
ఎవరొచ్చినా చేర్చుకుందాం..!
- టీడీపీ తెలంగాణ నేతల నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి ముఖేశ్‌గౌడ్,, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య వంటివారు ఎవరు వచ్చినా చేర్చుకుని తెలంగాణలో పార్టీ బలం గా ఉందన్న సంకేతాలు పంపాలని టీటీడీపీ భావిస్తోంది. అసెంబ్లీలోని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కార్యాలయంలో గురువారం పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, టీడీఎల్‌పీ ఉపనేత ఎ.రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ నర్సారెడ్డి, సీనియర్ నేతలు ఉమా మాధవరెడ్డి, మండవ వెంకటేశ్వర్‌రావు, సి. కృష్ణాయాదవ్, ఇ.పెద్దిరెడ్డి తదితరులు సమావేశమయ్యారు.
తలసాని శ్రీనివాస్‌యాదవ్, కడియం శ్రీహరిల రాజీనామాలతో ఖాళీ అయ్యే సనత్‌నగర్ అసెంబ్లీ, వరంగల్ పార్లమెంటు స్థానాల్లో పోటీకి దిగాలనే యోచనలో ముఖేశ్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య టీడీపీలోకి రావచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీటీడీపీ నేతలు భేటీ అయ్యారు. అయితే, సనత్‌నగర్‌లో కూన వెంకటేశ్ గౌడ్ ఇప్పటికే ప్రచారం కూడా చేసుకుంటున్నారని, ఇప్పుడు ముఖేశ్‌ను తీసుకొచ్చి టిక్కెట్టు ఇస్తే పార్టీ మీద విశ్వాసం పోతుందని నగర నేత ఒకరు వ్యాఖ్యానించగా, అది చంద్రబాబు నిర్ణయమని ఇతర నాయకులు చెప్పినట్లు తెలిసింది.
టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్న నేపథ్యంలో ‘ఎవరి ఒత్తిళ్లు వారివి. పోవాలని నిర్ణయించుకున్న వారిని ఆపలేం.’ అని ఓ నాయకుడు వ్యాఖ్యానించినట్లు తెలి సింది. కార్యకర్తల్లో విశ్వాసం పెంచేం దుకు జిల్లాల్లో చంద్రబాబు పర్యటి స్తారని ఎర్రబెల్లి పేర్కొన్నట్లు తెలి సింది. బహిరంగసభలు లేకుండా కార్యకర్తలతోనే సమావేశం ఏర్పాటు చేయిస్తున్నట్లు ఆయన చెప్పారు.