తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్యకు మంగళవారం సాయంత్రం తీవ్రమైన గుండెపోటు వచ్చింది. రాజయ్యను వెంటనే హైదర్గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. రాజయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, పల్స్ రేటు పెరిగినట్టు వైద్యులు గుర్తించారు. ఆయనను 24 గంటల పాటు వైద్యుల పరిశీలనలో ఉంచనున్నారు. రాజయ్యకు బీపీ, షుగర్ ఉన్నట్టు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజయ్యను పదవి నుంచి తొలగించిన వరంగల్ ఎంపీ కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిగా నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన మనస్థాపం చెందినట్టు అనుచరులు చెబుతున్నారు. రాజయ్య ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రులు ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు.