
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు హైకోర్టులో ఊరట లభించింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 2019లో డబ్బు పంపిణీ చేశారంటూ ఎంపీ కవితకు ఆరు నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవి గురువారం తీర్పునిచ్చారు.