ప్రాజెక్టులను త్వరగా ముగించండి | Finish projects quickly | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులను త్వరగా ముగించండి

Published Sun, Nov 16 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

Finish projects quickly

అసెంబ్లీలో ప్రస్తావించిన పలువురు సభ్యులు   కల్వకుర్తి, రాజీవ్, ఇందిరా దుమ్ముగూడెం ప్రాజెక్టుల పూర్తికి వినతి నిజాం షుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవాలి  జీరో అవర్‌లో వివిధ సమస్యలు లేవనెత్తిన ఎమ్మెల్యేలు
 
హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేయాలని అసెంబ్లీలో సభ్యులంతా ప్రభుత్వాన్ని కోరారు.  మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, ఖమ్మం జిల్లాలోని రాజీవ్‌సాగర్, ఇందిరా దుమ్ముగూడెం ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తే లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ఆయా పక్షాల ఎమ్మెల్యేలు పేర్కొన్నా రు. మునుపెన్నడూ లేని విధంగా జీరో అవర్‌లో 27మంది సభ్యులు మాట్లాడారు. తమ తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ పాటలు, పద్యాల రూపంలో కళాకారుల సమస్యలను ఎలుగెత్తారు. ఎమ్మెల్యే సున్నం రాజయ్య కోయభాషలో మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది. ఇక టీఆర్‌ఎస్ బ్లాక్‌లో కూర్చొని మాట్లాడిన తమ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌పై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్య తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క స్పీకర్‌ను కోరారు.
 
అధికారపక్షం వైపు ఉండటమే సాక్ష్యం: భట్టిhttp://img.sakshi.net/images/cms/2014-11/41416076660_Unknown.jpg

సభలో టీఆర్‌ఎస్ బ్లాక్‌లో కూర్చొని   రెడ్యానాయక్ మాట్లాడిన వెంటనే కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ‘సభ్యులకు సీట్ల కేటాయింపులు జరగకున్నా బ్లాక్‌ల కేటాయింపు మాత్రం జరిగింది. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన రెడ్యానాయక్ టీఆర్‌ఎస్‌కు కేటాయించిన బ్లాక్‌లో కూర్చున్నారు. దీన్నే సాక్ష్యంగా పరిగణించి పార్టీ ఫిరాయింపుల చట్టం మేరకు చర్యలు తీసుకోవాలి’ అని స్పీకర్‌ను కోరారు. మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. ‘ఇంకా సీట్ల కేటాయింపు జరగలేదు. ఇప్పుడున్న ప్రకారం సీట్లు ఉంచాలా? లేక నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడే 153 సీట్లను ఉంచాలా? అన్న దానిపై అన్ని పక్షాలతో మాట్లాడి నిర్ణయం చేస్తాం’ అని బదులిచ్చారు. అయితే ప్రతిపక్ష నేతలు అభ్యంతరం చెప్పారు.
 
http://img.sakshi.net/images/cms/2014-11/51416076889_Unknown.jpgకోయభాషలో మాట్లాడిన రాజయ్య

రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టులను ప్రస్తావించిన సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య వాటిని త్వరితగతిన పూర్తి చేయాలంటూ కోయ భాషలో మాట్లాడటంతో సభలో నవ్వులు విరిశాయి. ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసి సాగుకు నీరిచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. దీనిపై బదులిచ్చేందుకు మంత్రి హరీశ్ లేవగానే, మంత్రి సైతం కోయ భాషలో సమాధానం చెప్పాలని కాంగ్రెస్, బీజేపీ సభ్యులు వ్యాఖ్యానించడంతో అంతా గొల్లుమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా రాజీవ్, ఇందిరా దుమ్ముగూడెం ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. దీనిపై జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాలని సూచించారు.
 
రామజోగులు, దాసరులను కులాలుగా గుర్తించాలిhttp://img.sakshi.net/images/cms/2014-11/41416076956_Unknown.jpg

 రామజోగుల సమస్యలను ప్రస్తావిస్తూ ‘హరిశ్చంద్ర పద్యనాట కం చెదలు పట్టింది..’ అంటూ టీఆర్‌ఎస్ సభ్యుడు రసమయి బాలకిషన్ పాట ఆలంకించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘రామజోగులు, దాసరులు, బేలజంగాల వంటి కళాకారులను ఆదుకోవాలి. వారి వారసత్వ సంస్కృతిని కాపాడాలి. వారిని ఓ కులంగా గుర్తించాలి’ అని విజ్ఞప్తిచేశారు. ఇక కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని కాంగ్రెస్ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి కోరారు. బీజేపీ సభ్యుడు రాజాసింగ్ లోథ్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో అనేక రాష్ట్రాల వారు చాలా ఏళ్లుగా ఉంటున్నారు. స్థానికులు కాదంటూ  కార్డులు ఇవ్వడం లేదు. హిందీ మాట్లాడే వారిపై దాడులు, గుండాగిరీ చేస్తున్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలి’ అని కోరారు.
 
సభ్యులు ప్రస్తావించిన ఇతర అంశాలు

 
►బోధన్‌లోని నిజాంషుగర్ ఫ్యాక్టరీని స్వాధీ నం చేసుకోవాలి - జి.చిన్నారెడ్డి, కాంగ్రెస్
►ఖమ్మంలో ఎన్‌ఎస్‌పీ కెనాల్ పరిధిలో రెండువేల మంది పేదల గుడిసెలను తొల గించారు. ప్రభుత్వం తగిన ఆసరా చూపాలి. పట్టణపేదలకు నివాస స్థలాలు చూపించాలి.     - పువ్వాడ అజయ్, కాంగ్రెస్
►మహబూబ్‌నగర్‌కు మంచినీరు అందడం లేదు.ఈ దృష్ట్యా శాశ్వత మంచినీటి పథకాన్ని ప్రభుత్వం చేపట్టాలి. మన్నెంకొండను యాదగిరిగుట్ట తరహాలో అభివృద్ధి పరచాలి.
      -  శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్
 ►  అదనపు బాధ్యతల వల్ల వాటర్ వర్క్స్ ఎండీ తన కార్యాలయంలో అందుబాటులో ఉండటం లేదు. ఆయన కార్యాలయంలో ఉండేలా ప్రభుత్వం చొరవ చూపాలి.
     - ముంతాజ్‌ఖాన్, ఎంఐఎం
►  ఉప్పల్‌లోని బగాయత్ భూములను  అభివృద్ధి పరిచి పేదలకు ఇప్పించేలా ప్రభుత్వం చూడాలి.     - ఎన్‌వీవీఎస్ ప్రభాకర్, బీజేపీ
►  దుబ్బాక నియోజకవర్గంలో ఊరకుక్కలను అరికట్టాలి. కోతులు, అడవి పందుల కారణంగా పంటలు నాశనమవుతున్నాయి. రైతులకు సోలార్ పవర్ ఫెన్సింగ్‌ను సబ్సిడీపై ఇచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి.
     -  సోలిపేట రామలింగారెడ్డి, టీఆర్‌ఎస్
►  ఆత్మకూరుమండల పరిధిలోని కాల్వల పనులను  పూరిచేయాలి - సునీత, టీఆర్‌ఎస్
►  ఎస్‌ఆర్‌ఎస్‌పీ వరద కాల్వ నిర్మాణం పూర్తయినా ప్రజలకు సాగునీరు అందించడం లేదు. ఆసిఫ్‌నహర్ కాల్వ పనులను పూర్తి చేయండి.    - గ్యాదరి కిశోర్, టీఆర్‌ఎస్
►  బాల్కొండ నియోజకవర్గ సాగునీటి అవసరాలకు  ఎస్సారెస్పీ నుంచి 5 టీఎంసీల నీటిని కేటాయించాలి.     -ప్రశాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్
►  దీపం పథకం కింద  సబ్సిడీ నిధులను విడుదల చేయాలి.     - మోజంఖాన్, ఎంఐఎం
►  ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60కి పెంచండి. ఉద్యోగ అర్హత వయసునూ  పెంచాలి.     - రవీంద్రకుమార్, సీపీఐ
►  డోర్నకల్‌లోని శ్రీకురవి వీరభద్రస్వామి  దేవాలయానికి సంబంధించిన పనులను పూర్తి చేయాలి.     - రెడ్యానాయక్, ఎమ్మెల్యే
►  ఆర్మూర్ కేంద్రంగా ప్రపంచానికి పసుపును అందిస్తున్నా ఇక్కడ బోర్డుగానీ, శుద్ధి కర్మాగారంగానీ లేవు. కనీస మద్దతు ధర  అందడం లేదు.    -  జీవన్‌రెడ్డి, టీఆర్‌ఎస్
►  అంబర్‌పేటలోని 6వ నంబర్ చౌరస్తాలో ని ఫ్లైవోవర్‌ని నిర్మాణ పనులు వేగిరం చేయాలి.
      - జి.కిషన్‌రెడ్డి, బీజేపీ
►  ఖాజీపేట జంక్షన్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వ్యాగన్ నిర్మాణ కార్మాగారాన్ని వేగిరం చేయాలి.
 - వినయ్‌భాస్కర్, టీఆర్‌ఎస్
► ఆదిలాబాద్‌లో గిరిజన యూనవర్సిటీని ఏర్పాటు చేయాలి.  - రేఖానాయక్, టీఆర్‌ఎస్
►  వైరా నియోజకవర్గంలోని సాగునీటికి అనేక ఇబ్బందులు ఉన్నాయి. వాటిని వెంటనే పరిష్కారించి అక్కడి పంటలకు నీరివ్వాలి.
 - మదన్‌లాల్, ఎమ్మెల్యే
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement