పురిటిపాట్లు! | Pregnant hospital in the premises of hope | Sakshi
Sakshi News home page

పురిటిపాట్లు!

Published Wed, Sep 9 2015 12:48 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

పురిటిపాట్లు! - Sakshi

పురిటిపాట్లు!

రెండు గంటల పాటు ఆస్పత్రి ఆవరణలోనే గర్భిణి నిరీక్షణ
గద్వాలలో ప్రసవం.. శిశువు మృతి

 
గట్టు: పురిటినొప్పులతో సోమవారం రాత్రి ఆస్పత్రికి చేరుకున్న గర్భిణి.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రెండు గంటలపాటు  నరకయాతన అనుభవించింది.  బంధువులు వేరే ఆసుప త్రికి తరలించి కాన్పు చేసినా శిశువు ప్రాణాలను కాపాడలేకపోయారు.. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో చోటుచేసుకుంది. గట్టు మండలం రాయపురం గ్రామానికి చెందిన గోవిందమ్మకు సోమవారం రాత్రి పురిటినొప్పులతో బాధపడు తుండగా ఓ ప్రైవేటు వాహనంలో గట్టులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

ఆస్పత్రిలో రెండుగంటలపాటు పురిటినొప్పుతో బాధపడుతున్న గోవిందమ్మకు సిబ్బంది కనీస వైద్య సహాయం కూడా అందించలేదు. దీంతో ఆస్పత్రి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు.. గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మంగళవారం తెల్లవారుజామున ఆడబిడ్డకు జన్మనివ్వగా పుట్టిన కొద్ది సేపటి తర్వాత శిశువు చనిపోయింది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement