ప్రకంపనలు సృష్టించిన జవాన్‌పై వేటు | Tej Bahadur Who Highlighted Govt Apathy Dismissed From Service | Sakshi

ప్రకంపనలు సృష్టించిన జవాన్‌పై వేటు

Apr 19 2017 2:55 PM | Updated on Jul 29 2019 5:53 PM

ప్రకంపనలు సృష్టించిన జవాన్‌పై వేటు - Sakshi

ప్రకంపనలు సృష్టించిన జవాన్‌పై వేటు

సరిహద్దుల్లో భద్రతా బలగాలకు సరైన ఆహార పదార్థాలు అందించడం లేదని సోషల్‌ మీడియా ద్వారా ఆరోపించిన దేశంలో కలకలం సృష్టించిన బీఎస్‌ఎఫ్‌ జవాను తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ను విధుల నుంచి తప్పించారు.

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో భద్రతా బలగాలకు సరైన ఆహార పదార్థాలు అందించడం లేదని సోషల్‌ మీడియా ద్వారా ఆరోపించిన దేశంలో కలకలం సృష్టించిన బీఎస్‌ఎఫ్‌ జవాను తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ను విధుల నుంచి తప్పించారు. ఆర్మీలో క్రమ శిక్షణ తప్పడంతోపాటు అతడు నిబంధనలకు విరుద్ధమైన ఎన్నో పనులు చేశాడనే ఆరోపణలు రుజువైనందున అతడిని విధుల నుంచి తొలగించినట్లు బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు తెలిపారు.

కాగా, ఈ విషయంపై తాను ఉన్నత న్యాయస్థానం ఆశ్రయిస్తానని తేజ్‌ బహదూర్‌ తెలిపాడు. నిజాలు బయటకు చెప్పాననే కక్షతో తనపై ఇలాంటి చర్యలు తీసుకున్నారని, తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని చెప్పాడు. హర్యానాలోని మహేంద్రఘడ్‌ జిల్లాకు చెందిన తేజ్‌ బహదూర్‌ 1996లో బీఎస్‌ఎఫ్‌లో చేరాడు. గత ఏడాది చివర్‌లో తమకు నాణ్యతలేని ఆహారం పెడుతున్నారంటూ సోషల్‌ మీడియా ద్వారా ఫిర్యాదు చేశాడు. ఇది పెద్ద ధుమారం రేగింది. దీంతో మధ్యంతర విచారణకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఆ విచారణ కమిటీ తమకు నివేదికను అందించిందని, అందులో పలు విషయాలు తెలిశాయంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్‌ రిజిజు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement