'ఎవరైనా వేలు పెడితే రౌద్ర శంకరుడిని అవుతా' | i will not compromise for my constituency, warns rajaiah | Sakshi
Sakshi News home page

'ఎవరైనా వేలు పెడితే రౌద్ర శంకరుడిని అవుతా'

Published Tue, Feb 17 2015 5:35 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

'ఎవరైనా వేలు పెడితే రౌద్ర శంకరుడిని అవుతా' - Sakshi

'ఎవరైనా వేలు పెడితే రౌద్ర శంకరుడిని అవుతా'

వరంగల్: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం విషయంలో ఏ ఒక్కరూ వేలు పెట్టినా సహించబోనని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య హెచ్చరించారు. తాను భోళాశంకరుడని ఎవరైనా అనుకుంటే పొరపాటే అవుతుందన్నారు. తన నియోజకవర్గంలో ఏ ఒక్కరు వేలు పెట్టినా రౌద్ర శంకరుడినవుతానని రాజయ్య తెలిపారు. గత మూడు రోజుల క్రితం కూడా రాజయ్య ఇవే హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే.

 

కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో అధికార పార్టీని, ఎమ్మెల్యే పదవిని తెలంగాణ ఉద్యమంలో త్యాగం చేశాని సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అధినేత కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement