TRS survey
-
మంత్రిని అభినందించిన సీఎం కేసీఆర్
సాక్షి, ఖమ్మం: నగర పాలక సంస్థ ఎన్నికలపై అధికార టీఆర్ఎస్ దృష్టి సారించింది. నగర ఓటర్ల మనోభావాలను తెలుసుకునేందుకు ఒక అడుగు ముందుకేసింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత గోప్యంగా చేయించిన అంతర్గత సర్వే అనుకూలమని తేల్చినట్లు తెలుస్తోంది. 2016 ఎన్నికల్లో టీఆర్ఎస్ వశమైన నగర పాలక సంస్థ.. త్వరలో జరిగే ఎన్నికల్లోనూ ఖిల్లాపై పట్టు సాధించే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. ఇక సిట్టింగులు.. కొత్త ముఖాలు.. అసంతృప్తి ఉన్న ప్రాంతాలేమిటనే అంశాలపై పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. 2016లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 50 డివిజన్లకు.. 34 డివిజన్లలో విజయం సాధించింది. నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకుంది. అయితే త్వరలో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు ప్రతి డివిజన్లో సర్వే చేసిన బృందం అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి. ప్రతి డివిజన్లో 170 నుంచి 180 మందిని కలిసి.. ఇలా 8,754 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ప్రభుత్వ పనితీరు, నగరాభివృద్ధిపై ప్రజల్లో సానుకూలత, కొన్నిచోట్ల కార్పొరేటర్ల పనితీరుపై నెలకొన్న అసంతృప్తి సైతం వెల్లడైనట్లు తెలుస్తోంది. 50 డివిజన్లకు.. 46 డివిజన్లలో టీఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గు చూపినట్లు సర్వేలో వెల్లడైందని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి. అనేక చోట్ల కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉన్నట్లు సర్వే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే సర్వే ఫలితాలు పార్టీ అధినేత కేసీఆర్‌కు చేరడం, నగరంలో పార్టీ పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు వంటి అంశాలపై చేసిన సర్వే గురించి సీఎం కేసీఆర్.. మంత్రి అజయ్‌తో ఫోన్లో ప్రస్తావించి మెజార్టీ సీట్లు గెలుచుకోబోతున్నామని అభినందనలు తెలియజేసినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. దీంతో త్వరలో జరగనున్న నగర పాలక సంస్థ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే నగర కార్పొరేషన్లో డివిజన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో కొత్త ముఖాలకు సైతం పార్టీ తరఫున అవకాశం లభించనుంది. దాదాపు పది డివిజన్లు కొత్తగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుత కార్పొరేటర్లలో పలువురు తిరిగి పోటీ చేసేందుకు అనాసక్తిగా ఉండటంతో వారి స్థానాల్లో ఎవరికి అవకాశం ఇస్తారనే అంశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం టీఆర్ఎస్ కార్పొరేటర్లు 42 మంది ఉన్నారు. ఇందులో కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వారు సైతం ఉన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఎన్నికలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు ఇందుకోసం సమాయత్తమవుతున్నారు. ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల బాధ్యత టీఆర్ఎస్ పార్టీ తరఫున స్థానిక ఎమ్మెల్యేగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై ఉండటంతో నగరంలో జరుగుతున్న అభివృద్ధితోపాటు సర్వేకు తగ్గ ఫలితాలు వచ్చేలా డివిజన్లవారీగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం డివిజన్లవారీగా ప్రజాదరణ కలిగిన నాయకులు, సమస్యలపై అవగాహన ఉన్న నేతలకు సంబంధించి పార్టీ వివిధ రూపాల్లో అన్వేషణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. నగరంలో డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయడంతోపాటు వచ్చే రెండు నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పార్టీ ప్రాతినిధ్యం వహించని డివిజన్లలో ఎవరిని రంగంలోకి దించాలనే అంశంపై పార్టీ ఇప్పటికే దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి డివిజన్ నుంచి పది మందికి పైగా ఆశావహులు కార్పొరేటర్లుగా రంగంలో ఉండేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
రాజయ్యకు తిరిగి డిప్యూటీ సీఎం ఇస్తారా?
కరీంనగర్: టీఆర్ఎస్ సర్వే ఓ పెద్ద జోక్ అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సోమవారం ఇక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేయించుకున్న తన సర్వేలోనే 4వ ర్యాంక్ పొందిన మాజీ డిప్యూటీ సీఎం టి.రాజయ్యకు తిరిగి ఆ పదవి ఇస్తారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తానంటున్నారని, అలా జరిగితే తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. తాను రాజ్యసభకు పోటీ చేస్తానంటూ రానున్న ప్రభుత్వం తమదేనని ఆయన చెప్పారు. -
టీఆర్ఎస్కు గుబులు పట్టుకుంది: లక్ష్మణ్
హైదరాబాద్: అమిత్ షా వచ్చి వెళ్లాక పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఇక మీదట పార్టీకి సంబంధించిన అన్నీ కార్యక్రమాలు బూత్ కేంద్రంగానే నిర్వహిస్తామన్నారు. నగరంలోని కవాడిగూడలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. మోదీ మూడేళ్ల పాలన పూర్తైన సందర్భంగా ఈ 15 రోజుల్లో 8 వేల మంది కార్యకర్తలు 50 లక్షల కుటుంబాలను కలుస్తారు. మోదీ పాలన, పథకాలు, విజయాల గురించి ప్రజాల్లోకి తీసుకెళ్లడంతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతాం. అమిత్‌షా వచ్చి వెళ్లిన మూడు రోజులకే టీఆర్ఎస్కు గుబులు పట్టింది. అందుకే సర్వేల పేరుతో అబద్ధాలు చెప్తున్నారని మండి పడ్డారు. -
ముఖ్యమంత్రి ఓటమి ఖాయం
- గజ్వేల్‌లో కేసీఆర్ ఓడిస్తామన్న కాంగ్రెస్ - టీఆర్ఎస్ సర్వేపై నేతల ఘాటు విమర్శలు హైదరాబాద్: సర్వేల పేరుతో కేసీఆర్ గారడీలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి ఓటమి ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ విమర్శించింది. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పనితీరుపై నిర్వహించిన సర్వే పూర్తిగా బోగస్అని పేర్కొంది. ‘2019 ఎన్నికల్లో 111 స్థానాలు టీఆర్ఎస్వే’ అన్న సీఎం కేసీఆర్ ప్రకటనపై ప్రతిపక్షం భగ్గుమంది. ఆదివారం గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ముఖ్యనేతలు మీడియాతో మాట్లాడారు. అంతా బోగస్: షబ్బీర్ అలీ ‘కేసీఆర్ కొడుకు కేటీఆర్‌కు పొయినసారి 48 శాతం మార్కులోస్తే, ఇప్పుడు 91 శాతం వచ్చినట్లు చెప్పారు. అలా ఎలా సాధ్యమైంది? సరే, ఆయన(సీఎం) అన్నట్లు పరిపాలన అంత బాగుంటే ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లొచ్చుకదా? బోగస్ సర్వేలతో గారడి చేసుడెందుకు?’ ఆ ముగ్గురే గెలుస్తారు: కోమటిరెడ్డి ‘వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 111 స్థానాలుకాదు, మూడంటే మూడే స్థానాలు గెలుస్తుంది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు తప్ప ఏ ఒక్కరికీ డిపాజిట్లు దక్కవు. నిజంగా టీఆర్ఎస్కు దమ్ముంటే నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లాలి. ఒక వేళ గుత్తా గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా’ గజ్వేల్‌లో కేసీఆర్ ఓడిపోతారు: జీవన్‌రెడ్డి సర్వేల పేరుతో కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్టీమారినవాళ్లతో రాజీనామాలు చేయించాలి. అప్పుడే ప్రజలు ఎవరివైపు ఉన్నరో తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌లో ముఖ్యమంత్రి ఓటమి ఖాయం’ (ఉత్తమ్ ఓడిపోతారు.. మోదీ హవా ఉండదు) -
ఇదీ.. మీ పనితీరు
► సర్వే బాంబు ► ఎమ్మెల్యేల పని విధానంపై సర్వేల నివేదిక ► స్వయంగా వెల్లడించిన సీఎం కేసీఆర్ ► మీరు మారాలని శాసనసభ్యులకు క్లాస్ ► లోపాలను సరిదిద్దుకోవాలని ఆదేశం ► బహిరంగ సభలు నిర్వహించాలని సూచన ► సర్వేలో ఎర్రబెల్లి ఫస్ట్, వినయ్‌భాస్కర్ సెకండ్ ► ఆఖరులో ఎమ్మెల్యే రాజయ్య, మంత్రి చందూలాల్ సాక్షి, వరంగల్ : అధికార పార్టీలో సర్వే అలజడి నెలకొంది. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సర్వే వివరాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, ఎమ్మెల్యేల వ్యక్తిగత పనితీరు, ప్రజలకు అందుబాటులో ఉండడం, టీఆర్ఎస్పై ప్రజల స్పందన వంటి అంశాలతో ఈ సర్వే చేయించారు. రెండు దశల్లో చేసిన సర్వే వివరాలను సీఎం కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్ననేపథ్యంలో హైదరాబాద్‌లో గురువారం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పాత జిల్లాల వారీగా మంత్రులు, శాసనసభ్యులతో సీఎం ప్రత్యేకంగా సమావేశయమ్యారు. ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన సర్వే వివరాలను వారికి స్వయంగా అందజేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో అనుకూలత ఉన్నా... స్థానికంగా ఎమ్మెల్యేలపై ప్రతికూలత ఉందని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా లోపాలను వెంటనే సరిచేసుకోవాలని ఆదేశించారు. టీఆర్ఎస్పై, ఎమ్మెల్యేలపై ప్రతికూలత ఎక్కువగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. బాగా ప్రతికూలత ఉన్న నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని, స్వయంగా తానే ఈ సభలకు హాజరవుతానని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో సమన్వయం చేసుకుని బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాగా, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. శాసన సభ్యుల పనితీరుపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2016 అక్టోబర్‌లో, 2017 జనవరిలో రెండు దశలుగా సర్వేలు నిర్వహించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలను అందరు ఎమ్మెల్యేలకు అందజేశారు. ► పనితీరు పరంగా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సర్వేలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ► నర్సంపేట నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దొంతి మాధవరెడ్డి పనితీరు పరంగా ఆఖరు స్థానంలో ఉన్నారు. ► స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య 11వ స్థానంలో, ములుగుకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి అజ్మీరా చందూలాల్ 10వ స్థానంలో ఉన్నారు. -
ఇదిగో..మీ పనితీరు
► ఉమ్మడి జిల్లా 12 మంది ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ మార్కులు ► పైళ్ల టాప్.. ఆ తర్వాత వేముల వీరేశం ► అట్టడుగున పద్మావతి, భాస్కరరావు... కిశోర్‌ది కూడా అదే బాట... ► గత సర్వే కన్నా ఈసారి సర్వేలో మంత్రి జగదీశ్‌రెడ్డికి తక్కువ ఆదరణ ► గతం కన్నా మెరుగైన స్థితిలో జానా, కూసుకుంట్ల ► ఉత్తమ్, కోమటిరెడ్డి, సునీత, రవీంద్రకుమార్లకూ తగ్గిన ఆదరణ ► అంతర్గత సర్వే వివరాలను జిల్లా టీఆర్ఎస్ నేతలకిచ్చిన కేసీఆర్ ► ఆరునెలల్లోనే రెండు సార్లు సర్వే జరిగిందంటున్న టీఆర్ఎస్ వర్గాలు ► పార్టీ పరంగా నకిరేకల్ ఫస్ట్...మిర్యాలగూడ లాస్ట్ సాక్షి, నల్గొండ: ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఎన్నికై మూడేళ్లు కావస్తోంది. శాసనసభ సభ్యులుగా ఆయా నియోజకవర్గాల్లో మూడేళ్లుగా మన ఎమ్మెల్యేలంతా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి వారి స్థాయిల్లో తమదైన శైలిలో పని చేసుకుంటూ వెళుతున్నారు మన ఎమ్మెల్యేలు. మూడేళ్లు పూర్తయ్యే సమయంలో ఈ ఎమ్మెల్యేలకు ‘పరీక్ష’ ఫలితాలు వచ్చాయి. శాసనసభ్యులుగా వారి పనితీరు ఎలా ఉందన్న దానిపై అధికార టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వే వివరాలు బయటకు వచ్చాయి. ఇంకేముంది.... ఆ సర్వేలో ఎవరికెన్ని మార్కులు వచ్చాయి... ఏ ఎమ్మెల్యేకు ఎక్కువ మార్కులు వచ్చాయి... మా ఎమ్మెల్యేకు ఎన్ని వచ్చాయి... ఇదేగా మీ ఉత్కంఠ... అయితే, ఇదిగో చదవండి. భువనగిరి, నకిరేకల్ ఎమ్మెల్యేలు టాప్... టీఆర్ఎస్ తాజాగా నిర్వహించిన అంతర్గత సర్వేల ఫలితాల ప్రకారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎక్కువమార్కులు పొందారు. ఈ ఇద్దరే జిల్లా నుంచి టాప్‌లో ఉన్నారు. ఆరునెలల వ్యవధిలో రెండుసార్లు నిర్వహించిన సర్వేల్లోనూ ఇద్దరికీ మంచి ఫలితాలే వచ్చాయి. మొదటి సర్వేలో భువనగిరి ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి పనితీరుపై 71.20శాతం మంది ప్రజలు ఓకే అంటే రెండో సర్వేలో మరో 10శాతం మంది అధికంగా 81.90శాతం మంది ఓకే అన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం కూడా ప్రజల్లో మంచి మార్కులే సంపాదించారు. ఈయన పనితీరు పట్ల మొదటి సర్వేలో 71.90 మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయగా, రెండో సర్వేలో రెండు శాతం తక్కువగా...అంటే 69.70 మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. అధికార పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరు ప్రజామోదంగానే ఉందని ఈ సర్వే ఫలితాలు చెపుతున్నాయి. మరో ఐదుగురికి 50శాతం పైమాటే.. మిగిలిన వారి విషయానికి వస్తే మరో ఐదుగురు ఎమ్మెల్యేల పనితీరు పట్ల కూడా ఆయా నియోజకవర్గాల్లోని ప్రజల్లో 50 శాతం మంది సంతృప్తితోనే ఉన్నారని సర్వే ఫలితాలు చెపుతున్నాయి. వీరిలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కె.జానారెడ్డి, హుజూర్నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు రెండో సర్వేలో 50శాతం కన్నా ఎక్కువ మంది ప్రజలు ఓకే చెప్పారు. అయితే, ఇందులో ఉత్తమ్, కోమటిరెడ్డి, రవీంద్రకుమార్లకు తొలి సర్వే కన్నా కొంచెం ఆదరణ తగ్గగా, తొలి సర్వే కంటే మునుగోడు, నాగార్జునసాగర్ ఎమ్మెల్యేలకు ఎక్కువ ఆదరణ కనిపించింది. మొత్తంమీద ఈ ఐదుగురు కూడా ప్రజల్లో మంచి అభిప్రాయాన్నే సంపాదించుకున్నారని టీఆర్ఎస్ అంతర్గత సర్వేలో వెల్లడైంది. రెండో సర్వేలో... జిల్లా నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట ఎమ్మెల్యే జి. జగదీశ్‌రెడ్డి తొలి సర్వేలో 12 మంది ఎమ్మెల్యేల్లోనే అత్యధికంగా 94.30 మార్కులు తెచ్చుకోగా, రెండో సర్వేలో మాత్రం పడిపోయారు. ఆయన పనితీరు పట్ల కేవలం 45.40 మంది ప్రజలు మాత్రమే సంతృప్తితో ఉన్నారని సర్వే ఫలితాలు చెపుతున్నాయి. అసెంబ్లీలో విప్‌గా ఉన్న ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతది కూడా అదే పరిస్థితి. తొలి సర్వేలో ఆమెకు 73.70 శాతం మంది ప్రజలు మద్దతు పలకగా, రెండోసారి నిర్వహించిన సర్వేలో కేవలం 45శాతం మందే మద్దతిచ్చారు. ఈ ఇద్దరు నేతలు ఎమ్మెల్యేలుగా పాసయ్యారు కానీ...రెండు సర్వేల్లో లభించిన ఆదరణ విషయంలో కొంత తిరోగమనం ఉండడం గమనార్హం. ఈ ముగ్గురికి... మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, గాదరి కిశోర్, భాస్కరరావులకు తక్కువ మార్కులు వచ్చినట్లు సర్వే ఫలితాలు చెపుతున్నాయి. వీరు ముగ్గురికీ 40 కన్నా తక్కువ శాతం మార్కులే వచ్చాయి. ఉమ్మడి జిల్లాలోనే అందరికంటే తక్కువగా కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డికి ఆ నియోజకవర్గంలోని కేవలం 31.80 శాతం మంది నుంచే మద్దతు లభించింది. మొదటి సర్వేలోనూ ఆమెకు అత్తెసరు మార్కులే వచ్చాయని సర్వే ఫలితాలు చెపుతున్నాయి. అందులో ఆమెకు 38.30శాతం మంది ప్రజలు మద్దతిచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా రెండు సర్వేల్లోనూ వెనుకబడ్డారు. ఆయనకు తొలి సర్వేలో కేవలం 36 శాతం మంది ప్రజలు మద్దతిస్తే, రెండో సర్వేలో అంతకంటే తక్కువగా 34.70 మంది మద్దతు మాత్రమే లభించింది. మరో ఎమ్మెల్యే గాదరి కిశోర్ పరిస్థితి కూడా ఇంచుమించు అదే విధంగా ఉందని సర్వే ఫలితాలు చెపుతున్నాయి. ఆయన పనితీరు పట్ల మొదటి సర్వేలో 67.40శాతం మంది ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమయితే, రెండో సర్వేలో కేవలం 35.80 మంది మాత్రమే ఓకే అనడం గమనార్హం. -
మీరూ 66 సర్వేలు చేసుకోండి: తుమ్మల
హైదరాబాద్: తమ పాలనను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, గవర్నర్ అబద్దాలు చెబితే చర్చలో పాల్గొని దమ్ముంటే ఆ విషయాలు చెప్పాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిలదీశారు. విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు మదన్‌లాల్, కనకయ్య, మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలతో కలిసి ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ అంతర్గతంగా చేసుకున్న సర్వేపై కాంగ్రెస్‌కు ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. కావాలంటే మీరు 66 సర్వేలు చేసుకోండి ఎవరు వద్దన్నారు అని అన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని మొత్తం వినకుండానే కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేయడం రాజ్యాంగాన్ని అవమానపరచడమే అవుతుందన్నారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆస్వాదిస్తున్నారన్నారు. కాంగ్రెస్ జన ఆవేదన సభ, టీడీపీ ప్రజాపోరు యాత్ర ప్రజలు దూరంగా ఉన్నారని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో తెలంగాణాకు వచ్చింది 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు కాగా తమ రెండేళ్ల పాలనలో 2700 కిలోమీటర్లు వచ్చాయన్నారు. పక్కా ఇళ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు విమర్శించారు. వ్యవసాయం గురించి తెలియని పెద్దమనిషి వ్యవసాయం సంక్షోభంలో ఉందనటం హాష్యాస్పదం ఉందని ఎద్దేవా చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ హౌసింగ్ మంత్రిగా కట్టని ఇళ్లకు బిల్లులిచ్చి డబ్బులు నొక్కేయలేదా అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బతుకు బజారే అవుతుందని విమర్శించారు. -
మంత్రుల గ్రాఫ్ ఢమాల్!
-
మంత్రుల గ్రాఫ్ ఢమాల్!
అధికార టీఆర్ఎస్ సర్వేల్లో వెల్లడి ♦ ప్రజాదరణలో దూసుకుపోతున్న సీఎం కేసీఆర్ ♦ కేటీఆర్, తలసాని సహా పది మందికి తగ్గిన గ్రాఫ్ ♦ హరీశ్, పోచారం, ఈటలకు పెరిగిన మద్దతు ♦ సర్వేల నివేదికలను మంత్రులు, ఎమ్మెల్యేల ముందు పెట్టిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనూహ్యమైన ప్రజాదరణతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దూసుకుపోతుండగా... ఆయన మంత్రివర్గంలోని మెజారిటీ మంత్రులు మాత్రం జనం మద్దతు కోల్పోతున్నారు. ముగ్గురు మంత్రులు మాత్రం తమ గ్రాఫ్‌ను బాగా పెంచుకున్నారు. టీఆర్ఎస్ అధినాయకత్వం మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై వారి నియోజకవర్గాల్లో చేయించిన సర్వేల్లో ఈ విషయం వెల్లడైంది. దాదాపు ఏడాది కింద ఒక సంస్థతో సర్వే చేయించగా.. తాజాగా ఇటీవల మరో సంస్థతో సర్వే చేయించారు. ఈ రెండు సర్వేల ప్రకారం గతేడాదిగా సీఎం కేసీఆర్ తన నియోజకవర్గం గజ్వేల్‌లో అనూహ్య స్థాయిలో ప్రజాదరణ పెంచుకున్నారు. తొలి సర్వేలో 75.7 శాతం ప్రజాదరణ పొందిన కేసీఆర్.. ఇటీవలి సర్వేలో 96.70 శాతం మద్దతు పొందారు. రెండు సర్వేల్లో తేలిన ప్రకారం: కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నర తరువాత 2016 మధ్యలో మంత్రులు, అన్ని పార్టీల ఎమ్మెల్యేల పనితీరు, ప్రజాదరణపై సర్వే చేయించారు. తిరిగి ఇటీవల మరో సంస్థ ద్వారా ప్రజాభి ప్రాయాన్ని సేకరించారు. గురువారం టీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ తరువాత జిల్లాల వారీగా శాసనసభ్యులతో సమావేశమైన సీఎం కేసీఆర్.. ఈ సర్వేల నివేది కలను వెల్లడించారు. ప్రజాదరణ తగ్గుతున్న వారిని సున్నితంగా మందలించారు. పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని కొద్దిమందిని హెచ్చరించినట్లు తెలిసింది. ఇక ముందటి కంటే ఎక్కువ ప్రజాదరణ కూడగట్టుకున్న వారికి అభినందనలు తెలిపారు. ముగ్గురు మినహా: రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి సహా 17 మంది ఉండగా.. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శాసన మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగతా 14 మంది ప్రత్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికై మంత్రి పదవులు అధిష్టించారు. వీరిలో కేసీఆర్‌తోపాటు మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి గత సర్వే నాటి కంటే తమ ప్రజాదరణను పెంచుకోగా... మంత్రి కేటీఆర్ సహా 10 మంది మంత్రులు గత సర్వేతో పోల్చితే ప్రజాదరణ కోల్పోతున్నట్లు వెల్లడైంది. వరంగల్ జిల్లా ములుగు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అజ్మీరా చందూలాల్ ఏడాది కాలంలో ఏకంగా 48 శాతం ప్రజల మద్దతు కోల్పోయారు. తొలి సర్వేలో ఆయనకు 82.4 శాతం మద్దతు లభించగా.. ఈ సారి 34.40 శాతానికి పడిపోయింది. వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి ఎన్నికైన మహేందర్‌రెడ్డి దాదాపు 30 శాతం ప్రజా మద్దతు కోల్పోయినట్లు తాజా సర్వే వెల్లడించింది.