న్యూఢిల్లీ: బీఎస్‌ఎఫ్ జవాన్ల భోజనం విషయంలో సామాజిక మాధ్యమంలో వీడియో పెట్టి సంచలనం రేపిన జవాను తేజ్ బహదూర్ ఫేస్‌బుక్ స్నేహాలపై నిఘా సంస్థలు దృష్టిపెట్టాయి. తేజ్‌కు చెందిన పలు ఫేస్‌బుక్ ఖాతాల్లో 6 వేల మంది స్నేహితులుండగా అందులో 17 శాతం మంది పాక్‌వారని హోం శాఖ వర్గాలు చెప్పాయి.
తేజ్‌ను కలిసేందుకు ఆయన భార్య షర్మిలకు ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చింది. తన భర్త జాడ తెలియడం లేదంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు శుక్రవారం విచారించింది. తేజ్ నిర్బంధించలేదని, మరో బెటాలియన్ కు మార్చామని అడిషనల్ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.