భద్రాచలాన్ని జిల్లాగా చేయాలి | Bhadrachalam should be in the district | Sakshi
Sakshi News home page

భద్రాచలాన్ని జిల్లాగా చేయాలి

Published Sun, Sep 14 2014 1:14 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

భద్రాచలాన్ని  జిల్లాగా చేయాలి - Sakshi

భద్రాచలాన్ని జిల్లాగా చేయాలి

సీఎంకు ఎమ్మెల్యే రాజయ్య లేఖ

హైదరాబాద్ : గిరి జన ప్రజల సామాజిక, ఆర్థిక అవసరాల దృష్ట్యా భద్రాచలాన్ని జిల్లాగా చే యాలని సీఎం కేసీఆర్‌ను సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య కోరారు. శనివారం ఈ మేరకు సీఎంకు ఆయన ఒక లేఖ రాస్తూ  భౌగోళికంగా చూసినా ఖమ్మం జిల్లాలో భద్రాచలాన్ని రెండో జిల్లాగా ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక ఈ ప్రాంతానికి పర్యాటకుల రాకపోకలు బాగా పెరిగినందున భద్రాచలం జిల్లా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

రామయ్యకు వినతి

భద్రాచలం: భద్రాచలాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారికి అఖిలపక్షం ఆధ్వర్యంలో శని వారం వినతిపత్రం అందజేశారు. జిల్లా కేంద్రం ఏర్పాటు విషయంలో సీఎం కేసీఆర్‌కు వస్తున్న వేర్వేరు ఆలోచనలను రూపుమాపి, భద్రాచలాన్ని జిల్లాగా చేసేలా మనసు మార్చాలని రామయ్య ను వేడుకున్నారు. అఖిలపక్ష కమిటీ కన్వీనర్ కోడూరి సత్యనారాయణ, డాక్టర్ ఎస్‌ఎల్ కాంతారావు, సత్యనారాయణ, సిద్దులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement