విధుల నుంచి బర్తరఫ్ చేసిన రాష్ట్ర విజిలెన్స్ ఇనస్పెక్టర్ మానసి జెనా (ఫైల్)
భువనేశ్వర్: రాష్ట్ర విజిలెన్స్ ఇనస్పెక్టర్ మానసి జెనాను విధుల నుంచి బర్తరఫ్ చేసినట్లు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) సునీల్‌కుమార్ బన్సాల్ శుక్రవారం ప్రకటించారు. తోటి ఉద్యోగి ఆధ్వర్యంలో రూ.20 లక్షలు లంచం తీసుకుంటుండగా ఆమె ప్రత్యక్షంగా పట్టుబడ్డారు. విజిలెన్స్ వలలో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగిపై నమోదైన కేసును కొట్టి వేసేందుకు ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు ఆరోపణ.
అడిగినంత లంచం ఇవ్వకుంటే కఠిన క్రిమినల్ చర్యలు చేపడతామని నిందితుడిని బెదిరించారు. ఈ వ్యవహారంలో విజిలెన్స్ అంతర్గత వర్గం అధికారులు మానసి జెనాను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మే 14న ఆమెను అరెస్ట్ చేసి, జుడీషియల్ కస్టడీకి తరలించారు.
చదవండి: స్నేహితుని పెళ్లి.. మత్తు ఎక్కువై రైలుపట్టాలపై పడుకుని..
Comments
Please login to add a commentAdd a comment