సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్‌ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. ప్రచారంలో దూసుకుపోతోంది. ఇక, ఈరోజు నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు.
రెండో విడతలో భాగంగా నేడు సీఎం కేసీఆర్ బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో బీఆర్ఎస్ ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. ఇక, ఈ నెల 28న వరంగల్ ఈస్ట్, వెస్ట్ తోపాటు గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఈ నెల 28వ తేదీ వరకు 54 సభల్లో పాల్గొంటారు. ఇప్పటికే తొలి విడుత ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment