
విలపిస్తున్న ఎమ్మెల్యే రాజయ్య
స్టేషన్‌ఘన్‌పూర్: బీఆర్‌ఎస్ పార్టీలో చేరినప్పటినుంచి ఇప్పటివరకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు వీర విధేయుడిగా ఉన్నానని, ఆయన గీసిన గీత దాటేది లేదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. రాజయ్యకు టికెట్ రాని నేపథ్యంలో జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఆయన వర్గీయులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిని చూసిన రాజయ్య భావోద్వేగానికి గురై బోరున విలపించారు. దీంతో ఆయన వర్గీయులు కొందరు కంటతడి పెడుతూ రాజయ్యకు అనుకూలంగా నినాదాలు చేశారు.
తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎమ్మెల్యే కన్నీరుమున్నీరయ్యారు. ఒకదశలో క్యాంపు కార్యాలయంలో కిందపడి, మోకరిల్లి విలపించారు. దీంతో పక్క నే ఉన్న ఆయన భార్య, అభిమానులు, పార్టీ శ్రేణు లు కూడా ఏడుస్తూనే ఆయన్ను సముదాయించారు. ఆయన మాట్లాడుతూ ఘన్‌పూర్ టికెట్ విషయమై ఇటీవల పరిణామాలు ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. తన స్థాయికి తగ్గకుండా సముచిత స్థానం కల్పిస్తానని సీఎం హామీ ఇచి్చనట్లు తెలి పారు. ప్రజల్లో ఉండటమే తనకు ఇష్టమని, నియో జకవర్గమే దేవాలయమని, అవసరమైతే ప్రాణాలు సైతం ఇస్తానన్నారు. అనంతరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి విలపించారు. ఎమ్మెల్యే సతీమణి ఫాతిమా తదితరులు వెంట ఉన్నారు.