలతో సంబంధాలను దాచిపెట్టారని ఈఎస్‌ఏహెచ్‌ఎల్‌ ఆరోపించింది.

ఈ సంస్థలకు లక్ష్మి నివాస్‌ మిట్టల్‌ ప్రమోటరుగా ఉన్నందున ఎస్సార్‌ స్టీల్‌కు ఆర్సెలర్‌మిట్టల్‌ బిడ్‌ను తిరస్కరించాలని కోరింది. ఈ పిటీషన్‌పై వివరణ ఇవ్వాల్సిందిగా ఆర్సెలర్‌మిట్టల్‌ను ఆదేశించిన ఎన్‌సీఎల్‌ఏటీ తదుపరి విచారణను మే 13కు వాయిదా వేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement