కేసీఆర్.. నా తండ్రిలాంటి వారు! | kcr is like my father, says deputy cm rajaiah | Sakshi
Sakshi News home page

కేసీఆర్.. నా తండ్రిలాంటి వారు!

Published Thu, Sep 11 2014 2:47 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

కేసీఆర్.. నా తండ్రిలాంటి వారు! - Sakshi

కేసీఆర్.. నా తండ్రిలాంటి వారు!

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తనకు తండ్రిలాంటి వారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఒకవేళ తాము ఏదైనా పొరపాట్లు చేస్తే.. మందలించేందుకు సర్వాధికారాలు కేసీఆర్కు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆదరాబాదరాగా ప్రకటనలు చేయొద్దని ఆయన తమకు చెప్పడంలో ఏమాత్రం తప్పులేదని రాజయ్య అన్నారు.

ఒక తండ్రిలాగే సీఎం చంద్రశేఖర్ రావు తమకు దిశా నిర్దేశం చేస్తున్నారని తెలిపారు. వరంగల్ సంఘటనను కొంతమంది అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ దళిత పక్షపాతి అని, తనకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే, అది ఆయన పెట్టిన భిక్షేనని రాజయ్య అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement