వైద్య ఆరోగ్యశాఖ హైదరాబాద్ ఆరో జోన్ పరిధిలోని 6 జిల్లాల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది బదిలీలు, డిప్యుటేషన్లలో...
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖ హైదరాబాద్ ఆరో జోన్ పరిధిలోని 6 జిల్లాల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది బదిలీలు, డిప్యుటేషన్లలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని కోరుతూ లోకాయుక్తకు నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌నేత పున్న కైలాశ్ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలోని కీలక అధికారి, ఆయనకు సహకరించిన మరికొందరు సీనియర్ ఉద్యోగులపై విచారణ చేపట్టాలని కోరారు. వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రి రాజయ్య హయాంలో జరిగిన ఈ అక్రమాల్లో రూ. కోట్లు చేతులు మారాయని అందులో పేర్కొన్నారు. ఉద్యోగుల సరెండర్ పేరుతో డబ్బులు పుచ్చుకొని ఇష్టమైన చోటుకు డిప్యుటేషన్లపై బదిలీ చేశారని పేర్కొన్నారు. పలు సందర్భాల్లో వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను ఫిర్యాదుతో పాటు జతచేశారు.