'కేసీఆర్కు తప్ప ఎవరికీ తెలియదు'
హైదరాబాద్ : వరంగల్ పార్లమెంట్ స్థానానికి టీఆర్ఎస్ తరఫు నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది ముఖ్యమంత్రి కేసీఆర్కు తప్ప మరోనేతకు తెలియదని మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య అన్నారు. ఆయన మంగళవారమిక్కడ అసెంబ్లీ లాబీలో విలేకర్లతో మాట్లాడుతూ అయితే స్థానికులకే పార్టీ టికెట్ ఇవ్వాలనే వాదన టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉందన్నారు.
డిప్యూటీ సీఎం పదవిని కోల్పోవడంతో తనపై రాష్ట్రవ్యాప్తంగా అన్నివర్గాల ప్రజల్లో సానుభూతి ఉందన్నారు. ఈ కారణంగానే తాను కాంగ్రెస్, బీజేపీ నుంచి వరంగల్ ఉప ఎన్నికల బరిలోకి దిగుతాననే ప్రచారం జరుగుతోందని అన్నారు. అయితే తాను మాత్రం టీఆర్ఎస్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడనాడేది లేదని రాజయ్య స్పష్టం చేశారు. కాగా వామపక్షాల తరఫున గాలి వినోద్ కుమార్ ...వరంగల్ ఎంపీగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.