కరీంనగర్ హెల్త్ : డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ రాజయ్య కరీంనగర్‌లోని ప్రధాన ఆస్పత్రిని తనిఖీ చేస్తుండగానే.. సిబ్బంది నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందింది. వివరాలు.. పెద్దపల్లి మండలం రాఘవపురానికి చెందిన వసంత పురిటినొప్పులతో అక్కడి పీహెచ్‌సీలో చేరింది. శుక్రవారం ఉదయం సాధారణ కాన్పులో మగశిశువుకు జన్మనిచ్చింది.
రక్తస్రావం ఎక్కువై పరిస్థితి విషమించడంతో సిబ్బంది 108లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వసంత మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ఆ సమయంలో మంత్రి ఆస్పత్రిలోనే ఉండటంతో మృతదేహాన్ని ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే అంబులెన్స్‌లో తరలించారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని మంత్రి తెలిపారు.
డిప్యూటీ సీఎం తనిఖీ చేస్తుండగానే.. బాలింత మృతి
Published Sat, Oct 18 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM
Advertisement
Advertisement