
డిప్యూటీ సీఎం క్షమాపణలు చెప్పాలి
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ డిప్యూటీ సీఎం టి.రాజయ్య వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్కుమార్ డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ అసెంబ్లీలో రాజయ్య... సోనియా గాంధీపై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమైనవని వ్యాఖ్యానించారు.
డిప్యూటీ సీఎం రాజయ్య వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరినట్లు చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా జరిగిన బలిదానాలకు సోనియాగాంధీయే కారణమని రాజయ్య శనివారం అసెంబ్లీలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంపత్ కుమార్పై విధంగా స్పందించారు.