staff negligence
-
వరంగల్ ఎంజీఎం.. పెద్దాసుపత్రిలో బయటపడ్డ నిర్లక్ష్యం
-
వరంగల్ ఎంజీఎం: స్ట్రెచర్ ఇవ్వలేదని భార్యను మోసుకెళ్లాడు
సాక్షి, వరంగల్: అతిపెద్ద ప్రభుత్వాసుపత్రిగా పేరున్న ఎంజీఎంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియజేసే మరో ఘటన వైరల్ అవుతోంది. వృద్ధురాలైన ఓ పేషెంట్ పట్ల నిర్లక్ష్యంగా సమాధానాలిచ్చిన ఆస్పత్రి సిబ్బంది.. ఆపై కర్కశకంగా వ్యవహరించారు. కనీసం స్ట్రెచర్ కూడా ఇవ్వకపోవడంతో ఆమె భర్తే భుజాన వేసుకుని మోసుకెళ్లాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన లక్ష్మి అనే వృద్ధురాలికి నెల కిందట ఎంజీఎం డాక్టర్లు ఆపరేషన్ చేసి అరిపాదం తొలగించారు. నెల తర్వాత లక్ష్మిని చెకప్ కోసం ఆస్పత్రికి తీసుకొచ్చారు ఆమె భర్త. అయితే పెద్దసారు(కన్సల్ట్ డాక్టర్) లేరని, రేపు రావాలంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. బయటకు వెళ్లేందుకు కనీసం స్ట్రెచర్ అయినా ఇవ్వాలని ఆయన కోరగా.. సిబ్బంది అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో లక్ష్మిని ఇలా ఆమె భర్త భుజాలపైకి ఎక్కించుకుని బయటకు తీసుకొచ్చారు. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీయడం, వాట్సాప్ తదితర సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేడయంతో వైరల్ అయ్యింది. గతంలో ఇదే ఎంజీఎం ఆస్పత్రికి సంబంధించిన పలు వ్యవహారాలు వెలుగులోకి వచ్చి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసే ఉంటుంది. అయినా పేషెంట్లకు అందుతున్న ట్రీట్మెంట్ మాత్రం మెరుగుపడడం లేదన్న విమర్శ ఇప్పటికీ వినిపిస్తోంది. ఇక ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ స్పందించారు. ‘‘ఎంజీఎంలో స్ట్రెచ్చర్ల కొరత లేదు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించ లేదు. ఎవరో కావాలని ఎంజీఎంను బద్నాం చేసేందుకే భుజాలపై పేషెంట్ ను తీసుకుపొమ్మని ఆ పెద్దాయనకు చెప్పి వీడియో ను వైరల్ చేశారు. వీడియో తీసి అతనిపై కేసు పెడతాం. ఒకవేళ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటాం అని తెలిపారాయన. అయితే.. ఆ పెద్దాయన మాత్రం ఎండలో తన భార్యను అలా వదిలేశారని, సిబ్బందిని స్ట్రెచర్‌తో రమ్మంటే రాలేదని, అందుకే తానే మోసుకొచ్చానని స్పష్టంగా చెబుతున్నారు. -
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో సిబ్బంది నిర్లక్ష్యం
-
తుంగతుర్తిలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం
-
కాళ్లు మొక్కుతం, కనికరించండన్నా.. పట్టించుకోలేదు!
‘సారూ..బిడ్డ పురిటినొప్పులతో బాధపడ్తోంది..ఆ గోస సూడలేకపోతున్నం.. బాంచెన్.. ఆపరేషన్ జేయుండ్రి.. మీ కాళ్లు మొక్కుతం..కనికరం సూపుండ్రి..’అని కాళ్లుపట్టుకుని వేడుకున్నా వైద్యులు, సిబ్బంది పట్టించుకోలేదు. పండంటి బిడ్డ పుట్టబోతుందని ఆశపడ్డ ఆ తల్లికి వైద్యులు సిజేరియన్ చేసి చనిపోయిన శిశువును చేతిలో పెట్టడంతో నిరాశ ఎదురైంది. మెట్పల్లి(కోరుట్ల): జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన ఎర్రబోయిన అశోక్ భార్య సుజాత(22)కు ఇటీవలే నెలలు నిండాయి. తొలికాన్పు కావడంతో ఈనెల 19న మెట్‌పల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు పురిటినొప్పులు మొదలయ్యాయి. అయితే, సాధారణ ప్రసవం కోసం మరుసటిరోజు సాయంత్రం వరకూ వైద్యసిబ్బంది ప్రయత్నం చేశారు. ప్రసవం కాకపోవడంతో సిజేరియన్ చేయాలని, లేదంటే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తామని కుటుంబసభ్యులు వేడుకున్నారు. సిబ్బంది అంగీకరించకపోగా, కుటుంబసభ్యులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం వరకూ పురిటినొప్పులతో బాధపడ్తున్న సుజాతకు చివరికి వైద్యులు సిజేరియన్ చేశారు. అయితే.. అప్పటికే కడుపులో బిడ్డ చనిపోయింది. దీంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే బిడ్డ చనిపోయిందని కుటుంబసభ్యులు ఆపరేషన్ థియేటర్ వద్ద ఆందోళనకు దిగారు. తర్వాత జాతీయ రహదారిపై బైఠాయించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని బాధ్యులైన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు. ఈ విషయంపై ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ సాజిద్‌ను¯ ఆరాతీయగా..సుజాతకు ఈనెల 21న ప్రసవం చేయాల్సి ఉందన్నారు. అప్పటిదాకా సాధారణ ప్రసవం కోసం యత్నించామని తెలిపారు. వీలుకాకపోవడంతో సిజేరియన్ చేశామని, మృతశిశువు జన్మించిందని, ఇందులో సిబ్బంది పొరపాటు ఏమీలేదని స్పష్టం చేశారు. -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి!
కర్నూలు, ఆదోని: ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. ఒకవైపు సౌకర్యాల లేమి, మరోవైపు సిబ్బంది నిర్లక్ష్యం వెరసి రోగులకు శాపంగా మారుతున్నాయి. ఆదోని ప్రభుత్వాసుపత్రిలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం పోయింది. ఆస్తమాతో బాధపడుతూ మంగళవారం ఆసుపత్రిలో చేరిన శివమ్మ(40)కు సకాలంలో ఆక్సిజన్ ఇవ్వకపోవడంతో మృతిచెందింది. సిలిండర్‌లో ఆక్సిజన్ అయిపోయిందని, వెంటనే మార్చాలని డ్యూటీ నర్సు వద్ద మొరపెట్టుకున్నా స్పందించలేదని, దీనివల్లే శివమ్మ చనిపోయిందని కుటుంబ సభ్యులు వాపోయారు. మృతురాలి అన్న వీరేష్, భర్త మహాదేవ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదోని మండలం పెద్దహరివాణంకు చెందిన శివమ్మ ఆస్తమా బాధితురాలు. మంగళవారం ఊపిరి తీసుకోవడం చాలా కష్టమైంది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆదోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఉదయం 10 గంటలసమయంలో ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షించిన వైద్యుడు ఇంజెక్షన్ ఇచ్చి.. ఫ్లూయిడ్స్ ఎక్కించాలని, ఆక్సిజన్ కూడా పెట్టాలని కేస్‌షీట్‌లో రాశారు. ఈ మేరకు డ్యూటీ నర్సు చికిత్స ప్రారంభించారు. కాసేపటి తర్వాత పేషెంట్‌కు ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే కుటుంబ సభ్యులు సిలిండర్ మీటరు చూసి ఆక్సిజన్ అయిపోయిందని నిర్ధారించుకుని నర్సు వద్దకు వెళ్లి చెప్పారు. ఆక్సిజన్ అయిపోయిందో, లేదో చెప్పడానికి మీరేమైనా డాక్టర్లా? అంటూ నర్సు చీదరించుకున్నారు. వచ్చి చూడాలని ప్రాధేయపడినా పట్టించుకోలేదు. పేషెంట్ పరిస్థితి విషమిస్తుండడంతో డ్యూటీ డాక్టరు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్ చేయగా.. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అందరూ చూస్తుండగానే మధ్యాహ్నం రెండు గంటల సమయంలో శివమ్మ తుది శ్వాస వదిలింది. ఈమెకు భర్త, నలుగురు ఆడ కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహంతో ఆందోళన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంధువులు ఆసుపత్రి వద్ద శివమ్మ మృతదేహంతో ఆందోళనకు దిగారు. డీవైఎఫ్ఐ నాయకులు తాహెర్ అలీ, వీరేష్, తిక్కప్ప మరికొందరు మద్దతుగా పాల్గొన్నారు. గంటకు పైగా ఆందోళన నిర్వహించినా ఎవరూ స్పందించలేదు. దీంతో మృతదేహాన్ని తీసుకుని రోడ్డుపైకి వచ్చారు. అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వన్‌టౌన్ ఎస్ఐ రమేష్ వచ్చి వారితో చర్చించారు. రోడ్డుపై ఆందోళన చేయడం తగదని, ఆసుపత్రి వద్దకు వెళ్లాలని సూచించారు. ఇందుకు ఆందోళనకారులు సమ్మతించారు. తిరిగి ఆసుపత్రి వద్ద అర గంట ఆందోళన చేపట్టినా ఎవరూ పట్టించుకోకపోవడంతో మళ్లీ రోడ్డుపైకి వచ్చారు. ఈ సందర్బంగా ఎస్ఐ, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. డాక్టర్ పద్మకుమార్ వారితో చర్చించేందుకు యత్నించారు. అయితే సూపరింటెండెంట్ రావాలని డిమాండ్ చేశారు. సాయంత్రం 6.30 గంటలకు సూపరింటెండెండ్ లింగన్న వచ్చి చర్చించారు. సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం ఉంటే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. -
బిడ్డా.. ఎక్కడ!
కళ్లన్నీ కన్నీళ్లు చేసుకుని కన్నవారి ఎదురుచూపులు ముందుకు సాగని పోలీసుల దర్యాప్తు సిబ్బంది నిర్లక్ష్యమే అపహరణకు కారణమని విమర్శలు కిలాడీ లేడీ కోసం ముమ్మరంగా దర్యాప్తు పలుగు వేసి పేగు పెకిలించుతున్నట్లు పొత్తి కడుపులో బాధ మెలిపెడుతుంటే.. అంతులేని ఆవేదనను మునిపంటి కింద బిగబట్టి బిడ్డకు పురుడు పోసింది. పట్టుమని పది రోజులైనా కాకుండానే మురిపాలకు దూరమైన బిడ్డను తలుచుకుని ఆ తల్లిదండ్రుల గుండె నీరుగారింది. అడిగో బిడ్డ.. అంటూ కన్నపేగుకు ఆశలు కల్పించిన సీసీ కెమెరా ఫుటేజ్.. 24 గంటలు గడవకుండానే తప్పని తేలడంతో వారి ఆందోళన రెట్టింపైంది. కన్న బిడ్డ కోసం కళ్లన్నీ కన్నీళ్లు చేసుకుని.. కనిపించిన ప్రతి ఒక్కరినీ మా బిడ్డ ఎక్కడంటూ ఆ తల్లిదండ్రుల గుండె ఘోష ఆర్తిగా వేడుకుంటోంది. విజయవాడ (లబ్బీపేట) : చికిత్స కోసం వస్తే.. బిడ్డనే దూరం చేశారు.. ఇప్పుడు బిడ్డ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో.. అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో గురువారం అపహరణకు గురైన తమ బిడ్డను పోలీసులు ఎప్పుడు తీసుకొస్తారో అని నిస్సహాయ స్థితిలో వారు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. బస్టాండ్‌లో దొరికిన సీసీ కెమెరా విజువల్స్‌తో కీలక ఆధారాలు దొరికాయని, ఇక తమ బిడ్డ తమ చెంతకు చేరతాడని పెట్టుకున్న ఆశలు శుక్రవారం సాయంత్రానికి గల్లంతయ్యాయి. విజువల్స్ తప్పని తేలడంతో తమ బిడ్డ ఎప్పటికి తమ చెంతకు చేరతాడోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సిబ్బంది తీరును నిరసిస్తూ బంధువులతో కలిసి శిశువు తల్లిదండ్రులు ఆస్పత్రి ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఎలా ఎత్తుకెళ్లారనేదే ప్రశ్న... నవజాత శిశువులు చికిత్స పొందే స్పెషల్ న్యూ బోర్న్ బేబీ కేర్ యూనిట్లోకి సందర్శకులను ఎవరినీ అనుమతించరు. ఆ విభాగంలో చికిత్స పొందే చిన్నారులందరినీ, లోపల ఉన్న సిబ్బందే పర్యవేక్షించడం, మందులు వేయడం చేస్తుంటారు. అలాంటి విభాగంలోకి గుర్తుతెలియని మహిళ వెళ్లి శిశువును ఎలా అపహరించిందని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. అక్కడ వార్మర్లో ఉన్న పసిబిడ్డను తీసుకు వస్తున్న సమయంలో లోపల ఉన్న సిబ్బంది గమనించ కపోవడం వారి నిర్లక్ష్యాన్ని చాటుతోందని చెబుతున్నారు. స్పెషల్ కేర్‌లోని శిశువులకే రక్షణ లేకుంటే, వార్డుల్లోని శిశువుల పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో వార్డులో ఉన్న శిశువును అపహరించుకుపోయారని, ఇప్పుడు ఏకంగా ఎస్‌ఎన్‌సీయూలో శిశువునే అపహరించడం ఆస్పత్రి భద్రత డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. సిబ్బంది పాత్రపై అనుమానాలు ఎస్‌ఎన్‌సీయూలో పనిచేసే వారంతా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వారిలో శాశ్వత ఉద్యోగులెవరూ లేరు. పసిబిడ్డ అపహరణకు సంబంధించి ఇప్పటికే ఎస్ఎన్సీయూ వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యురిటీ గార్డు ముఖర్జీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇతర సిబ్బందిపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో తిరిగిన కిలాడీ లేడీ ఇంకా ఎవరితోనైనా సన్నిహితంగా మెలిగేదా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ విభాగం నుంచి సిబ్బంది సహకారం లేకుండా శిశువును అపహరించడం సాధ్యం కాదనే అంచనాకు వచ్చారు. మరోవైపు బాధితుల బంధువుల నుంచి సమాచారం ఏమైనా వస్తుందేమోనని ఏసీపీ కంచె శ్రీనివాసరావు వారిని శుక్రవారం విచారించారు. ఈ ఘటనలో నలుగురు వైద్యులు, 14 మంది ఆస్పత్రి సిబ్బంది వైఫల్యం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వారిపై వేటుపడే అవకాశమున్నట్లు సమాచారం. కలకలం రేపిన మృతదేహం.. పోలీసుల ఉరుకులు, పరుగులు ప్రభుత్వాస్పత్రి పక్కన ఉన్న రైవస్ కాల్వలో శుక్రవారం మధ్యాహ్నం మగశిశువు మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఉరుకులు పరుగులతో అక్కడికి చేరుకున్నారు. అపహరణకు గురైన బిడ్డ బంధువులకూ చూపించారు. అయితే ఆ మృతదేహం ఆస్పత్రిలో ప్రసవం అనంతరం మృతి చెందిన మరో శిశువుదిగా గుర్తించారు. ముందుకు సాగని దర్యాప్తు పసిబిడ్డ ఆచూకీ కోసం పది బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నా, దర్యాప్తు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. బస్టాండ్‌లో దొరికిన సీసీ కెమెరా విజువల్స్‌ను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం సాయంత్రం వరకు గాలింపు చేపట్టగా, అవి సరికాదని తేలడంతో మరో కోణంలో దర్యాప్తు చేయనున్నారు. ఆస్పత్రి మెయిన్ గేటు ఎదురుగా ఉన్న మందుల దుకాణంలో సీసీ కెమెరా ఉన్నప్పటికీ దానిలో విజువల్స్ క్లియర్‌గా లేవని పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా శిశువును క్షేమంగా పట్టుకుని తీసుకొస్తామని చెబుతున్నా.. సరైన ఆధారాలు లేకపోవడంతో శిశువు ఆచూకీ ఎప్పటికి దొరుకుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. -
మరో శిశువును మింగేసిన నిర్లక్ష్యం
గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఊడలు దిగిన నిర్లక్ష్య వటవృక్షపు వేళ్లు మరో శిశువు మెడకు ఉరితాడయ్యాయి. ప్రక్షాళన అంటే గోడలకు సున్నాలు వేయడం, చీపుళ్లు పట్టి ఊడవడం కాదు... ఆస్పత్రి సిబ్బంది, వైద్యుల మనసుల్లో పేరుకుపోయిన నిర్లక్ష్యాన్ని ఊడ్చిపారేయాలి... వారి మనసు తలుపులు తెరిచి సేవాదృక్పథాన్ని తట్టి లేపాలి. అప్పుడు గానీ జీజీహెచ్‌లో మృత్యుహేల అంతం కాదు... • జీజీహెచ్‌లో కొనసాగుతున్న మృత్యుహేల • బంధువుల ఆందోళన • సిబ్బంది వైఖరిలో మార్పు రావాలి • ప్రజాసంఘాల ఉద్ఘాటన గుంటూరు రూరల్: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల ఎలుకలు కొరికి చిన్నారి మృతి చెందిన సంఘటన రాష్ట్ర ప్రజలు మరువక ముందే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల సోమవారం మరో ముక్కు పచ్చలారని శిశువు కన్నుమూసింది. చిలకలూరిపేట మండలం తాతపూడికి చెందిన నూతలపాటి అనూష ఏడవ నెల గర్భిణి. స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా అక్కడ పరీక్షించిన వైద్యులు బిడ్డ పరిస్థితి బాగాలేదని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రిఫర్‌చేశారు. దీంతో ఉదయం 12 గంటలకు అనూష భర్త జాన్‌తో కలిసి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ఓపీ రాసిన వైద్యులు స్కానింగ్ తీయించుకోవాలని చెప్పగా, అక్కడినుంచి స్కానింగ్‌కు వెళ్లారు. స్కానింగ్ వద్ద సిబ్బంది లేకపోవటంతో మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే వేచి ఉన్నారు. స్కానింగ్ పూర్తయిన వెంటనే వైద్యుని వద్దకు వెళ్లగా అప్పటికే క్యూలో మరో 10 మంది ఉండటంతో కాన్పుల వార్డులో వేచి ఉండాలని సిబ్బంది సూచించారు. క్యూలో నిలబడిన అనూష సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నిలబడలేక కూలబడటంతో అనూష బంధువులు సిబ్బందిని నిలదీశారు. దీంతో సిబ్బంది వీల్ చైర్‌ను ఇవ్వగా, వీల్ చైర్లో కూర్చున్న అనూషకు ఉమ్మనీరు పూర్తిగా పోయింది.నొప్పులు తీవ్రమవడంతో సిబ్బంది అనూషను నడిపించుకుంటూ వార్డుకు తీసుకెళ్లారని ఈ క్రమంలో కాన్పు పూర్తవుతుండగా మంచంపై పడుకోబెట్టగానే ప్రసవించిందని బంధువులు తెలిపారు. ప్రసవం జరిగిన 10 నిమిషాలకు బిడ్డ మృతి చెందాడని వాపోయారు. సిబ్బంది సరైన సమయానికి స్పందించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని ఆరోపించారు. జీజీహెచ్‌లో ఇలాంటివి నిత్యకృత్యమయ్యాయి... జీజీహెచ్‌లో ఇటువంటి సంఘటనలు నిత్యకృత్యమయ్యాయని, కేవలం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ చాంబర్ వద్ద బాధితులతో కలిసి వారు ఆందోళన నిర్వహించారు. రెండు నెలల క్రితం ఇదేవిధంగా స్కానింగ్ రూం వద్ద వేచిచూస్తూ ఓ గర్భిణి ప్రసవించిందని, అయితే అప్పుడు అదృష్టవశాత్తూ చిన్నారి బతికిందన్నారు. వార్డులో వైద్యుల కోసం ఎదురుచూస్తూ వరండాలో సైతం అనేక కాన్పులు జరిగిన సంఘటనలు కోకొల్లలన్నారు. సిబ్బందిలో కొరవడిన సేవాదృక్పథం ప్రక్షాళన పేరుతో జిల్లా స్థాయి అధికారుల నుంచి కలెక్టర్ వరకూ వారం రోజులుగా సమావేశాలతో ఊదరగొడుతూనే ఉన్నా సిబ్బంది వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. ప్రక్షాళన అంటే గోడలకు సున్నాలు వేయటం, రోడ్లు రంగులు వేయటం కాదని ముందుగా సిబ్బంది, వైద్యులలో మార్పు వచ్చి సేవా దృక్పథంతో పనిచేసే రోజులు వచ్చేవరకూ ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయని ప్రజా సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు. అధికారులు ఇకనైనా స్పందించి సిబ్బంది, వైద్యులలో మార్పుకోసం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
గుంటూరు జీజీహెచ్‌లో మరో శిశువు మృతి
7 నెలల గర్భంతో 2 గంటలు క్యూలో నిలబడిన గర్భిణి నడిపిస్తుండగానే ప్రసవం.. బిడ్డ మృతి గుంటూరు : గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రి(జీజీహెచ్)లో సోమవారం మరో దుర్ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఏడు నెలల గర్భస్థ శిశువు మృతి చెందటంతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. బాధిత తల్లిదండ్రులు, బంధువుల కథనం మేరకు.. చిలకలూరిపేట తాతపూడికి చెందిన నూతలపాటి అనూష ఏడో నెల గర్భిణి. ఆదివారం నొప్పులు రావడంతో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఆరోజు అక్కడే ఉండిపోయారు. సోమవారం ఉదయం మళ్లీ నొప్పులు ఎక్కువవడంతో వైద్యులు సెలవులో ఉన్నారని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని సిబ్బంది సూచించారు. దీంతో అనూష భర్త జాన్, తల్లి మేరి ఆమెను జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓపీ రాయించుకుని వైద్యుని వద్దకు వెళ్లగా స్కానింగ్ పరీక్షలు రాశారు. 3 గంటలకు రిపోర్టు తీసుకుని వైద్యుని వద్దకు వెళ్లగా.. ‘నీ కంటే ముందుగా వచ్చిన రోగులు ఉన్నారు. లైనులో నిలబడాలి’ అని సిబ్బంది ఆమెకు సూచించారు. దీంతో రెండు గంటల పాటు లైనులో నిలబడిన అనూష 5 గంటల సమయంలో అక్కడే కుప్ప కూలిపోయింది. దీంతో సిబ్బంది హటాహుటిన వార్డులోనికి నడిపించుకుంటూ వెళుతుండగా అనూషకు డెలివరీ అయి, బిడ్డ మృతి చెందింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని బిడ్డ తల్లితండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బిడ్డ కేవలం 1.5 కిలోల బరువుతో జన్మించడం వల్లే ఇలా జరిగిందని వివరణ ఇచ్చారు. -
పురిటిపాట్లు!
రెండు గంటల పాటు ఆస్పత్రి ఆవరణలోనే గర్భిణి నిరీక్షణ గద్వాలలో ప్రసవం.. శిశువు మృతి గట్టు: పురిటినొప్పులతో సోమవారం రాత్రి ఆస్పత్రికి చేరుకున్న గర్భిణి.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రెండు గంటలపాటు నరకయాతన అనుభవించింది. బంధువులు వేరే ఆసుప త్రికి తరలించి కాన్పు చేసినా శిశువు ప్రాణాలను కాపాడలేకపోయారు.. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో చోటుచేసుకుంది. గట్టు మండలం రాయపురం గ్రామానికి చెందిన గోవిందమ్మకు సోమవారం రాత్రి పురిటినొప్పులతో బాధపడు తుండగా ఓ ప్రైవేటు వాహనంలో గట్టులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆస్పత్రిలో రెండుగంటలపాటు పురిటినొప్పుతో బాధపడుతున్న గోవిందమ్మకు సిబ్బంది కనీస వైద్య సహాయం కూడా అందించలేదు. దీంతో ఆస్పత్రి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు.. గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మంగళవారం తెల్లవారుజామున ఆడబిడ్డకు జన్మనివ్వగా పుట్టిన కొద్ది సేపటి తర్వాత శిశువు చనిపోయింది. -
రిమ్స్‌లో చిన్నారి మృతి
ఆదిలాబాద్ రిమ్స్ : సకాలంలో వైద్యం అందక ఐదేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన సోమవారం రిమ్స్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. రిమ్స్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే చిన్నారి చనిపోయిందుంటూ బంధువులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకెళ్తే.. బేల మండలం కొగ్ధూర్ గ్రామానికి చెందిన చంద్రకాంత్ తన కూతురు అక్షర (5)ను జ్వరంతో బాధపడుతుండగా ఆదివారం అర్ధరాత్రి రిమ్స్‌కు తీసుకొచ్చాడు. క్యాజువాలిటీ వైద్యుడు చూసి చిన్నపిల్లల వార్డులో అడ్మిట్ చేశారు. ఓ రెండు సెలైన్లు ఎక్కించి నర్సులు చేతులు దులుపుకున్నారని, పరిస్థితి విషమించినా సదరు వైద్యులకు సమాచారం అందించలేదని మృతురాలి తండ్రి ఆరోపించారు. రాత్రి నుంచి ఉదయం వరకు అదే పరిస్థితి ఉన్నా ఇక్కడి నర్సులే వైద్యం అందించారని, వైద్యులు మాత్రం రాలేదని అన్నాడు. సోమవారం ఉదయం 10 గంటలకు వచ్చిన సంబంధిత వైద్యుడు చిన్నారిని పరీక్షించిన అరగంటకే చనిపోయిందని చెప్పాడు. వైద్యులు సకాలంలో స్పందించకనే తమ కూతురు చనిపోయిందని ఆ తల్లిదండ్రులు రోదిస్తూ తెలిపారు. విషయం తెలుసుకున్న టూటౌన్ పోలీసులు రిమ్స్‌లో పెద్ద ఎత్తున మొహరించారు. అయితే.. తనకు రాత్రి సమాచారం అందిస్తే వచ్చి ఉండేవాడినని సంబంధిత వైద్యుడు పేర్కొన్నాడు. -
ప్రక్షాళన జరిగేనా..!
దుర్గగుడికి ‘కొత్త’కళ * ఏడాది తర్వాత పూర్తిస్థాయి ఈవో నియామకం * త్వరలోనే పాలక మండలి ఏర్పాటు * ఇంద్రకీలాద్రిపై అవినీతి అంతం చేయాలి.. * కాంట్రాక్టర్ల హవాను అడ్డుకోవాలని భక్తుల వినతి సాక్షి, విజయవాడ : ప్రతిష్టాత్మక దుర్గగుడికి కొత్తనీరు రానుంది. ఏడాది తర్వాత పూర్తిస్థాయి కార్యనిర్వహణ అధికారిని నియమించారు. చాలాకాలం అనంతరం దేవస్థానానికి పాలకమండలిని ఏర్పాటుచేయనున్నారు. ఈ క్రమంలో కొత్త పాలకమండలి, ఈవో సమన్వయంతో పనిచేస్తూ దుర్గగుడిలో నెలకొన్న అవి నీతిని ప్రక్షాళన చేయాల్సి ఉంది. కాంట్రాక్టర్ల హవాకు అడ్డుకట్ట వేయాలి. సిబ్బంది నిర్లక్ష్యం పైనా దృష్టి సారించి భక్తులకు మెరుగైన సేవలు అందేలా చూడాలి. పాలకమండలి చైర్మన్‌గా రంగప్రసాద్! బీజేపీ రాష్ట్ర నాయకుడు రంగప్రసాద్ చైర్మన్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది. తొమ్మిది మంది సభ్యుల్లో ఒకరు బీజేపీ నుంచి, మిగిలినవారు టీడీపీ నాయకులు ప్రాతినిథ్యం వహించనున్నట్లు తెలిసింది. కొత్త సంవత్సరంలో నూతన పాలకమండలి కొలువుదీరుతుందని టీడీపీ, బీజేపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు ఇటీవల జరిగిన బదిలీల్లో ఇన్చార్జి ఈవో త్రినాథరావును ద్వారకా తిరుమల ఈవోగా నియమించారు. రెవెన్యూ శాఖకు చెందిన నర్సింగరావును దుర్గగుడి ఈవోగా నియమించారు. ఆయన ఈ నెల 27న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈవో, పాలకమండలి సమన్వయంతో పనిచేసి దేవాలయ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని భక్తులు కోరుతున్నారు. సిబ్బంది నుంచే మొదలు కావాలి... దుర్గగుడిలో ఏఈవోల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు దీర్ఘకాలంగా ఇక్కడే పనిచేస్తున్నారు. బదిలీలపై ఇతర దేవస్థానాలకు వెళ్లినా రెండు, మూడేళ్లు పూర్తవగానే తిరిగి ఇక్కడికే వస్తున్నారు. దీంతో అధికారులు, ఉద్యోగులే పలు కాంట్రాక్టులను బినామీ పేర్లతో నిర్వహిస్తున్నారు. దుర్గాఘాట్‌లో షాపులు, చీరల కాంట్రాక్టు, దేవస్థానానికి సరుకుల సరఫరా, ప్రసాదాల తయారీ తదితర విషయాల్లో వీరిపాత్ర ఉందనేది బహిరంగ రహస్యం. అర్చకులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సీనియర్లు డ్యూటీలు చేయకుండా అసిస్టెంట్లతోనే అన్ని పనులు ముగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లదే హవా! దేవస్థానంలో కాంట్రాక్టర్ల హవా సాగుతోంది. ఐదుగురు కాంట్రాక్టర్లు కొండపై తిష్టవేసి అధికారులను సైతం శాసిస్తున్నారు. ఈ ఐదుగురే దుర్గగుడి సిబ్బంది సహాయంతో కీలక కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారు. వీరికి కాంట్రాక్టులు రాకపోతే కోర్టులకు వెళ్లి పనులు సాగకుండా అడ్డుకుంటున్నారు. దుకాణాల తొలగింపుపై దృష్టి పెట్టాలి ఇంద్రకీలాద్రి కొండపైన గడువు ముగిసినప్పటికీ దుకాణాలకు టెండర్లు పిలవలేదు. రాజకీయ నాయకుల చేతుల్లో దుకాణాలు ఉండటంతో దేవాదాయ శాఖ అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. కొత్తగా వచ్చే పాలకమండలి అయినా ఈ విషయంపై దృష్టి సారించాలి. భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచాలి.. భక్తులకు సౌకర్యాలు కూడా మెరుగపరాల్చిన అవసరం ఉంది. ముఖ్యంగా కాటేజీలు, మల్లికార్జున మహామండపం, రాజగోపురం పనులు పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలి. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు జిల్లాలో పర్యాటక ప్రదేశాల సమాచారం అందించాలి. -
పేరుకే పే..ద్ద ఆస్పత్రి
* రిమ్స్‌లో సకాలంలో అందని వైద్యం * నేలపైనే గర్భిణి ప్రసవం * అరగంటకుపైగా నరకయాతన * వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపాటు ఆదిలాబాద్ రిమ్స్ : కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రిమ్స్ ఆస్పత్రికి అధునాతన వైద్యం అందుతుందనే ఆశతో రోగులు వస్తే నిరాశే ఎదురవుతోంది. అసలే సౌకర్యాలు లేని ఈ ఆస్పత్రికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం తోడవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రినే దేవాలయంలా భావించి ఇక్కడికి వచ్చే ప్రజల పట్ల మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. దీంతో రిమ్స్ అభాసుపాలవుతోంది. శనివారం రిమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకున్న సంఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ నిండుచూలాలు నేలపైనే ప్రసవించాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉండగా.. ఆ పరిస్థితిలో ఆమె అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. తమ బాధ్యతను విస్మరించిన వైద్యులు, సిబ్బంది ఏం పట్టనట్లుగా వ్యవహరించడంపై స్థానికులు మండిపడ్డారు. నిండు చూలాలి నరకయాతన.. తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన గోరిబి తన కూతురు రిజ్వానను ఆస్పత్రికి తీసుకొచ్చింది. నిండు చూలాలైన ఆమెను రిమ్స్‌కు తీసుకురాగానే ఓపీ విభాగంలో పేరు నమోదు చేయించింది. రశీదు తీసుకున్న అనంతరం సంబంధిత వైద్యుని వద్దకు వెళ్లారు. అక్కడ ఆ వైద్యుడు చూడకుండానే రశీదును చూసి తన కేసు కాదని.. మరో వైద్యుని వద్దకు వెళ్లాలని పంపించాడు. దీంతో సదరు వైద్యుడి గది తెలియక తన కూతురును పట్టుకుని తల్లి గోరిబి ఆస్పత్రి అంతా తిరిగింది. అప్పటికే నొప్పులు రావడంతో ఓపీ విభాగంలోని పై అంతస్థులో గల ఏఆర్టీ సెంటర్ వద్ద ఆ గర్భిణి పడిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఎన్నో అవస్థలు పడి నేలపైనే ప్రసవించింది. అరగంటకు పైగా నరకయాతన అనుభవించి ఓ పాపకు జన్మనిచ్చింది. ఇంతటి ఘోరం జరుగుతున్నా అక్కడి సిబ్బందికి, వైద్యులకు సమాచారం లేకపోవడం గమనార్హం. ఆస్పత్రికి వచ్చిన కొంత మంది స్థానికులు రిమ్స్ ఆర్ఎంవో వినాయక్కుమార్కు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి సిబ్బంది పంపించాడు. తల్లీబిడ్డలను మెటర్నిటీ వార్డుకు తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారు. రిమ్స్‌కు వస్తే బిక్కుబిక్కే.. జిల్లా రిమ్స్ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే వారిలో సగానికిపైగా గ్రామీణ పేద ప్రజలే. ఇక్కడికి వచ్చే వారిలో చాలా మందికి ఆస్పత్రిలో ఎక్కడికి పోతే వైద్యం అందుతుందో తెలియదు. ఆస్పత్రికి వచ్చిన తర్వాత వైద్య పరీక్షల కోసం గంటల తరబడి తిరగాల్సిందే. ఇక నిరాక్షరాస్యులు ఆస్పత్రికి వస్తే అంతే సంగతి. ఒక రోజులో వారికి వైద్యం అందడం గగనమే. ఇలాంటి వారి కోసం ఆస్పత్రిలో విచారణ కౌంటర్ ఏర్పాటు చేసి ఆస్పత్రి సమాచారం చెప్పేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయాలి. ఎలాంటి సమాచారం కావాలన్నా రోగులు ఇక్కడ అడిగి తెలుసుకునే వీలుంటుంది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో రిమ్స్‌లో సరైన సమాచారం అందించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడం, ఉన్న వారు సైతం సహకరించకపోవడంతో నిత్యం ఆస్పత్రికి వచ్చే రోగులు అవస్థలు పడుతున్నారు. ఓపీ చిట్టి తీసుకుంది మొదలు వైద్యుడి వద్దకు వెళ్లాలంటే కచ్చితంగా ఆస్పత్రి అంతా తిరగాల్సిన పరిస్థితి రోగులకు నిత్యం ఎదురవుతోంది. ఒకవేళ సంబంధిత వైద్యుడికి చూపించిన తర్వాత అదే రోజు రక్త పరీక్షలు, ఎక్స్‌రేల పేరిట చికిత్స చేయరు. వాటి రిపోర్టులు రావాలంటే రెండు రోజులు పట్టాల్సిందే. అసలే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి మూడు రోజులపాటు ఆస్పత్రి చుట్టూ తిరిగడం వల్ల ఇటు ఆర్థిక భారంతోపాటు, అటు ఉపాధి కూలీ కూడా కోల్పోతున్నారు. దీనంతటికి కారణం ఆస్పత్రికి వచ్చే వారికి సరైన సమాచారం అందకపోవడమే. -
డిప్యూటీ సీఎం తనిఖీ చేస్తుండగానే.. బాలింత మృతి
కరీంనగర్ హెల్త్ : డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ రాజయ్య కరీంనగర్‌లోని ప్రధాన ఆస్పత్రిని తనిఖీ చేస్తుండగానే.. సిబ్బంది నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందింది. వివరాలు.. పెద్దపల్లి మండలం రాఘవపురానికి చెందిన వసంత పురిటినొప్పులతో అక్కడి పీహెచ్సీలో చేరింది. శుక్రవారం ఉదయం సాధారణ కాన్పులో మగశిశువుకు జన్మనిచ్చింది. రక్తస్రావం ఎక్కువై పరిస్థితి విషమించడంతో సిబ్బంది 108లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వసంత మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ఆ సమయంలో మంత్రి ఆస్పత్రిలోనే ఉండటంతో మృతదేహాన్ని ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే అంబులెన్స్‌లో తరలించారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని మంత్రి తెలిపారు. -
ప్రభుత్వాస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రమైన ప్రభుత్వ ఆస్పత్రిలో పని చే స్తున్న సిబ్బంది పనితీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఇక్క డ విధులు నిర్వహిస్తున్న వార్డుబాయ్ మొదలుకుని ఆస్పత్రి సూపరింటెండెంట్ వరకు రోగుల ఇక్కట్లను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. వారం రోజులుగా వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఈ నెల 18న ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన సదరన్ క్యాంప్ నిర్వహణలో వైద్యాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కని పించడంతో కలెక్టర్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో పాటు డీసీహెచ్‌ఎస్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇలా హెచ్చరించి రెండు రోజులు గడవక ముందే ఆస్పత్రి సిబ్బంది నిలువెత్తు నిర్లక్ష్యం మరో సంఘటనలో కొట్టొచ్చినట్లు కనిపించింది. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేటకు చెందిన పోలీసులు అ నారోగ్యానికి గురైన గుర్తు తెలియని మహిళకు వైద్యం చేయించేందుకు గాను మానవతా దృక్పథంతో విరాళాలు వేసుకుని ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే ఇక్కడి వార్డుబాయ్‌లు ఆమెను ఆస్పత్రిలోకి తీసుకెళ్లేందుకు కనీసం స్ట్రెక్చర్‌ను కూడా తీసుకురాకపోవడంతో ఆటో డ్రై వరు, హోంగార్డు జగదీశ్వర్‌రెడ్డి స్వయంగా ఆమెను లోనికి తీసుకెళ్లారు. అయితే రెండు గంటలైనా ఆమెకు వైద్యు చికిత్సలు ప్రారంభించలేదు. తాజాగా గురువారం రాత్రి శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన రేణుక, శివకుమార్ దంపతులు ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చి 24 గంటలు గడిచినా వైద్యం ప్రారంభించలేదని బాధితుడు ఆరోపించిన విషయం తెలిసిందే. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వై ద్యుల, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిం చినా జిల్లా ఉన్నతాధికారులు ఏ ఒక్కరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లే వు. దీంతో తాము చేసిందే వైద్యం, చె ప్పిందే వేదం అన్న చందంగా ఇక్కడి సిబ్బంది వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. బాయ్‌లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ప్రమాదం, అనారోగ్యానికి గురైన వారి ని అత్యవసర వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తీసుకువస్తే ఇక్కడికి వచ్చాక వార్డు బాయ్‌లు కనీసం రోగులను తీసుకెళ్లేందుకు రావడం లేదని 108 పెలైట్ వి జయ్‌కుమార్ తెలిపారు. మంగళవారం అందోల్ మండలం కోడెకల్ గ్రామానికి చెందిన మహిళకు కడుపునొప్పి రావడం తో వాహనంలో తీసుకువచ్చినా బాయ్ లు ఆమెను ఆస్పత్రిలోకి తీసుకెళ్లలేదన్నా రు. రోడ్డు ప్రమాద సంఘటనలో తమ కు సాయం చేయాలని కోరితే ఎవరు మిమ్మలను తీసుకురమ్మన్నారని మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.