రాజయ్యకు తిరిగి డిప్యూటీ సీఎం ఇస్తారా?
కరీంనగర్: టీఆర్‌ఎస్ సర్వే ఓ పెద్ద జోక్ అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సోమవారం ఇక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేయించుకున్న తన సర్వేలోనే 4వ ర్యాంక్ పొందిన మాజీ డిప్యూటీ సీఎం టి.రాజయ్యకు తిరిగి ఆ పదవి ఇస్తారా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తానంటున్నారని, అలా జరిగితే తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. తాను రాజ్యసభకు పోటీ చేస్తానంటూ రానున్న ప్రభుత్వం తమదేనని ఆయన చెప్పారు.