సాక్షి, హైదరాబాద్: ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు త్వరలోనే శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలను వివరించడంతో పాటు మరికొన్ని అంశాలను ఈ సందర్భంగా అవగాహన కల్పించాలనేది సీఎం భావనగా ఉంది. సచివాలయంలో సోమవారం డిప్యూటీ సీఎం రాజయ్య, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డిలతో వివిధ అంశాలపై సీఎం చర్చించారు. ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమం ప్రస్తావన వచ్చింది.