'గోడ మీద పిల్లిలా ప్రతిపక్ష నాయకులు ...' | telangana deputy cm rajaiah slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

'గోడ మీద పిల్లిలా ప్రతిపక్ష నాయకులు ...'

Published Mon, Jun 23 2014 10:32 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

'గోడ మీద పిల్లిలా ప్రతిపక్ష నాయకులు ...' - Sakshi

'గోడ మీద పిల్లిలా ప్రతిపక్ష నాయకులు ...'

వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సామాజిక న్యాయం సాధ్యం అవుతుందని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టి హామీలన్నీ నెరవేరుస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఎవరి తాటాకు చప్పుళ్లకు తాము బెదరమని.... బంగారు తెలంగాణ కోసం పని చేస్తామని రాజయ్య అన్నారు. ప్రతిపక్ష నాయకులు గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. నిబంధనలకు విరుద్దంగా తెచ్చిన పోలవరం ప్రాజెక్ట్ ఆర్డినెన్స్ను తక్షణమే రద్దు చేయాలని రాజయ్య డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement