'కేసీఆర్ వైఫల్యం వల్లే తెలంగాణ ఆదాయం తగ్గింది' | former minister balaram nayak condemned rajaiah comments over sonia gandhi | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ వైఫల్యం వల్లే తెలంగాణ ఆదాయం తగ్గింది'

Published Sun, Nov 30 2014 2:43 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

'కేసీఆర్ వైఫల్యం వల్లే తెలంగాణ ఆదాయం తగ్గింది' - Sakshi

'కేసీఆర్ వైఫల్యం వల్లే తెలంగాణ ఆదాయం తగ్గింది'

హైదరాబాద్:ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం టి.రాజయ్య చేసిన వ్యాఖ్యలను కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఖండించారు. సోనియా గాంధీ గురించి రాజయ్య తెలిసీ తెలియక అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన బలరాం నాయక్.. తెలంగాణలో ఆత్మహత్యలు జరగకూడదనే సోనియా పార్టీకి జరిగే నష్టాన్ని కూడా లెక్కచేయకుండా రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు.  తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు సోనియానే కారణమన్న రాజయ్య వ్యాఖ్యల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చితే తెలంగాణకు రావాల్సిన ఆదాయం తగ్గిందన్నారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యమేనన్నారు. ఆచరణ సాధ్యం కాని పలు హామీలను ఇవ్వడం వల్లే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని బలరాం నాయక్ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement