గజ్వేల్ రూరల్: ప్రజ్ఞాపూర్‌లోని ఆశాజ్యోతి కేంద్రానికి అదనపు నిధులు మంజూరు చేసి ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య హామీ ఇచ్చారు. మంగళవారం గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌ను ఆయన సందర్శించిన అనంతరం మాట్లాడుతూ ఆంధ్ర పాలనలో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆశాజ్యోతి కేంద్ర విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు.
ఆశాజ్యోతి కేంద్రం పదేళ్లుగా ఎయిడ్స్ రోగులకు సేవలందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి సంస్థను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలో ఆశాజ్యోతి కేంద్రం ఉన్నందున, సీఎంతో చర్చించి నిధులు విడుదలైయ్యే విధంగా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆశాజ్యోతి కేంద్రంలోని చిన్నారులను ఆదుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.
ఈ సందర్భంగా ఆశాజ్యోతి డెరైక్టర్ ఆల్విన్ సంస్థకు సహాయ సహకారాలు అందించాలని ఉప ముఖ్యమంత్రికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పద్మ, నగర పంచాయతీ చైర్మన్ భాస్కర్, హెల్త్ డెరైక్టర్ సూర్యప్రకాశ్, సుపీరియర్ ఫాదర్ ఫెలిక్స్, కోఆర్డినేటర్ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
‘ఆశాజ్యోతి’కి వెలుగునిస్తాం!
Published Wed, Aug 6 2014 2:30 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM
Advertisement
Advertisement