
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే రాజయ్య
భద్రాచలం : భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అస్వస్థులయ్యారు. మూడు రోజులుగా దగ్గు, జలుబుతో; శుక్రవారం రాత్రి నుంచి తీవ్ర జ్వరంతో బాధపడతున్న ఆయన శనివారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరారు. దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతూనే మూడు రోజులపాటు వివిధ ప్రాంతాలల్లో పర్యటించారు. దీంతో జ్వరం సోకి అస్వస్థులయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో శనివారం హైదరాబాద్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశాలకు ఆయన హాజరుకాలేకపోయారు. ఆయనను సీపీఎం నాయకులు, పలువురు ప్రముఖులు పరామర్శించారు.