
'నీళ్లు, నిధులను ఆంధ్రావాళ్లకు దోచి పెట్టారు'
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ పొన్నాల నీళ్లు, నిధులను ఆంధ్రావాళ్లకు దోచి పెట్టారని ఆరోపించారు. మంత్రిగా పొన్నాల ఆంధ్రాకే న్యాయం చేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని రాజయ్య అన్నారు. రూ.19వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేశారన్నారు.
నిరుపేదలకు భూములను పంచుతున్నారని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి...తెలంగాణలో అదనంగా ఎకరం కూడా సాగులోకి తేలేదని రాజయ్య అన్నారు. హెల్త్ యూనివర్శిటీకి వరంగల్లో ఎక్కువ భూములున్నాయన్నారు. ఇక కేసీఆర్ తనపై చేసిన మాటలను వ్యక్తిగతంగా చూడవద్దని రాజయ్య అన్నారు. కేసీఆర్ తనకు తండ్రిలాంటివారని ఆయన పేర్కొన్నారు.