
ఫిర్యాదు చేసినా బాబుపై కేసు పెట్టడం లేదు
హైకోర్టులో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడి పిటిషన్..కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేసినా గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. ‘ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారు..’ అంటూ చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు అడుసుమల్లి ప్రతాప్‌కుమార్ చిలకలూరిపేట పోలీసులకు గతనెల 10న ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేయలేదు. దీన్ని సవాలు చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యాన్ని మంగళవారం న్యాయమూర్తి విచారించి పత్రికలు, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఎలా ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు. అయినా ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా వర్తిస్తుందన్నారు.