
'పారదర్శకత కోసమే నన్ను తొలగించారు'
హైదరాబాద్:
ప్రభుత్వ పారదర్శకత కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ తనని కేబినెట్ నుంచి తొలగించారని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. సోమవారం కేసీఆర్తో జరిగిన భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ తనని గుర్తించి అడగకుండానే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని రాజయ్య తెలిపారు. పార్టీలో తనకి సహకరించిన వారందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మంగళవారం జరగబోయే పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి తనని కేసీఆర్ ఆహ్వానించారని, ఈ సమావేశానికి హాజరు కాబోతున్నట్లు రాజయ్య చెప్పారు.