ఇతర రాష్ట్రాల ఐక్యత ఇక్కడేది?
విపక్షాలపై మంత్రి కేటీఆర్ విమర్శ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులపై విపక్షాలకు చిత్తశుద్ధి లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ఏకమై నీళ్ల కోసం కొట్లాడుతుంటే, మన రాష్ట్రంలో అడ్డుకుంటున్నారన్నారు. శనివారం అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు న్యాయస్థానాల్లో తప్పుడు కేసులు వేస్తున్నారని ఆరోపించారు. కేసులు వేస్తున్న విషయాన్ని సభలోనే సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒప్పుకున్నారన్నారు. కోర్టు కేసులు, ఇతర అవాంతరాల కారణంగా ప్రాజెక్ట్ లు ఆలస్యం అవుతున్నాయన్నారు. అయినప్పటికీ వీలైనన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తే ఆ జిల్లా విపక్ష ఎమ్మెల్యేలు సంతోషించాల్సింది పోయి విమర్శి స్తున్నా రన్నారు. విపక్షాలు అడిగిన వాటికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పం దిస్తున్నారని, ఆయనకున్న ఔదార్యం ప్రతిపక్ష సభ్యులకు లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏదైనా మంచి జరిగితే దానిని గురించి సీఎం ప్రస్తావిస్తున్నారని, ప్రతిపక్షాలు మాత్ర ప్రభుత్వం చేస్తున్న మంచిని అంగీకరించేందుకు సిద్ధపడడం లేదన్నారు.