న్యూఢిల్లీ: సీబీఐ కోర్టు జడ్జి బీహెచ్ లోయా మృతిపై పునర్విచారణ జరపాల న్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. లోయాది సహజమరణమే అని ఏప్రిల్ 19న కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సమీక్షించాలని బాంబే లాయర్ల అసోసియేషన్ వేసిన పిటిషన్‌లో విచారణార్హమైన విషయాలేవీ లేవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం పేర్కొంది. ‘రివ్యూ పిటిషన్, దానికి సంబంధించిన పత్రాలన్నింటిని క్షుణ్నంగా పరిశీలించాం. పాత ఉత్తర్వుల్లో మార్పు చేయడానికి తగిన కారణం కనిపించలేదు’ అని బెంచ్ తెలిపింది. సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసును విచారిస్తున్న బీహెచ్ లోయా 2014, డిసెంబర్ 1న గుండెపోటుతో మరణించారు
Comments
Please login to add a commentAdd a comment