సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రమైన ప్రభుత్వ ఆస్పత్రిలో పని చే స్తున్న సిబ్బంది పనితీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఇక్క డ విధులు నిర్వహిస్తున్న వార్డుబాయ్ మొదలుకుని ఆస్పత్రి సూపరింటెండెంట్ వరకు రోగుల ఇక్కట్లను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. వారం రోజులుగా వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఈ నెల 18న ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన సదరన్ క్యాంప్ నిర్వహణలో వైద్యాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కని పించడంతో కలెక్టర్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో పాటు డీసీహెచ్‌ఎస్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇలా హెచ్చరించి రెండు రోజులు గడవక ముందే ఆస్పత్రి సిబ్బంది నిలువెత్తు నిర్లక్ష్యం మరో సంఘటనలో కొట్టొచ్చినట్లు కనిపించింది.
రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేటకు చెందిన పోలీసులు అ నారోగ్యానికి గురైన గుర్తు తెలియని మహిళకు వైద్యం చేయించేందుకు గాను మానవతా దృక్పథంతో విరాళాలు వేసుకుని ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే ఇక్కడి వార్డుబాయ్‌లు ఆమెను ఆస్పత్రిలోకి తీసుకెళ్లేందుకు కనీసం స్ట్రెక్చర్‌ను కూడా తీసుకురాకపోవడంతో ఆటో డ్రై వరు, హోంగార్డు జగదీశ్వర్‌రెడ్డి స్వయంగా ఆమెను లోనికి తీసుకెళ్లారు. అయితే రెండు గంటలైనా ఆమెకు వైద్యు చికిత్సలు ప్రారంభించలేదు. తాజాగా గురువారం రాత్రి శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన రేణుక, శివకుమార్ దంపతులు ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చి 24 గంటలు గడిచినా వైద్యం ప్రారంభించలేదని బాధితుడు ఆరోపించిన విషయం తెలిసిందే. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వై ద్యుల, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిం చినా జిల్లా ఉన్నతాధికారులు ఏ ఒక్కరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లే వు. దీంతో తాము చేసిందే వైద్యం, చె ప్పిందే వేదం అన్న చందంగా ఇక్కడి సిబ్బంది వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి.
బాయ్‌లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు
ప్రమాదం, అనారోగ్యానికి గురైన వారి ని అత్యవసర వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తీసుకువస్తే ఇక్కడికి వచ్చాక వార్డు బాయ్‌లు కనీసం రోగులను తీసుకెళ్లేందుకు రావడం లేదని 108 పెలైట్ వి జయ్‌కుమార్ తెలిపారు. మంగళవారం అందోల్ మండలం కోడెకల్ గ్రామానికి చెందిన మహిళకు కడుపునొప్పి రావడం తో వాహనంలో తీసుకువచ్చినా బాయ్ లు ఆమెను ఆస్పత్రిలోకి తీసుకెళ్లలేదన్నా రు. రోడ్డు ప్రమాద సంఘటనలో తమ కు సాయం చేయాలని కోరితే ఎవరు మిమ్మలను తీసుకురమ్మన్నారని మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.